Skip to main content

Posts

Showing posts from October, 2019

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

Yama Tarpanam vidhi on 27-10-2019 morning

Yama Tharpanam is an important ritual performed on Naraka Chaturdasi day by many Hindu communities in  South India. Yama Tharpanam 2019 date is October 27. The ritual is dedicated to dead ancestors, dead parents and dead relatives.. The Tarpan is performed on the morning of Narak Chaturdashi day. The person who is performing the ritual sits facing south and offers Tarpan to the dead. When the ritual is dedicated to dead parents, the Tarpan is made using Til (Black Sesame seeds).

జమ్మి చెట్టు ప్రాముఖ్యత

జమ్మిచెట్టు విజయానికి సంకేతం. శమీవృక్షంలో అగ్ని నిక్షిప్తమై ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అగ్ని వీర్యమే సువర్ణం అంటారు. అందుకే  జమ్మి బంగారం కురిపించే కల్పవృక్షంగా పూజలందుకుంటోంది. అందుకే యజ్ఞ యాగాదుల వేళ జమ్మి కొమ్మల రాపిడి ద్వారా మాత్రమే అగ్నిని సృష్టిస్తారు. అలాంటి శమీ వృక్షం దేవీ రూపమని, విజయదశమి రోజు శమీపూజ చేసేవారికి అమ్మలగన్న అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని దేవీ భాగవతం చెప్తోంది.    రావణుడిపై యుద్ధానికి వెళ్లే ముందు శ్రీరాముడు శమీ పూజ చేసినట్లు రామాయణం ద్వరా తెలుస్తోంది. ద్వాపరయుగంలో అజ్ఞాత వాసానికి వెళ్లేముందు పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపైనే ఉంచి అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత విజయ దశమినాడు ఉత్తర గోగ్రహణం కోసం అర్జునుడు శమీ వృక్షాన్ని పూజించి గాండీవాన్ని ధరించి అద్భుత విజయాన్ని అందుకున్నట్లు మహాభారతం చెప్తోందియ. దసరా రోజు శమీ పూజ చేసేవారికి అమ్మవారి కృప లభించటమే గాక శనిదోష నివారణ జరుగుతుందట.    దసరా సాయంత్రం వేళ ఆలయాలు, చెరువుల వద్ద ఉండే జమ్మి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షణలు చేస్తారు. శాస్త్రోక్తంగా జమ్మిని పూజించి జమ్మి ఆకును ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని

Aigiri Nandini With Lyrics | Mahishasura Mardini | Rajalakshmee Sanjay |...

Maharnavami yanthra puja

యంత్రము  అనగా నియమ నిష్టలతో నియంత్రించేది అని అర్థం. దేవతలకు నివాసయోగ్యమైన గృహము అని అర్థము. ఈ యంత్రమునే దేవతా నగరం, దేవత వాస స్థానం అని కూడా అంటూ ఉంటారు. యంత్రములో కొలువైయున్న సమస్త దేవతామూర్తులు సకల దోషములను నివృత్తి చేసి మానవజాతికి శుభములు చేకూరుస్తాయి. కాబట్టి యంత్రములను సిద్ధిచేసి, పరిపూర్ణమైన పంచొపచార పూజ , ప్రక్రియలు అన్నీ శ్రద్ధగా చేసి స్థాపన చేసినట్లైతే యంత్రము యొక్క పరిపూర్ణ ఫలితములు పొందవచ్చు. కాకపోతే ఆ యంత్రమునకు మనము నిర్వర్తించే పూజ ప్రక్రియలపై వాటి ఫలితము ఆధారపడి ఉంటుంది. యంత్రము, మంత్రము, తంత్రము ఇవన్నీ కలిస్తేనే పూజా అని అంటారు. ఔషధ ప్రయోగముకు, రాజ్యపాలనముకు, దేవాలయ నిర్మాణముకు, దేవాలయ ఉత్సవాలకు, దేవాలయ నిత్య ఆరాధనలు, దేవాలయ ఆగమ శాస్త్రములు, వామచారము ఇవన్నిటిని తంత్రములు అని పిలుస్తారు.  యంత్రములోని మధ్యభాగములో దైవశక్తి కేంద్రీకరించబడి ఉంటుంది అని తంత్ర శాస్త్రములోని నమ్మకము. ఒక్కొ యంత్రము  ఆ యా దేవతామూర్థులకు సంబంధించి నిర్ధిష్టమైన రేఖా చిత్రాల రూపములో చెక్కబడి ఉంటుంది. తంత్ర శాస్త్రములో శక్తికి, శక్తి యొక్క ప్రతిరూపాలకి ఈ యంత్రమును ఉపయోగిస్తారు. ఎంతో శక్తివంతమైన యంత