Skip to main content

Posts

Showing posts from 2024

చైత్ర శుద్ధ పౌర్ణమి శ్రీ హనుమత్ విజయోత్సవం - జయంతి కాదు తేదీ 23-4-2024

  శ్రీ హనుమాన్ విజయోత్సవం విశిష్టత ఏమిటి శ్రీరామునికి అత్యంత నమ్మకమైన బంటు హనుమంతుడు. శ్రీరాముడు సీతను ఎడబాసి మానసిక క్షోభను అనుభవిస్తూ, సీత జాడ వెతుకుతున్న సందర్భ సమయంలో అడవిలో రాముడుకి హనుమంతునితో పరిచయం ఏర్పడినది. పరిచయం ఏర్పడిన నాటి నుండి శ్రీరామచంద్రున్ని హనుమంతుడు విడిచి ఉండలేదు, రాముడే తన సర్వస్వంగా భావించిన వాయునందనుడు తన ప్రభువైన రాముని మాట ఏనాడు జవదాటలేదు. చివరికి రాముడు రావణునితో యుద్ధం చేసి సీతను తీసుకుని అయోధ్యకు వచ్చి శ్రీ రామ పట్టాభిషేకం అయిన తర్వాత రామునికి అనిపిస్తుంది నేను హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీత తిరిగి వచ్చినది, తిరిగి అయోధ్య నగరంలో రాముని పట్టభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉండడం గ్రహించిన రాముడు నాకు అన్ని వేళల హనుమంతుడు సహాయంగా ఉన్నాడు అని తన విజయం హనుమంతుని సహకారం ఎంతగానో తోడ్పడినది అని రాముడు చైత్ర పౌర్ణమి రోజు హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు. నాటి నుండి ఆ రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకుని తమ రాజైన రాముడు ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజు సన్మానం చేసాడో ప్రతి సంవత్సరం చైత్రపౌర్ణ మి రోజు శ్రీ హనుమత్ విజయోత్సవంగా నాటి నుండి నేటి

అన్న ప్రాశన పూజ సామగ్రి వివరాలు

 // శ్రీ రామ  // పసుపు 200 గ్రాములు,  కుంకుమ 50 గ్రాములు,  బియ్యం 2 కిలోలు,  తమల పాకులు 50, నల్లని పోక వాక్కలు 15, ఖర్జూరం 11, పసుపు కొమ్ములు 11, ఆచమనం పాత్ర 1, పూలు, పూల దండలు, మామిడి కొమ్మ 1,  అన్నం పాయసం , ఆవు పాలల్లో ఉడ కాలి. బెల్లం,ఆవు నెయ్యి తో ఉండాలి.  కొబ్బరి కాయ, 1, రాగి చెంబు 1, తెల్లని వస్త్రము (బంగారు అంచు ఉండాలి ) కనుము బట్టలు 2, ఆవు పంచితం 50 ml , గంధం,  చిల్లర నాణెములు 15, దీపాలు 2, వత్తులు , అగ్గిపెట్టె 1, ఆగరబత్తి, కర్పూరం పాకెట్, 1, పూజారి దక్షిణ Rs .2,000/-

పెండ్లి పత్రిక, పూలు, పండ్లు తాంబూలాల మార్పిడి కార్యక్రమం పూజ సామగ్రి

                                                      //  జై శ్రీరామ్ // పసుపు 100 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం ఒక చిన్న డబ్బా ,  మంచి బియ్యం 3 కిలోలు,  తమల పాకులు 50,  నల్లని పోక వక్కలు 25,  ఖర్జూరం కాయలు, 15, పూలు, పూల దండలు, ఆవు పంచితం, 50 ml . అయిదు రకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున ఇందులో అరటిపండ్లు పెట్టగూడదు.  ఆగరబత్తి , పాకెట్,  సెంట్ సీసా చిన్నది 1, రోజ్ వాటర్ చల్లడానికి  కర్పూరం పాకెట్, 1, తెల్లని వస్త్రములు 2, (బంగారు అంచు తో  ఉండాలి ) అమ్మాయి/అబ్బాయి కి కొత్త బట్టలు, ఆభరణాలు, etc .  వారి తల్లి తండ్రులకు, ఆడ పడుచులకు  కూడా బట్టలు పెట్టాలి.  కనుము బట్టలు 2,  స్వీట్ బాక్స్, 1,  కాజు, బాదం, ఎండు ద్రాక్ష పాకెట్ , etc . ఎండు కుడుకలు 5,  నె య్యి దీపాలు 2, అగ్గిపెట్టె 1 , వత్తులు  ఇంటి దేవుని ఫోటో 1, రాగి చెంబు 1 , ఆచమనం పాత్ర 1  చాపలు , లేదా పీటలు 2, బ్రాహ్మణ దక్షిణ 5,001/- 

పాప విమోచి ని ఏకాదశి తేదీ 5-4-2024 శుక్రవారం

  పాపమోచని ఏకాదశి చాలా ప్రభావవంతమైనదని పండితులు చెబుతుంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటూ.. శ్రీ మహా విష్ణువు ఆరాధిస్తే మీ పాపాలన్నీ తొలగిపోతాయని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడని నమ్ముతారు. ఈ రోజున నిజమైన మనసుతో ఉపవాసం ఉండటంతో పాటు విష్ణువును పూర్తి ఆచారాలతో ఆరాధించడం ద్వారా, మోక్షాన్ని పొందుతారు. పాపమోచని వ్రత కథ: ఒక అడవిలో ఓ రుషి పరమేశ్వరుడి కోసం తపస్సు ప్రారంభిస్తాడు. తపస్సులో మునిగిపోయిన ఆ రుషిని అప్సరస లాంటి ఓ యువతి భంగం కలిగిస్తుంది. కళ్లు తెరిచి చూసే సరికి అందాల కుందనపు బొమ్మలా ఉన్న ఆ యువతిని చూసి ఆ రుషి మనసు చలించిపోతుంది. తనను మోహిస్తాడు. తనతో ప్రేమలో పడతాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు రతీ క్రీడల్లో మునిగిపోతాడు ఆ రుషి. కొంత కాలం తర్వాత ఒకానొక రోజు ఆ యువతి తన గురించి చెబుతూ తనను ఇంద్రుడు పంపించాడని, అనుమతిస్తే తిరిగి స్వర్గలోకానికి వెళ్లిపోతానని వేడుకుంటుంది. తన మాటలు విన్న ఆ రుషి కోపోద్రిక్తుడు అవుతాడు. ఆ యువతి వల్లే తన తపస్సు చెడిపోయిందని ఆవేశంలో యువతిని శపిస్తాడు. ఏ అందంతో తన దృష్టి మరల్చిందో ఆ అందం పోయి పిశాచిలా మారిపోవాలి శపిస్తాడు. అప్పుడు ఆ యువతి రుషి కాళ్లపై పడి తనను క్షమించమన

Ugaadi festival on 9-4-2024 Tuesday

  తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి,  ఉగాది  పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. " ఉగాది పచ్చడి " ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన  ఉగాది పచ్చడి  తెలుగువారికి ప్రత్యేకం. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి ఇచ్చే సందేశం. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతిగా నిలుస్తాయి. ఈ పచ్చడిలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందని తెలుపుతోంది. శ్లోకం:  శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌ కరాయచ  సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడిని తీసుకోవాలి ఉగాది పర్వదినం రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. శ్రీ మహావిష్ణువు అయిన కాల పురుషుడిని గౌరవించేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు. 

దేవాలయాలలో ప్రదక్షిణలు ఎందుకు ?

  దేవాలయాలంటేనే ప్రశాంతతకు చిహ్నాలు, అక్కడికి వెళ్తే మనస్సుకు ప్రశాంతత కలగడమే కాదు, ఆ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహాం వస్తుంది. అయితే ఎవరు ఏ దేవాలానికి వెళ్లినా దైవాన్ని దర్శించుకోవడానికి ముందు ఖచ్ఛితంగా  ప్రదక్షిణలు  చేస్తారు.ద్వజ స్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ప్రదక్షిణలు కనీసం 3 చేయాలి. ఆ తర్వాతనే లోనికి వచ్చి తీర్థ ప్రసాదాలు, అర్చనలు చేయించుకోవాలి. ప్రసాదం కూర్చొని తినాలి. 

లఘు గృహ ప్రవేశం పూజ సామగ్రి వివరాలు

 // శ్రీ రామ // పసుపు 100 గ్రాములు,  కుంకుమ 50 గ్రాములు, బియ్యం 5 కిలోలు,  ఆఖ0 డ దీపం 1, మట్టిది 2,  తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 60, అరటి పండ్లు డజను, ఆవు పంచితం 50 ml , రాగి చెంబు కలశం , ప్లాస్టిక్ గ్లాసులు 3,  మామిడి కొమ్మ, 1, పూలు, పూల దండలు,  దేవుని ఫోటో 1,  కొబ్బరి కాయలు , బూడిద గుమ్మరి కాయ 1, రాచ గుమ్మడి కాయ 1,  నెయ్యి దీపాలు చిన్నవి 2, (మంగళ హారతి ) నీళ్ళు , చిల్లర పైసలు 11,  అగ్గిపెట్టె, 1,కంకణ దారం ,  పాలు పొంగించటానికి ఇత్తడి కొత్త గిన్నె 1  ఆవు పాలు 1/2 లీటరు  కర్పూరం, ఆగరబత్తి, పాకెట్, 1  అయ్యగారి దక్షిణ Rs.5,000/-

హోలీ పండగ తేది 25-3-2024 సోమవారం

  శివుడు   రతీదేవి పతి అయిన మన్మథుడ్ని దహించిన సంఘటన ప్రసిద్ధమైనది. శివతపస్సును భగ్నం చేసినందుకు కాముడ్ని భస్మం చేసినది   ఫాల్గుణ  పౌర్ణమి రోజే. రతీదేవి ఆర్తనాదాల్ని విన్న సృష్టికర్త మన్మథుడు లేని విశ్వంలో తన సృష్టి సాగదని గ్రహించి సర్వేశ్వరుని ఆగ్రహం చల్లార్చి విషయమును విశద పరిచింది. ఈశ్వరుడు రతీదేవిని కరుణించి మన్మథుడు నిర్వికారుడై భార్యవైన నీకు మాత్రమే కనిపిస్తాడు.  ఈ విశ్వసృష్టికి మూలమైన స్రీపురుషులలో ప్రేమానురాగాలను, అన్యోన్యరసాలను అందిస్తూ జీవన ప్రక్రియకు దోహదం చేస్తుంటాడు అని చెప్పి మన్మథుడ్ని సజీవుడిని గావిస్తాడు. మన్మథుడు పునర్జన్మ పొందిన రోజు కూడా ఫాల్గుణ పౌర్ణమినాడే హిరణ్యకశ్యపుని సోదరి  హోలిక  అగ్ని కూడా కాల్చలేని మహాశక్తిమంతురాలు. తన కుమారుడైన ప్రహ్లాదుడు హరినామస్మరణను మరువమన్నా మాట వినక పోవడంతో హిరణ్యకశిపుడు మండిపడతాడు. హోలికను తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోపెట్టుకుని అగ్నిప్రవేశం చేయమని ఆదేశిస్తాడు. ప్రహ్లాదుడు హరిభక్తమహిమ వలన బయటపడతాడు కాని, హోలిక శక్తి సన్నగిల్లి అగ్నికి ఆహుతైపోయింది. ఇలా ఎన్నో  కథలు  ప్రచారంలో ఉన్నప్పటికీ మనిషి అంతరంగంలో ఉండే తుచ్చమైన కోరికల్ని దహింపచేసు

అమలకి ఏకాదశి తేది 20-3-2024 బుధవారం

  ఈ ఏడాది అమలకి ఏకాదశి మార్చి 20వ తేదీ వచ్చింది. ఆరోజు పుష్య నక్షత్రం కూడా ఉంటుంది. అమలకి ఏకాదశి రోజున భక్తులు విష్ణుమూర్తితో పాటు ఉసిరి చెట్టుకి పూజలు చేస్తారు. విష్ణుమూర్తి ఈ చెట్టులో కొలువు తీరాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువుతో పాటు  లక్ష్మీదేవి , కుబేరుడు ఈరోజు ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారని భక్తుల విశ్వాసం. అలాగే రాధాకృష్ణులు కూడా ఏకాదశి రోజున ఉసిరి  చెట్టు  కింద సంతోషంగా గడిపారని పురాణాలు చెబుతున్నాయి. పూజా విధానం అమలకి ఏకాదశి రోజు విష్ణువుని లక్ష్మీ సమేతంగా పూజిస్తారు. అలాగే పార్వతి దేవి శివుడిని కూడా పూజిస్తారు. పొద్దునే నిద్రలేచి పవిత్ర నదీ స్నానం ఆచరించాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ గదిలో  దీపం  వెలిగించి విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పిస్తారు. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. అలాగే ఉసిరి చెట్టు కింద నవరత్నాలతో కూడిన ఒక కలశం ప్రతిష్టించడం మంచిది.

ఆజ్య వీక్షణం పూజ సామగ్రి

 బియ్యం 1250 గ్రాములు, కంచు లోహం తో ఉన్న చిన్న ముకుడు 1, నువ్వుల నూనె 1/2 కిలో,  మంచి స్వచ్ఛమైన చిందూరం, 1/2 కిలో, ఎర్రని చిందూరం రంగులో దోవతి, ఉత్తరీయం,  పూల మాల, 1  దానాలు, : -  బియ్యం 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, 

కణ్ణినుణ్ శిరుత్తాంబు తెలుగు లో అర్థము

  1.అంతు తెలియని మాతృత్వపు భక్తి భావనలో, లీనమయిన ఆ యశోదాదేవి చేత, సన్నని ముడులతో, అల్లిన చిన్న త్రాడుతో, రోటికి కట్టబడిన ఆ శ్రీకృష్ణుడి కంటే, దక్షిణ భారత దేశములో వున్న, కురుకాపురి నగరములోని, విశేష ప్రజ్ఞాశాలి అయిన, నమ్మాళ్వారు అంటేనే, నాకు చాలా ఇష్టము. ఆయన మీద భక్తి భావముతో, ఆయన పేరు పలకాలి, అనే ఆలోచన, నా మదిలో మొదలవగానే, నా మనస్సు సంతోషముతో వువ్విళ్లూరి, నా నోటి నుండి, అమృతము వలె లాలాజలము వూరును. ఆ దేవుడి పేరు పలుకుట కంటే, మా నమ్మాళ్వారు పేరును పలుకుటయే, నాకు చాలా చాలా ఇష్టము. 2. నమ్మాళ్వారుడి వేదాంత ఉపదేశములకు, మనసారా తృప్తి పడి, ఆయన యొక్క భక్తి భావనకు, నేను దాసుడను అయితిని. ఆ దేవుడి గొప్పతనము కంటే, నా గురువుగారి గొప్పదనమే, వెయ్యిరెట్లు ఎక్కువగా, నాకు కనిపించినది. అందుకే, నేను మైమరచి, ఆ నమ్మాళ్వారుడిని కీర్తించి, ఆనందమును పొంది, ఆయన దివ్య పాదములనే, నేను, ఆశ్రయించితిని. విశేష ప్రజ్ఞాశాలి అయిన మా నమ్మాళ్వారు తప్ప, నా కంటికి ఏ దేవుడు కనిపించడం లేదు. అందుకే, నేను దేశ దేశముల తిరుగుతూ, ఆయన ఆ భగవంతుడి గురించి, తెలిపిన ఉపదేశములను, మథురమైన పాటల రూపములో పాడి, ఆయన గొప్పతనమును తెలిపెదను. 3. నే

మాఘ మాసం అమావాస్య నాడు చెయ్య గూడని పనులు

మాఘ మాసంలో వచ్చే అమావాస్య మార్చి 10వ తేదీ ఆదివారం  వచ్చింది. ఈరోజు కొన్ని పనులు చేయడం అశుభంగా పరిగణిస్తారు. ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం. మరుసటి రోజు నుంచి మాఘ మాసం పూర్తయి ఫాల్గుణ మాసం ప్రారంభం అవుతుంది. హిందూ మతంలో అమావాస్య రోజు పవిత్ర నదిలో స్నానం ఆచరించడం, దాన ధర్మాలు చేయడం వంటి వాటికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈరోజు కొన్ని పనులు చేయడం వల్ల అనేక దోషాలు నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు కొన్ని నమ్మకాల ప్రకారం అమావాస్య రోజున నిర్జన ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం మానుకోవాలి. అటువంటి ప్రదేశాలలో ఈరోజును  ప్రతికూల  శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. ఒంటరిగా వెళ్ళినప్పుడు ప్రతికూల శక్తులు మీపై ఆధిపత్యం చెలాయిస్తాయి. అందువల్ల ఈ సమయంలో ఒంటరిగా వెళ్లడం కరెక్ట్ కాదంటారు. బయట భోజనం చేయకూడదు మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ఎవరైనా తమ ఇంట్లోనే ఆహారాన్ని తినాలి. వేరొకరి ఇంట్లో భోజనం చేయడం వల్ల పుణ్యఫలాలు నశిస్తాయని నమ్మకం. శుభకార్యాలు చేయకూడదు కొన్ని నమ్మకాల ప్రకారం అమావాస

విజయ ఏకాదశి తేదీ 6-3-2024 బుధవారం

నవగ్రహ పూజ & శివరాత్రి అభిషేకం పూజ సామగ్రి వివరాలు

 పసుపు 100 గ్రాములు,  కుంకుమ 50 గ్రాములు,  శ్రీ గంధం 100 గ్రాములు, బియ్యం 3  కిలోలు,  తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 50,  ఖర్జూరం పండ్లు 50, అరటి పండ్లు 2 దజన్లు,  ఆవు పంచితం 100 ml , ఆవు పేడ,   పూలు, కిలో,జిల్లేడి పూలు కొంచెం, బిల్వ పత్రం కొంచెం , పూల దండలు 10 మూరలు,  గో ధుమ పిండి 1250 గ్రాములు,  కండి పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు,  తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు,  తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1250 గ్రాములు,  ఉలవలు 1250 గ్రాములు,  పేపర్ ప్లేట్లు 10,  దోప్పలు 10, ఆవు పాలు లీటరు, ఆవు పాల పెరుగు 500 గ్రాములు, మంచి తేనె 250 గ్రాములు, ఆవు నెయ్యి 500 గ్రాములు, చక్కెర 200 గ్రాములు, అయిదు రకాల పండ్ల రసాలు,  విబూది పొడి, జంజీరమ్ 1,  దోవతి సెల్లా 1 set , కొబ్బరి కాయలు 14 , చిల్లర పైసలు 25, కర్పూరం పాకెట్, 1,  శివ లింగం 1, నంది బొమ్మ ,శంఖం 1,గంట 1,  డ మరుకం 1  `,  ఆగరబతి , సాంబ్రాణి పొడి , అగ్గిపెట్టె, 1, దీపాలు 2,  అయ్యగారి దక్షిణ .

రథ సప్తమి తేదీ 16-2-2024 శుక్రవారం

వసంత పంచమి తేదీ 14-2-2024 బుధవారం

  వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి  సరస్వతీదేవి జన్మించిన రోజు . ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేయవలెను. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానములు చేయవలెనని దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవీయే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేళీవిలాసాలతో స్తుతిస్తారు.  ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. మేధ ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస

షట్ తిల ఏకాదశి తేదీ 6-2-2024 మంగళ వారం ప్రత్యేకత

ప్రత్యేకత గురించి తెలుసుకుందాం #షట్ ‍ _తిల_ఏకాదశి పుష్య బహుళ ఏకాదశిని “షట్ ‍ తిలైకాదశి” అనే పేరుతో ‘ఆమాదేర్ ‍ జ్యోతిషీ’ అనే గ్రంథంలో ఉంది. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు తిలదాహీ వ్రతం చేస్తారని రాశారు. షట్ ‍ తిలైకాదశి అంటే.. ఆరు విధాలుగా తిలలను ఉపయోగించే ఏకాదశి అని భావం. 1. స్నానం చేసే నీటిలో నువ్వులను వేయాలి. 2. నువ్వులు నూరిన ముద్దను శరీరమంతా రాసుకుని, రుద్దుకోవాలి. 3. నువ్వుల గింజలను తినాలి. 4. తాగేనీటిలో కొద్దిగా నువ్వులను వేసుకోవాలి. 5. గురువులకు తిలలు దానం చేయాలి. 6. దేవతలకు(తెల్ల నువ్వులు), పితృదేవతలకు(నల్ల నువ్వులు) లతో తిలతర్పణాలు ఇవ్వడం ద్వారా నువ్వులు సమర్పించాలి. ఈ ఏకాదశి నాడు నువ్వులను పై ఆరు విధాలుగా ఉపయోగించవలసిన ఆవశ్యకత ఉండటంవల్ల దీనికి “షట్ ‍ (6) తిలైకాదశి” అనే పేరు వచ్చింది. 1) కశ్యపమహర్షి శరీరం నుండి ఉద్భవించిన తిలలు, ఈరోజున దానంచేస్తే సర్వవిధ దానములు చేసిన ఫలితం లభిస్తుంది. 2) నేడు బెల్లం+నువ్వులు కలిపిన ఉండలు మహావిష్ణువుకు నివేదించడం ద్వారా దారిద్ర్యం, శనిదోషాలు తొలగును.

కూరతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం తేదీ 31-1-2024 బుధవారం

  విశిష్ట అద్వైత వేదాంతాన్ని గొప్పగా వివరించేవారిలో కూరతాజ్వాన్ ఒకరు. అతను కాంచీపురం సమీపంలోని కూర అగ్రహార గ్రామంలో ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని అసలు పేరు లేదా పుట్టిన పేరు 'శ్రీవత్సంక మిశ్ర', కానీ అతను కూర అగ్రహారానికి అధిపతి అయినందున కూరషన్ లేదా కూరనాథన్ అని పిలుస్తారు. శ్రీ రామానుజాచార్యులు సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించినప్పుడు, కూరతాళ్వార్  తన సంపదలన్నింటినీ త్యాగం చేసి శ్రీరంగానికి వెళ్లి, శ్రీరామానుజాచార్యుల పక్కన నిలబడి, నీడలా ఆయనను అనుసరించాడు. కూరతాజ్వాన్ 108 సంవత్సరాలు జీవించి, శ్రీ రామానుజాచార్యులు జీవించి ఉన్నప్పుడే తన స్వర్గ నివాసానికి (శ్రీ వైకుంఠం) బయలుదేరాడు. వీరు రచించిన  పంచ స్తవాలు - ఐదు స్తవాలను కలిగి ఉంటాయి.  1. శ్రీ వైకుంట్ట స్తవ 2. అతిమానుష స్తవ 3. శ్రీ వరద రాజ స్తవ 4. శ్రీ సుందర బహు స్తవ 5. శ్రీ స్తవ దీనినే పంచ స్తవంగా పిలుస్తారు. ఇవి చదవటానికి ప్రయత్నం చేద్దాం.

నారాయణ కవచం శ్లోకాలు

నారాయణ కవచం స్తోత్రం మహిమ

  నారాయణ కవచం అనేది విశ్వాన్ని సంరక్షించే మరియు రక్షకుడైన నారాయణునికి అంకితం చేయబడిన శక్తివంతమైన శ్లోకం. నారద మహర్షిచే స్వరపరచబడిన ఈ శ్లోకం భక్తులచే రక్షణ రూపంగా మరియు భగవంతుడు నారాయణుని అనుగ్రహాన్ని కోరుతూ పఠిస్తారు.ఈ శ్లోకం ప్రతికూలత, దుష్ట శక్తులు మరియు జీవితంలో ఎదురయ్యే ఏవైనా ఇబ్బందులకు వ్యతిరేకంగా ఒక కవచంగా పనిచేస్తుందని నమ్ముతారు. భక్తి మరియు విశ్వాసంతో పఠించే వ్యక్తికి శాంతి, శ్రేయస్సు మరియు దైవిక రక్షణ లభిస్తుంది. నారాయణ కవచం భగవంతుడు నారాయణుని మహిమ, శక్తి మరియు దైవిక లక్షణాలను వివరించే శ్లోకాలను కలిగి ఉంటుంది, ఇది సృష్టికి అంతిమ మూలం మరియు అతని భక్తుల యొక్క అత్యున్నత రక్షకునిగా అతని పాత్రను నొక్కి చెబుతుంది. ఈ శ్లోకాన్ని క్రమం తప్పకుండా పఠించడం ఆధ్యాత్మిక బలం, అంతర్గత శాంతి మరియు జీవితంలో అడ్డంకులను అధిగమించే సామర్థ్యాన్ని అందిస్తుంది, ఆధ్యాత్మిక వృద్ధి మరియు విముక్తి వైపు నడిపిస్తుంది.

గృహ ప్రవేశం పూజ సామగ్రి వివరాలు

 పసుపు 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  గంధం చిన్న డబ్బా 1, బియ్యం 5 కిలోలు,  తమల  పాకులు150,  వక్కలు 5 1,  ఖర్జూరం పండ్లు 5 1 పాకెట్,  విడి పూలు, కిలో, తులసి కొంచెం.  పూల దండలు 10  మూరలు,  టెంకాయలు 15,  నిమ్మకాయలు 15 ,  బూడిద గుమ్మడి కాయ 1,  రాచ గుమ్మడి కాయ 1,  పాలు పొంగించటానికి కొత్తది ఇత్తడి గిన్నె , మూత తో సహా..  ఆవు పాలు 1 లీటరు , ఆవు పంచితం,  మామిడి కొమ్మ 1,  నవధాన్యాలు:- 1. గోధుమ పిండి, 1250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసరపప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు,మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, తెల్లని ఆవాలు 100 గ్రాములు, విస్తరి ఆకులు మంచివి 11,  హోమం సమిధలు 10 పెద్ద కట్టలు, ఆవు నెయ్యి 2 కిలోలు, మట్టి గిన్నె 1,  హోమ గుండ,  పంచామృతం : - ఆవు పాలు, పెరుగు, తేనె, నియ్యి, చక్కెర అన్నీ కలిపినవి 1/2 లీటరు .  పూర్ణాహుతి పెద్ద పాకెట్ 1,   దోవతులు  2, తెల్లని పంచెలు 2,  రాగి చెంబులు 3 ,  బ్లౌస్ పీసులు 12, అరటి కొమ్మలు 4 చిన్నవి.  ఆగరబతి, కర్పూరం, మంగళ హారతి నెయ్యి దీపాలు 2, అగ్గిపెట్టె, 1,  మట్

కనుమ పండగ నాడు ఏం చేస్తారు

  కనుమ రోజున ఆవులు ,  దూడలు ,  ఎద్దుల్ని శుభ్రంగా కడిగి కొమ్ములకు ముఖానికి పసుపు పూసి కుంకుమపెడతారు. కొమ్ములకు అలంకరిస్తారు. వీటిని వీథుల వెంట తిప్పుతూ ఉంటారు. ఎద్దుల కొమ్ములకు రూపాయిలు గుడ్డతో చ్టుటి కడతారు. వాటిని పట్టి కొమ్ములకు ఉన్న డబ్బులను తీసుకోవడానికి పందాలు వేసుకుటాంరు. సంక్రాంతి తరువాత వచ్చే రోజున కనుమ పండుగ అని చేస్తారు. ఇది వ్యవసాయదారుల పండుగ. వ్యవసాయ దారులే కాకుండా పశువుల పండుగగా కూడా చేస్తారు. ఈనాడు గోవులకు పూజ చేయడం ఆచారంగా వస్తూ ఉంది. ఇది తెలుగు ప్రాంతంలో కంటే తమిళ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. కనుమ రోజున ఆవులు, దూడలు, ఎద్దుల్ని శుభ్రంగా కడిగి కొమ్ములకు ముఖానికి పసుపు పూసి కుంకుమపెడతారు. కొమ్ములకు అలంకరిస్తారు. వీటిని వీథుల వెంట తిప్పుతూ ఉంటారు. ఎద్దుల కొమ్ములకు రూపాయిలు గుడ్డతో చ్టుటి కడతారు. వాటిని పట్టి కొమ్ములకు ఉన్న డబ్బులను తీసుకోవడానికి పందాలు వేసుకుటాంరు. ఈ కంగారులో అవి వశం తప్పి పరుగులు పెడతాయి. సాయంకాలం సమయంలో ఊళ్ళో పశువులన్నీ ఒకచోట చేరుతాయి. వాటిమీద మంచి నీటిని చిలకరిస్తారు. అవి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో లక్ష్మి రావడాన్ని సంతోషిస్తున్నట్లు ఇంటిల్లిపా

తిరుప్పావై 26 వ పాశురం అర్థ తాత్పర్యం వినండి.

తిరుప్పావై 25 వ పాశురం అర్థ తాత్పర్యం వినండి.

తిరుప్పావై లోన 24 వ పాశురం అర్థ తాత్పర్యం

తిరుప్పావై లో 23 వ పాశురం అర్థ తాత్పర్యం వినండి.

భగవతగీత ప్రశ్నావళి

  *14.* “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు? = మహాత్మా గాంధీ. *15.* భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు? = సంజయుడు. *16.* సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? =కుమారస్వామి. *17.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి? =దేవదత్తము. *18.* భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి? = ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.) *19.* భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు? =నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు. *20.* ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? = శ్రీరామచంద్రుడు. *21.* భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు? =అచ్యుత, అనంత, జనార్ధన. *22.* భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు? =ధనుంజయ, పార్ధ, కిరీటి. *23.* శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి? =గీతా గానం. *24.*