ప్రత్యేకత గురించి తెలుసుకుందాం
#షట్_తిల_ఏకాదశి
పుష్య బహుళ ఏకాదశిని “షట్ తిలైకాదశి” అనే పేరుతో ‘ఆమాదేర్ జ్యోతిషీ’ అనే గ్రంథంలో ఉంది. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు తిలదాహీ వ్రతం చేస్తారని రాశారు.
1. స్నానం చేసే నీటిలో నువ్వులను వేయాలి.
2. నువ్వులు నూరిన ముద్దను శరీరమంతా రాసుకుని, రుద్దుకోవాలి.
3. నువ్వుల గింజలను తినాలి.
4. తాగేనీటిలో కొద్దిగా నువ్వులను వేసుకోవాలి.
5. గురువులకు తిలలు దానం చేయాలి.
6. దేవతలకు(తెల్ల నువ్వులు), పితృదేవతలకు(నల్ల నువ్వులు) లతో తిలతర్పణాలు ఇవ్వడం ద్వారా నువ్వులు సమర్పించాలి.
ఈ ఏకాదశి నాడు నువ్వులను పై ఆరు విధాలుగా ఉపయోగించవలసిన ఆవశ్యకత ఉండటంవల్ల దీనికి “షట్ (6) తిలైకాదశి” అనే పేరు వచ్చింది.
1) కశ్యపమహర్షి శరీరం నుండి ఉద్భవించిన తిలలు, ఈరోజున దానంచేస్తే సర్వవిధ దానములు చేసిన ఫలితం లభిస్తుంది.
2) నేడు బెల్లం+నువ్వులు కలిపిన ఉండలు మహావిష్ణువుకు నివేదించడం ద్వారా దారిద్ర్యం, శనిదోషాలు తొలగును.
Comments
Post a Comment