Skip to main content

Posts

Showing posts from November, 2022

1. సుప్రభాతపు మేలుకొలుపు పద్యాల అర్థ రూపము.

  తొండరడిప్పొడి ఆళ్వారు రచించిన తిరుప్పళ్లియొజుచ్చి.                            దివ్యమైన మేలుకొలుపు సూర్యుడు తూర్పు దిక్కున ఆకాశపు ఉదయగిరిన అందమైన అరవింద ప్రకాశ తేజోమయుడై వచ్చివున్నాడు. ఉదయకాలపు వెలుతురు చక్కగా రాగా, దట్టమైన చిమ్మ చీకటి అంతా నశించినది. మంచి పరిమళపు సువాసనలు వెదజల్లు రంగురంగుల పువ్వులు అన్నీ వికసించి తియ్యని తేనెతో నిండి పలకరిస్తున్నవి. నీ దర్శనమునకై దేవతలు, రాజులు అందరూ వచ్చి అన్ని వైపులా నిండి వున్నారు. వారు ఎక్కి వచ్చిన ఏనుగుల గుంపు యుక్క ఘీంకార శబ్దములు భేరీ వాయిద్య ధ్వనితో కలిసి శబ్దించు అలల సముద్ర ఘోషవలె అన్ని దిక్కుల ప్రతిధ్వనిస్తున్నాయి. శ్రీరంగనాథా, పడక నుంచి లేచి మాపై దయ చూపవయ్యా.   తూర్పు దిక్కు నుండి వీచు చల్లని గాలి పూలతీగలపై నిండివున్న మల్లెలు, మొల్లల పూలవాసనలను గ్రహించి మంచి పరిమళ సువాసనాభరితముగా వీచుచున్నది ఇదిగో. పూలపడకన నిద్రించు హంసజంటలు తెల్లవారుఝామున పడే లే మంచు బిందువులతో తడిసిన తమ చక్కని అందమైన రెక్కలను విదిల్చి నిద్ర లేచినవి. మొసలి యొక్క తెల్లని కోరలకి చిక్కి, విపరీతముగా బాథపడిన గజేద్రుడి గొప్ప దుఃఖమును పోగొట్టిన శ్రీరంగనాథా, పడక నుంచి లేచి మాపై

సంకట హర చతుర్థి తేది : 11-11-2022 శుక్రవారం

   గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే  సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.