Skip to main content

Posts

Showing posts from May, 2023

నిర్జల ఏకాదశి తేదీ 31-5-2023 బుధవారం

  జేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్ష  ఏకాదశి  నాడు  నిర్జల  ఏకాదశిగా చెబుతారు. 2023 వ సంవత్సరంలో మే 31వ తేదీన  నిర్జల ఏకాదశి  వస్తుంది.  నిర్జల ఏకాదశి  తిథి మే 30 వ తేదీన మధ్యాహ్నం 1:32 నిమిషాలకు ప్రారంభమై, మే 31వ తేదీ మధ్యాహ్నం 01:36 నిమిషాలకు ముగిస్తుంది. ఈరోజు (మే 31) ఎవరైతే విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని నిష్ఠగా పూజిస్తారో వారికి సకల సౌఖ్యాలు ప్రాప్తిస్తాయని చెబుతారు. ఈరోజు భూ, కనక, వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తే అన్ని విషయాలలోనూ కలిసివస్తుందని, కొనుగోలు చేసిన దాని విలువ రెట్టింపు అవుతుందని చెబుతారు.   నిర్జల ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి విష్ణువుని పూజించాలి. విష్ణు పూజలో తులసిని తప్పనిసరిగా పెట్టాలి.   రావి చెట్టును పూజిస్తే... అంతేకాదు ఏకాదశి నాడు రావి చెట్టును పూజించడం వల్ల కూడా లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. రావి చెట్టుకు పాలు కలిపిన నీళ్లను, ధూప, దీపాలను సమర్పించడం వల్ల సంపద పెరుగుతుంది. నిర్జల ఏకాదశి నాడు జల దానం చేసినా, అన్న దానం చేసిన లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అంతేకాదు కుండను దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అష్టాక్షరి మంత్రం  "ఓం నమో భగవతే వ

దశపాపహర దశమి తేదీ 30-5-2023 మంగళవారం

  జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష దశమిని ‘దశ పాపహర దశమి’ అని పిలుస్తారు. అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి అని అర్ధం. ఈ రోజు గంగామాత అవతరించిన రోజుగా చెబుతారు. అందుకే ఉత్తరాదిన ‘గంగా దశహర గంగోత్సవం’గా పిలుస్తారు. గంగాదేవి ఆరాధనకు ఇది ప్రీతిపాత్రమైన రోజు. గంగాదేవి మాహాత్మ్యాన్ని గురించి స్కాంద పురాణంతో సహా పలు పురాణాలు, స్మృతి కౌస్తుభం, వ్రత నిర్ణయ కల్పవల్లి, వాల్మీకి రామాయణం, మహా భారతంలో గాంగేయుని (భీష్ముని) వృత్తాంతంలో వర్ణించారు.వనవాసానికి వెళ్తూ సీతాదేవి గంగను పూజించి తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుతానని మొక్కుకున్నట్టు రామాయణ గాథ. ఈ రోజున నల్ల నువ్వులు, నెయ్యి, పేలపిండి, బెల్లం నదిలో వేయాలి. అలాగే చేపలు, కప్పలు, తాబేలు లాంటి జలచరాల రజత ప్రతిమలను నీటిలో వదలడం విశేష పుణ్యదాయకం. ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి ఆలయాలను సందర్శిస్తే శుభం జరుగుతుందని చెబుతారు

జ్యేష్ట మాసం విశేషాలు తేదీ 20-5-2023 శనివారం నుండి.

     చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసిన రోజు కావున ఈ నెల జ్యేష్ఠము. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైనదిగా చెప్పబడుతోంది. ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.ఈ మాసంలో చేసే విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే నీళ్ళను దానం చేయడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి.జ్యేష్ఠ శుద్ద తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజించడమే కాదు, దానాలకు శుభకాలం. ముఖ్యంగా అన్న దానం చేయడం ఉత్తమం. ఈ మాసంలో ఏం చేయాలి..?  జ్యేష్ఠశుద్ద దశమిని దశపాపహర దశమి అంటారు. అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి అని అర్ధం. పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం, లేదా ఏదైనా నదిలో పదిసార్లు మునకేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లం నదిలో వేయాలి. ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి ఆలయాల సందర్శిస్తే శుభం జరుగుతుంది.జ్యేష్ఠ శుద్ద ఏకాదశినే నిర్జల 'మతత్రయ

అపర ఏకాదశి లేదా అచల ఏకాదశి తేదీ 15-5-2023 సోమవారం

   ఈ పవిత్రమైన దినాన శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. ఈ ఏకాదశి నాడు ప్రత్యేక పూజలు చేయడంతోపాటు దాన ధర్మాలు చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. అంతేకాకుండా మీకు అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుంది.  ఈ పవిత్రమైన రోజుల్లో శ్రీహరిని పూజిస్తారు. ఈరోజున పూజ చేయడం వల్ల దుష్ట శక్తుల నుండి విముక్తి లభిస్తుంది. ఈరోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు చేసే పనులు మీ పూర్వీకులను సంతోషపరుస్తాయి. 

హనుమాన్ జయంతి నాడు ఏమి చేయాలి తేదీ 14-5-2023 ఆదివారం

  శ్లో: వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే  పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే ||  అని చెప్పబడింది. దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి ( తేదీ 14-5-2023 ) ఆదివారం నాడు  హనుమజ్జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్తోత్రాలను, అష్టోత్తర శతనామావళి తో  స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

ఉపనయనం పూజ సామగ్రి

  పసుపు :100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 packet హరతికర్పూరం : 100 gr. గంధం : 1 box ఖర్జూరపండ్లు : 250 gr. పసుపుకొమ్ములు : 200 gr. టవల్స్ 2 జాకెట్ ముక్కలు : 4 బియ్యము : 5 kg. కొబ్బరికాయలు : 5 చిల్లరడబ్బులు : 50 దారపుబంతి : 1 ఆవు పాలు : 1/2 lt. ఆవు పెరుగు : 250 gr. ఆవు నెయ్యి : 1 kg. తేనే : 100 gr. నవధాన్యాలు : 250 gr. సమిధలు : 10 bundles ఇటుకలు : 10 ఇసుక : 1/4 bag దీపారాధన కుందులు : 1 set వత్తులు : 1 packet నువ్వుల నూనే : 1 kg. కలశం చెంబు : 1 విస్తరాకులు : 10 అప్పడాలు : 1 packet వడియాలు : 1 packet వెండిది యజ్ఞోపవీతం : 1,  దారం యజ్ఞోపవీతం 1, అత్తరు పన్నీరు జీలకర్ర బెల్లం ఎండు కొబ్బరులు : 10 సున్నం డబ్బా : 1 మట్టి మూకుళ్ళు : 6 మట్టి ముంతలు : 4 గొడుగు, కర్ర, కాటుక, అద్దం, కొత్త చెప్పులు పుట్టమన్ను బ్రహ్మగారి వస్త్రాలు భాషికములు ఉసిరి లేక శనగపిండి మట్టి ప్రమిదలు మోదుగ కొమ్మ గుండ్రాయి పులగము కుశలాన్నము.పూజ సామగ్రి కాకుండా పూజ చేయించినందుకు ఇద్దరు  బ్రాహ్మణుల  దక్షిణ Rs.15,000/-