Skip to main content

Posts

Showing posts from August, 2020

nandaa devi pooja on 27-8-2020 Thursday

  భాద్రపద శుద్ధ నవమి తేది 27-8­­-2020 గురువారం నాడు నందాదేవి పూజ చేయవలెను. దీనికి పూర్వవిద్ధను గ్రహించవలెను. భాద్రపదమందు నవమి బహుళమందును గ్రహించి నందాదేవినర్చించినచో మహాపుణ్యమును , పాపనాశమును కల్గించునని భవిష్యోత్తరము చెప్పుచున్నది. రాచకొండ రామాచార్యులు, పూజారి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయురి మార్గ, బేగంపేట్, హైదరాబాద్.

రాదాష్టమి 26-8-2020 బుధవారం నాడు

భాద్రపదమాసంలోని అష్టమి 26-8-2020 బుధవారం నాడు   శ్రీ కృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈనాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధా కృష్ణులను పూజించాలి. ఈ రోజును ' రాధాష్టమి ' అని పేరు. ఈ రోజు రాధా కృష్ణులను పూజించడం వలన సంసార సుఖం లభిస్తుందని భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది. రాచకొండ రామా చార్యులు, పూజారి మరియు జ్యోతిష్యులు (M.A సంస్కృతం & వైదిక జ్యోతిష్య), శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయురిమార్గ్,బేగంపేట్, హైదరాబాద్.

భాద్రపద శుక్ల సప్తమి 25-8-2020 మంగళవారం

  భాద్రపద శుక్ల సప్తమి 25-8-2020 మంగళ వారం నాడు  ముక్తాభరణ వ్రతం ఆచరించాలి. దీనిని ముక్తాభరణ సప్తమిగా కూడా వ్యవహరిస్తారు. ఈనాడు ముత్యాలతో ఆభరణములు చేసుకొని శక్తి కలవారు ముత్యములతో లక్ష్మీనారాయణుల ప్రతిమలను తయారుచేసి ఆవు పాలతో అభిషేకం నిర్వహించి షోడశోపచార పూజ చేయాలి. అనంతరం ఆ ప్రతిమలకు ముత్యాలతో కూడిన దుస్తులతో మరియు ముత్యాల ఆభరణాలతో అలకరింపచేసి సప్త ఋషులను పూజించి విశేషించి సూర్య భగవానుని ఆరాధించవలెను. ఏడుగురు బ్రాహ్మణులకు శక్తి కొలదీ ముత్యములు, ఆభరణాలు ఇచ్చి వారికి భోజనము మరియు దక్షిణతాంబూలాలు సమర్పించి వారి అనుమతితో ముత్యాల ఆభరణాలు ధరించి దేవాలయానికి వెళ్లవలెను.  స్వామిని దర్శించి ప్రదక్షిణ చేసి నైవేధ్యం తీసుకుని శక్తిఉన్నవారు రాత్రి జాగరణ చేసి సూర్యోదయంతో ఈ వ్రతమును పూర్తి చేయవలెను.

Kanninun sirutthambu-Divya prabandham

సూర్య షష్టి 24-8-2020 సోమవారం

భాద్రపద శుక్ల షష్టి(24-8-2020) సోమవారం ని సూర్య షష్టి అంటారు.     ఈ రోజున సూర్యుని స్మరిస్తూ స్నానం చేసి , సూర్యుని ఆరాధించి , ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని శ్లోకం చదివి " పంచగవ్యాలు" ( ఆవుపాలు , పెరుగు , నేయ్యి , మూత్రం , పేడ కలిపి) ప్రాశనం చేస్తే విశేష ఫలం. రామాచార్యులు, పూజారి మరియు జ్యోతిష్యులు, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమార్గ్,బేగంపేట్, హైదరాబాద్

రుషి పంచమి తేది 23-8-2020 ఆదివారం నాడు

  ఈ నెల 23 ఆదివారం నాడు   రుషి పంచమి.. స్త్రీ దోషాలకు పరిహారంగా జరుపుకునే ఈ వ్రతాన్ని ' భాద్రపద మాసం ' లో ' శుక్ల పక్ష పంచమి ' రోజున ఆచరించాలి.   గణపతిని పూజించి గంగా యమున కృష్ణ తుంగభద్ర తదితర నదుల నామాలను మహర్షుల నామాలను స్మరించుకోవాలి. సప్తరుషులను అరుంధతిని పూజించాలి. ఆ తరువాత కథ చెప్పుకుని వాయనదానాలు ఇవ్వాలి. ఇలా 7 సంవత్సరాల పాటు క్రమం తప్పక ఈ వ్రతాన్ని చేసుకుని ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవాలి. రామాచార్యులు, పూజారి మరియు జ్యోతిష్యులు, శ్రీ రామలింగేశ్వర స్వామి దీవాలయం, మయురిమార్గ్,బేగంపేట్, హైదరాబాద్.

Vinaayaka chavithi పూజ సామగ్రి

  పసుపు , 1 00 grams,   కుంకుం 5 0 grams,   శ్రీ గంధం ,   బియ్యం 3 కిలోలు ,   తమల పాకుల 3 0,   వక్కలు 25 ,   కర్జూరము 21 ,   పసుపు కొమ్ములు 11, అయిదు రకముల పండ్లు , 2చొప్పున , అరటి పండ్లు ఒక డజాన్,   ఆవు పాలు 100 మిల్లీ లీటర్లు     పెరుగు , 100 grams . తేనె ,small battle   నెయ్యి 1/4 kg, jaggery కొంచెం,   పూలు ½ కిలో , 21 verities of leaves, &  green grass katta 1,   రూపాయి బిళ్ళలు , 12 , రాగి చెంబులు 1 మామిడి ఆకులు ,   తెల్లని వస్త్రము బంగారు అంచుతో 2 nos.   కనుములు 1,   ఎందు కొబ్బరి 2 , కొబ్బరి కాయలు 5 , అగర్బత్తి , & sambraani sticks కర్పూరము ,1packet   Sweet prasaadam with dry fruits,     కంకణముల దారం , ఆవు పంచితం ,   ఆవు నెయ్యి దీపాలు 2 ,   దీపం చేమ్మేలు పెద్దవి 2 .   వత్హులు, అగ్గిపెట్టె, aachaman paatra,    Brahman dakshina 3,000/- for 3 days                                                                                                       

Ganapati Upanishad

మూల నక్షత్ర శాంతి పూజ సామగ్రి

పసుపు,200 grams,  కుంకుం 50 grams,  శ్రీ గంధం ,  బియ్యం 5 కిలోలు,  తమల పాకుల 100,  వక్కలు 50,  కర్జూరము 35, గణపతి పూజ,ముఖావలోకనం , నవగ్రహ పూజ జపం, మూల నక్షత్ర జపం  హోమం శివాభిషేకం, ఆంజనేయ స్వామికి చిన్దూర అలంకారం . పూజ   పసుపు కొమ్ములు 11, విడి పూలు, 1/2 కిలో, బిల్వ పత్రములు, 2,  అరటి పండ్లు ఒక 2 డజన్, , ఆవు పాలు 1 litre.   పెరుగు, 200 గ్రాములు, మంచి తేనె చిన్న సీస.   ఆవు నెయ్యి 2  kg,  బెల్లం పౌడర్  కొంచెం, గోధుమ పిండి, కాజు,బాదం పలుకులు,kissmiss etc.  పూలు  కిలో ,పూల దండలు 20 మూరలు,  రూపాయి బిళ్ళలు, 25,  రాగి చెంబులు 2, కంచు మూకుడు 1,  నువ్వుల నూనె 1/2 కిలో,  ఆంజనేయ స్వామికి చిన్దూరం 1/2 కిలో,  జాస్మిన్ స్సెంట్ నూనె 1 సీస, పన్ని 5 పేపర్స్,   మామిడి ఆకులు,  తెల్లని వస్త్రము బంగారు అంచుతో 2  కనుములు 12,  ఎందు కొబ్బరి 2 , కొబ్బరి కాయలు 12,  అగర్బత్తి, కర్పూరము, హోమం పుల్లలు  10 పెద్ద కట్టలు , పూర్ణాహుతి ప్యాకెట్ 1 పెద్దది, నవగ్రహ పూజ సామాగ్రి  నవధాన్యాలు 1/2 కిలో  గోధుమ పిండి  కిలో నర  కండి పప్పు కిలో నర,  పెసర పప్పు కిలో నర, శనగ పప్పు లేదా పుట్నాల పప్పు కిలోనర, తెల్లని పెద్ద బొబ్బర్లు

Lord Rama birth star Punarvasu nakshatram

16-8-2020 Sunday   నాడు పునర్వసు నక్షత్రం ఉంది.. మొత్తం 27 నక్షత్రములలో ఇది ఏడవ నక్షత్రం.   శ్రీరామచంద్రుడు   పుట్టిన నక్షత్రం .  ఈ రోజు రాములవారికి అభిషేకం ఉంటుంది.   పునర్వసు నక్షత్ర వృక్షము   వెదురు . ఈ నక్షత్రం వారు వెదురు వృక్షమును నాటినా, పోషించినా కూడా వారు జీవితములో పైకి వస్తారు. రాచకొండ రామాచార్యులు, పూజారి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమర్గ్, బేగంపేట్, హైదెరాబాద్

office puja items

  ఆఫీస్ పూజ సామగ్రి పుసుపు 100 గ్రాములు , కుంకుమ 100 గ్రాములు , శ్రీ గందం ౧ చిన్న డబ్బా బియ్యం ౩ కిలోలు , రాగి చెంబులు 2, స్వీట్ బాక్స్ , కిలో , పూలు , 1/2 కిలో , పూల దండలు , 2 కొబ్బరి కాయలు ౩ , ఆవు పంచితం ,                                నెయ్యి దీపాలు , 2 వత్తులు , అగ్గిపెట్టె , తమల పాకులు 50, వక్కలు 35, కర్జూరం 25, పసుపు కొమ్ములు 11, అయిదు రకముల పండ్లు , కర్పూరం , 1 ప్యాకెట్ , అగర్బతి ,   సాంబ్రాణి కడ్డీలు , ఆవు పాలు , పెరుగు , తేనె , ఆవు నెయ్యి , చ్కక్కేర అన్ని కలిపి ఒక లీటరు ,   లక్ష్మి ఫోటో 1 బూడిద గుమ్మడి కాయ , 1 రాచ గుమ్మడి కాయ 1 తెల్లని వస్త్రము 1 కనుము బట్ట 1 ఎండు కొబ్బెర 2 రూపాయి బిళ్ళలు 25, మామిడి కొమ్మ , ప్లాస్టిక్ గ్లాసులు 5, ఆచమనం పాత్ర 1, dakshina Rs.1,500/-  

sankashta hara chavithi on 7-8-2020 Friday

సంకష్టహర గణపతి వ్రతం అంటే .. గణేశ పురాణం ప్రకారం వినాయకుడి ఉపాసన ప్రాథమికంగా రెండు విధానాలు. ఒకటి వరద గణపతి ,రెండు సంకష్టహర గణపతి పూజ. వరద గణపతి పూజను 'వినాయక చవితి' పేరున చేసుకుంటారు. సంకష్టహర గణపతిని సంకష్టహర చతుర్థి, సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. వినాయకుడికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతమే సంకటవ్రతం. ఈ సంకటహర చతుర్థి ప్రతి మాసంలో వస్తుంది. కృష్ణపక్షంలో (పౌర్ణమి తరువాత 3 లేక 4 రోజులలో చవితి వస్తుంది) ప్రదోషకాలంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకుంటారు.   కాబట్టి 7-8-2020 Friday Morning 7 a.m. గంటలకు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం లో, మయూరిమార్గ్,బేగంపేట్, హైదరాబాద్ నందు abhishekam & archanalu చేద్దాం. 

ఆవు పాల విశేషం

వేదాల్లో   “గో సూక్తం “మంత్రాలు సుప్రసిద్ధమైనది. తన యజమానికి ఏదైనా రోగం వస్తే , ముందు పాడి ఆవు దాన్ని గుర్తిస్తుందట అడవికి పోయి ఆ రోగానికి విరుగుడుగా ఓషధులను , మూలికలను మేసివచ్చి , ఆ సారాన్ని పాల రూపంలో   ఇచ్చి, రోగ నివారణ చేస్తుందని గో సూక్తం వివరించింది. కావున ప్రతి నిత్యం కొన్ని గోవు పాలు తాగటం మంచిదని మన పురాణాలు చెబుతున్నాయి.  మన దేవాలయములో శ్రీ వేంకటేశ్వర స్వామి కి ప్రతి శుక్రవారం నాడు  గోవు పాలతో   గో సూక్తముతో అభిషేకం చేద్దాం. ఇట్లు రాచకొండ రామా చార్యులు, పూజారి, శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమార్గ్,బేగంపేట్, హైదెరాబాద్.