వేదాల్లో “గో సూక్తం “మంత్రాలు సుప్రసిద్ధమైనది. తన
యజమానికి ఏదైనా రోగం వస్తే , ముందు పాడి ఆవు దాన్ని గుర్తిస్తుందట అడవికి పోయి ఆ
రోగానికి విరుగుడుగా ఓషధులను , మూలికలను మేసివచ్చి , ఆ సారాన్ని పాల రూపంలో ఇచ్చి, రోగ నివారణ చేస్తుందని గో సూక్తం వివరించింది.
కావున ప్రతి నిత్యం కొన్ని గోవు పాలు తాగటం మంచిదని మన పురాణాలు చెబుతున్నాయి. మన దేవాలయములో శ్రీ వేంకటేశ్వర స్వామి కి ప్రతి శుక్రవారం నాడు గోవు పాలతో గో సూక్తముతో అభిషేకం చేద్దాం. ఇట్లు రాచకొండ
రామా చార్యులు, పూజారి, శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమార్గ్,బేగంపేట్,
హైదెరాబాద్.
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment