Skip to main content

Posts

Showing posts from September, 2022

దేవి నవరాత్రుల గురించి ..

  దేవీ నవరాత్రులు 26 సెప్టెంబర్ 2022 నుండి ప్రారంభమవుతాయి. దుర్గా దేవి వివిధ రూపాలు దేవీ నవరాత్రులలో పూజిస్తారు. అందువల్ల, నవరాత్రులలో ప్రతి రోజు, మాతా దుర్గకు వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ తొమ్మిది రోజులలో అమ్మ సంతోషంగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి వివిధ అలంకారాలు చేస్తారు. అలాగే అమ్మవారికి కట్టే చీర రంగు కూడా ఒక్కోరోజు ఒక్కోలా ఉంటుంది. ఆభరణాలను కూడా ప్రత్యేకంగా అలంకరిస్తారు.

చండీ హోమం విశిష్టత

  ఇహపర సాధనకు  చండీ హోమం  ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన  చండీ  సప్తశతిని పారాయణ చేసి,  హోమం  నిర్వహించడమే  చండీ హోమం . దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో  చండీ  యాగం చేస్తారు. వీటిలో నవ  చండీ  యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట. పూజ సామగ్రి వివరాలు  పసుపు = 1/4 కిలో కుంకుమ = 1/4 కిలో తమలపాకులు = 250 వక్కలు = 100 ఎండు ఖర్జురములు  =100 పసుపు కొమ్ములు =100 కర్పూరం = 1 ప్యాకెట్ అగరవత్తులు = 1 ప్యాకెట్ కొబ్బరికాయలు = 5 నల్ల నువ్వులు = 200 గ్రాములు తెల్లనువ్వులు = 200 గ్రాములు తేన = చిన్నసీస పంచదార = 1/4 కిలో మిరియాలు = 100 గ్రాములు పచ్చకర్పూరం = 100 గ్రాములు పచ్చి వక్కలు = 100 గ్రాములు ఆవునెయ్యి = 4 కిలోలు దారపు బంతి = 1 మట్టి మూకుళ్ళు = 3 మినపపప్పు =1/2 కిలో గంధపు పొడి = 1 డబ్బా వరి పేలాలు = 1 కిలో సమిధలు బియ్యం = 5 కిలో బియ్యపిండి = 1/2 కిలో పూర్ణాహుతి సామగ్రి = 1 ప్యాకెట్ పెసలు = 1 కిలో గాజులు , కాటుక ,తిలకం ,అద్దం ,చెక్క దువ్వెన , అత్తరు గుగ్గిలం పొడి = 100 గ్రాములు అష్ట సుగంధ ద్రవ్యాల

అనంత పద్మనాభ స్వామి వ్రతం తేదీ 9-9-2022 శుక్రవారం

  ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకొని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజించటం కనిపిస్తుంది.  వ్రత  సంబంధమైన పూజను గమనిస్తే అనంతపద్మనాభ అవతారం కళ్ల ముందు మెదలాడుతుంది. వ్రతాచరణ కోసం పిండితో ఏడు పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేసి పూజించటం కనిపిస్తుంది. పూర్వం పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో..., వారి యోగక్షేమాలు విచారించాలని శ్రీకృష్ణుడు వారి దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుని చూడగానే ధర్మరాజు చిరునగవుతో ఎదురేగి స్వాగత మర్యాదలతో సత్కరించి ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు. కొంతసేపు కుశలప్రశ్నలు జరిగాక.., ‘కృష్ణా..మేము పడుతున్న కష్టాలు నీకు తెలియనివి కాదు. ఏ వ్రతం చేస్తే మా కస్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశంచు’ అని ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు ‘ధర్మరాజా..మీ కష్టాలు తీరాలంటే ‘అనంత పద్మనాభస్వామి వ్రతం’ ఆచరించండి’ అని సలహా ఇచ్చాడు. అప్పుడు ధర్మరాజు ‘కృష్ణా..అనంతుడంటే ఎవరు? అని ప్రశ్నించాడు. ‘ధర్మరాజా.. అనంత పద్మనాభుడంటే మరెవ్వరో కాదు, నేనే. నేనే కాలస్వరూపుడనై సర్వం వ్యాపించి ఉంటాను. రాక్షస సంహారం కోసం నేనే కృష్ణునిగా అవతరించా

వామన ద్వాదశి తేదీ 7-9-2022 బుధవారం

  హిందూపురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు అవతారాల్లో వామన అవతారం ఒకటి. ఈ రోజు శ్రీహరి ని ఆరాధిస్తారు. దీని ప్రాముఖ్యత, పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఓం వo వామనాయ నమః మంత్రం 108 సార్లు మనసులో అనుకోవాలి.   వామనుడు జన్మ వృత్తాంతం కశ్యపుడు, అదితికి జన్మించినవాడు వామనుడు. దేవాసుర యుద్ధంలో ఇంద్రుడు చేతిలో ఓడిపోతాడు బలి చక్రవర్తి. రాక్షసులు గురువైన శుక్రాచార్యుడు ఉపదేశంతో విశ్వజిత్ యాగం చేసి బంగారు రథాన్ని, శక్తివంతమైన ధనస్సు, అక్షీయ తూణీరాలు పొంది.. రాక్షసుల అందరినీ కూడగట్టుకుని దేవేంద్రుడిపైకి యుద్ధానికి వెళతాడు. బృహస్పతి సూచనలు మేరకు దేవతలు అమరావతిని వీడి పారిపోతారు. బలిచక్రవర్తి గర్వమును అణచడానికై శ్రీహరి అదితి గర్భమున జన్మిస్తాడు. బలి చక్రవర్తి దానశీలి. అతడి దగ్గరికి వెళ్లి మూడు అడుగుల నేలను అడుగుతాడు వామనుడు. సరే అంటాడు బలి. వామనుడు త్రివిక్రముడై మెుత్తం జగత్తునంతా రెండు అడుగులతో, మిగిలిన ఒక అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కి.. అతడిని దానికి రాజును చేస్తాడు. ఆ రాజ్యానికి స్వయంగా శ్రీహరే కాపలాగా ఉంటాడు.   వామన ద్వాదశి రోజున ఏం చేయాలి? >> వామనుని అనుగ్రహం పొందడానికి వామన ద్

🌹పరివర్తన ఏకాదశి🌹తేదీ 6-9-2022 మంగళవారం

  శ్రీమన్నారాయణుడు భక్తవత్సలుడు … తనని నమ్మిన భక్తులను కాపాడటం, తన ప్రధమ కర్తవ్యం అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ వుంటాడు. లోక కల్యాణం కోసం అనేక అవతారాలను ధరించడం … తన భక్తులకు ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి శ్రీమన్నారాయణుడిని ‘ఏకాదశి’ రోజున పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘పరివర్తన ఏకాదశి’ అనే పేరు కూడా వినిపిస్తూ వుంటుంది. ‘భాద్రపద శుద్ధ ఏకాదశి’ ని … ‘పరివర్తన ఏకాదశి’ గా పిలుస్తుంటారు. తొలి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శేష శయ్యపై యోగ నిద్రలోకి జారుకున్న శ్రీమహావిష్ణువు, ఈ రోజున ఒక వైపు నుంచి మరో వైపుకి ఒత్తిగిల్లుతాడట. ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు శయన భంగిమలో ఒకవైపు నుంచి మరోవైపుకి తిరుగుతాడు కనుక, దీనిని పరివర్తన ఏకాదశిగా పిలుస్తుంటారు. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి … ఉపవాస దీక్షను చేపట్టి … జాగరణకి సిద్ధపడి శ్రీమహావిష్ణువును పూజించవలసి వుంటుంది. ”ఓం వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ … పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ” అంటూ అత్యం

వర్షాకాలంలోనే నిమజ్జనం..

సాధారణంగా వినాయక చవితి పండుగ వర్షాకాలంలోనే వస్తుంది. ఈ కాలంలో చెరువుల నుండి మట్టి సేకరించి.. ఆ మట్టితోనే వినాయక విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించి, తర్వాత తిరిగి అదే నీటిలో  నిమజ్జనం  చేస్తారు. ఇలా చెరువుల విగ్రహాల తయారీ కోసం మట్టిని తీసుకోవడం వల్ల అక్కడ లోతు పెరుగుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం, వినాయక చవితి తర్వాత సరిగ్గా పదిరోజుల తర్వాత అంటే అనంత చతుర్దశి రోజున వినాయక నిమజ్జనం జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడి విగ్రహాలను ప్రవహించే నదులు, కాలువలు లేదా ఏదైనా చెరువులో నిమజ్జనం చేస్తారు.