Skip to main content

వర్షాకాలంలోనే నిమజ్జనం..


సాధారణంగా వినాయక చవితి పండుగ వర్షాకాలంలోనే వస్తుంది. ఈ కాలంలో చెరువుల నుండి మట్టి సేకరించి.. ఆ మట్టితోనే వినాయక విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించి, తర్వాత తిరిగి అదే నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇలా చెరువుల విగ్రహాల తయారీ కోసం మట్టిని తీసుకోవడం వల్ల అక్కడ లోతు పెరుగుతుంది.హిందూ సంప్రదాయం ప్రకారం, వినాయక చవితి తర్వాత సరిగ్గా పదిరోజుల తర్వాత అంటే అనంత చతుర్దశి రోజున వినాయక నిమజ్జనం జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడి విగ్రహాలను ప్రవహించే నదులు, కాలువలు లేదా ఏదైనా చెరువులో నిమజ్జనం చేస్తారు.

Comments