Skip to main content

Posts

Showing posts from March, 2024

దేవాలయాలలో ప్రదక్షిణలు ఎందుకు ?

  దేవాలయాలంటేనే ప్రశాంతతకు చిహ్నాలు, అక్కడికి వెళ్తే మనస్సుకు ప్రశాంతత కలగడమే కాదు, ఆ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహాం వస్తుంది. అయితే ఎవరు ఏ దేవాలానికి వెళ్లినా దైవాన్ని దర్శించుకోవడానికి ముందు ఖచ్ఛితంగా  ప్రదక్షిణలు  చేస్తారు.ద్వజ స్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ప్రదక్షిణలు కనీసం 3 చేయాలి. ఆ తర్వాతనే లోనికి వచ్చి తీర్థ ప్రసాదాలు, అర్చనలు చేయించుకోవాలి. ప్రసాదం కూర్చొని తినాలి. 

లఘు గృహ ప్రవేశం పూజ సామగ్రి వివరాలు

 // శ్రీ రామ // పసుపు 100 గ్రాములు,  కుంకుమ 50 గ్రాములు, బియ్యం 5 కిలోలు,  ఆఖ0 డ దీపం 1, మట్టిది 2,  తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 60, అరటి పండ్లు డజను, ఆవు పంచితం 50 ml , రాగి చెంబు కలశం , ప్లాస్టిక్ గ్లాసులు 3,  మామిడి కొమ్మ, 1, పూలు, పూల దండలు,  దేవుని ఫోటో 1,  కొబ్బరి కాయలు , బూడిద గుమ్మరి కాయ 1, రాచ గుమ్మడి కాయ 1,  నెయ్యి దీపాలు చిన్నవి 2, (మంగళ హారతి ) నీళ్ళు , చిల్లర పైసలు 11,  అగ్గిపెట్టె, 1,కంకణ దారం ,  పాలు పొంగించటానికి ఇత్తడి కొత్త గిన్నె 1  ఆవు పాలు 1/2 లీటరు  కర్పూరం, ఆగరబత్తి, పాకెట్, 1  అయ్యగారి దక్షిణ Rs.5,000/-

హోలీ పండగ తేది 25-3-2024 సోమవారం

  శివుడు   రతీదేవి పతి అయిన మన్మథుడ్ని దహించిన సంఘటన ప్రసిద్ధమైనది. శివతపస్సును భగ్నం చేసినందుకు కాముడ్ని భస్మం చేసినది   ఫాల్గుణ  పౌర్ణమి రోజే. రతీదేవి ఆర్తనాదాల్ని విన్న సృష్టికర్త మన్మథుడు లేని విశ్వంలో తన సృష్టి సాగదని గ్రహించి సర్వేశ్వరుని ఆగ్రహం చల్లార్చి విషయమును విశద పరిచింది. ఈశ్వరుడు రతీదేవిని కరుణించి మన్మథుడు నిర్వికారుడై భార్యవైన నీకు మాత్రమే కనిపిస్తాడు.  ఈ విశ్వసృష్టికి మూలమైన స్రీపురుషులలో ప్రేమానురాగాలను, అన్యోన్యరసాలను అందిస్తూ జీవన ప్రక్రియకు దోహదం చేస్తుంటాడు అని చెప్పి మన్మథుడ్ని సజీవుడిని గావిస్తాడు. మన్మథుడు పునర్జన్మ పొందిన రోజు కూడా ఫాల్గుణ పౌర్ణమినాడే హిరణ్యకశ్యపుని సోదరి  హోలిక  అగ్ని కూడా కాల్చలేని మహాశక్తిమంతురాలు. తన కుమారుడైన ప్రహ్లాదుడు హరినామస్మరణను మరువమన్నా మాట వినక పోవడంతో హిరణ్యకశిపుడు మండిపడతాడు. హోలికను తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోపెట్టుకుని అగ్నిప్రవేశం చేయమని ఆదేశిస్తాడు. ప్రహ్లాదుడు హరిభక్తమహిమ వలన బయటపడతాడు కాని, హోలిక శక్తి సన్నగిల్లి అగ్నికి ఆహుతైపోయింది. ఇలా ఎన్నో  కథలు  ప్రచారంలో ఉన్నప్పటికీ మనిషి అంతరంగంలో ఉండే తుచ్చమైన కోరికల్ని దహింపచేసు

అమలకి ఏకాదశి తేది 20-3-2024 బుధవారం

  ఈ ఏడాది అమలకి ఏకాదశి మార్చి 20వ తేదీ వచ్చింది. ఆరోజు పుష్య నక్షత్రం కూడా ఉంటుంది. అమలకి ఏకాదశి రోజున భక్తులు విష్ణుమూర్తితో పాటు ఉసిరి చెట్టుకి పూజలు చేస్తారు. విష్ణుమూర్తి ఈ చెట్టులో కొలువు తీరాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువుతో పాటు  లక్ష్మీదేవి , కుబేరుడు ఈరోజు ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారని భక్తుల విశ్వాసం. అలాగే రాధాకృష్ణులు కూడా ఏకాదశి రోజున ఉసిరి  చెట్టు  కింద సంతోషంగా గడిపారని పురాణాలు చెబుతున్నాయి. పూజా విధానం అమలకి ఏకాదశి రోజు విష్ణువుని లక్ష్మీ సమేతంగా పూజిస్తారు. అలాగే పార్వతి దేవి శివుడిని కూడా పూజిస్తారు. పొద్దునే నిద్రలేచి పవిత్ర నదీ స్నానం ఆచరించాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ గదిలో  దీపం  వెలిగించి విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పిస్తారు. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. అలాగే ఉసిరి చెట్టు కింద నవరత్నాలతో కూడిన ఒక కలశం ప్రతిష్టించడం మంచిది.

ఆజ్య వీక్షణం పూజ సామగ్రి

 బియ్యం 1250 గ్రాములు, కంచు లోహం తో ఉన్న చిన్న ముకుడు 1, నువ్వుల నూనె 1/2 కిలో,  మంచి స్వచ్ఛమైన చిందూరం, 1/2 కిలో, ఎర్రని చిందూరం రంగులో దోవతి, ఉత్తరీయం,  పూల మాల, 1  దానాలు, : -  బియ్యం 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, 

కణ్ణినుణ్ శిరుత్తాంబు తెలుగు లో అర్థము

  1.అంతు తెలియని మాతృత్వపు భక్తి భావనలో, లీనమయిన ఆ యశోదాదేవి చేత, సన్నని ముడులతో, అల్లిన చిన్న త్రాడుతో, రోటికి కట్టబడిన ఆ శ్రీకృష్ణుడి కంటే, దక్షిణ భారత దేశములో వున్న, కురుకాపురి నగరములోని, విశేష ప్రజ్ఞాశాలి అయిన, నమ్మాళ్వారు అంటేనే, నాకు చాలా ఇష్టము. ఆయన మీద భక్తి భావముతో, ఆయన పేరు పలకాలి, అనే ఆలోచన, నా మదిలో మొదలవగానే, నా మనస్సు సంతోషముతో వువ్విళ్లూరి, నా నోటి నుండి, అమృతము వలె లాలాజలము వూరును. ఆ దేవుడి పేరు పలుకుట కంటే, మా నమ్మాళ్వారు పేరును పలుకుటయే, నాకు చాలా చాలా ఇష్టము. 2. నమ్మాళ్వారుడి వేదాంత ఉపదేశములకు, మనసారా తృప్తి పడి, ఆయన యొక్క భక్తి భావనకు, నేను దాసుడను అయితిని. ఆ దేవుడి గొప్పతనము కంటే, నా గురువుగారి గొప్పదనమే, వెయ్యిరెట్లు ఎక్కువగా, నాకు కనిపించినది. అందుకే, నేను మైమరచి, ఆ నమ్మాళ్వారుడిని కీర్తించి, ఆనందమును పొంది, ఆయన దివ్య పాదములనే, నేను, ఆశ్రయించితిని. విశేష ప్రజ్ఞాశాలి అయిన మా నమ్మాళ్వారు తప్ప, నా కంటికి ఏ దేవుడు కనిపించడం లేదు. అందుకే, నేను దేశ దేశముల తిరుగుతూ, ఆయన ఆ భగవంతుడి గురించి, తెలిపిన ఉపదేశములను, మథురమైన పాటల రూపములో పాడి, ఆయన గొప్పతనమును తెలిపెదను. 3. నే

మాఘ మాసం అమావాస్య నాడు చెయ్య గూడని పనులు

మాఘ మాసంలో వచ్చే అమావాస్య మార్చి 10వ తేదీ ఆదివారం  వచ్చింది. ఈరోజు కొన్ని పనులు చేయడం అశుభంగా పరిగణిస్తారు. ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం. మరుసటి రోజు నుంచి మాఘ మాసం పూర్తయి ఫాల్గుణ మాసం ప్రారంభం అవుతుంది. హిందూ మతంలో అమావాస్య రోజు పవిత్ర నదిలో స్నానం ఆచరించడం, దాన ధర్మాలు చేయడం వంటి వాటికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈరోజు కొన్ని పనులు చేయడం వల్ల అనేక దోషాలు నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు కొన్ని నమ్మకాల ప్రకారం అమావాస్య రోజున నిర్జన ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం మానుకోవాలి. అటువంటి ప్రదేశాలలో ఈరోజును  ప్రతికూల  శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. ఒంటరిగా వెళ్ళినప్పుడు ప్రతికూల శక్తులు మీపై ఆధిపత్యం చెలాయిస్తాయి. అందువల్ల ఈ సమయంలో ఒంటరిగా వెళ్లడం కరెక్ట్ కాదంటారు. బయట భోజనం చేయకూడదు మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ఎవరైనా తమ ఇంట్లోనే ఆహారాన్ని తినాలి. వేరొకరి ఇంట్లో భోజనం చేయడం వల్ల పుణ్యఫలాలు నశిస్తాయని నమ్మకం. శుభకార్యాలు చేయకూడదు కొన్ని నమ్మకాల ప్రకారం అమావాస

విజయ ఏకాదశి తేదీ 6-3-2024 బుధవారం

నవగ్రహ పూజ & శివరాత్రి అభిషేకం పూజ సామగ్రి వివరాలు

 పసుపు 100 గ్రాములు,  కుంకుమ 50 గ్రాములు,  శ్రీ గంధం 100 గ్రాములు, బియ్యం 3  కిలోలు,  తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 50,  ఖర్జూరం పండ్లు 50, అరటి పండ్లు 2 దజన్లు,  ఆవు పంచితం 100 ml , ఆవు పేడ,   పూలు, కిలో,జిల్లేడి పూలు కొంచెం, బిల్వ పత్రం కొంచెం , పూల దండలు 10 మూరలు,  గో ధుమ పిండి 1250 గ్రాములు,  కండి పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు,  తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు,  తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1250 గ్రాములు,  ఉలవలు 1250 గ్రాములు,  పేపర్ ప్లేట్లు 10,  దోప్పలు 10, ఆవు పాలు లీటరు, ఆవు పాల పెరుగు 500 గ్రాములు, మంచి తేనె 250 గ్రాములు, ఆవు నెయ్యి 500 గ్రాములు, చక్కెర 200 గ్రాములు, అయిదు రకాల పండ్ల రసాలు,  విబూది పొడి, జంజీరమ్ 1,  దోవతి సెల్లా 1 set , కొబ్బరి కాయలు 14 , చిల్లర పైసలు 25, కర్పూరం పాకెట్, 1,  శివ లింగం 1, నంది బొమ్మ ,శంఖం 1,గంట 1,  డ మరుకం 1  `,  ఆగరబతి , సాంబ్రాణి పొడి , అగ్గిపెట్టె, 1, దీపాలు 2,  అయ్యగారి దక్షిణ .