Skip to main content

Posts

Showing posts from February, 2011

సంతానము కోరుకొనేవారు - భేష్మ తర్పణం

మాఘ శుద సప్తమి మొదలు ఏకాదశి వరకు అయిదు రోజులను 'భేష్మ పంచకం' అంటారు. కల నిర్ణయ చంద్రిక, నిర్ణయ సింధు, ధర్మ సింధు,కాల మాధవీయం, ......లాంటి గ్రంధాలన్నీ మాఘ శుద్ధ అష్టమినే భీష్మ నిర్యాణ దినముగా వివరించినాయి. భీష్మునికి ఆరోజే తర్పణలు విడిచిపెట్టాలని చెప్పినాయి. ముక్యంగా సంతానము కోరుకొనేవారికి ఈరోజు చాల ముక్యమయినది. భీష్మాష్టమి నాడు తిల అంజలి సమర్పించి, భీష్ముడిని స్మరించేవారికి సంతానప్రాప్తి కలుగు తుందని హేమాద్రి పండితుడు తన గ్రంధాలలో చెప్పినాడు. శ్రాధము కూడా పెడితే మంచిదని పద్మ పురాణము చెబుతున్నది. సంవస్చర పాపం పోవాలంటే ఆనాడు భీష్ముడికి జలాంజలి సమర్పించాలని భారతము చెప్పింది. అందుకే మాఘ శుద్ధ ఏకాదశికి 'భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది.

జిల్లెడి ఆకుతో స్నానము

సూర్యుని పుట్టిన రోజును రథ సప్తమిగా ౧౦-౨-౨౦౧౧ రోజున పండుగ చేసుకుంటాము. సూర్యోదయ కాలములో ఆకాశాములోని నక్షత్ర కూటమి రథము ఆకారములో ఉంటుంది. ఇంటిలోని స్త్రీలు చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయలు, వివిధ ఫల పుష్పాలతో గొబ్బిల్లను పిడకలుగా చేస్తారు. సూర్యునికి ఎదురుగా నిప్పు పేర్చి ఆవుపాలతో పొంగలి తాయారు చేస్తారు. సూర్యునికి ఇష్టమైన జిల్లేడు ఆకుల మధ్య రంద్రము చేసి రేగు పండ్లను ఉంచి తల మీద, భుజాలమీద, హృదయము మీద, ఉంచుకొని స్నానము చేసి జిల్లెడి ఆకుల గుండా సూర్య దర్శనము చేసుకొని పునీతులు అవుతారు. సుర్యరధన వలన ఆయురారోగ్య ఇష్వర్యాలు సిద్దిస్తాయి. సూర్య గాయత్రిని చదువుకుంటే మంచిది.

వివాహ పొంతన నాడీ కూట దోషము

నాడి కూటమి, తక్కిన కూటాలకు తల మీద మని వంటిది. బ్రహ్మ దీనిని కన్యకా మేడలోని మంగళ సూత్రములా ఏర్పరచినాడు. ఆది నాడి వదూవరులకు ఏక నాడి అయితే వియోఘము, మధ్యమ నాడి ఏకానాది అయితే ఇరువురికి నాశము, అంత్యనాడి ఏకానాది అయితే వాయిదవ్యం. నాడి కూటం సరిగా లేకుంటే మిగిలిన ఏడు కూటాలు గుణాలను కూడా నాశనము చేస్తుంది. నాడి వేద ఉన్నపుడు చరన వేద తప్పక విడిచి పెట్ట్టాలి. ౧ వ పాదముతో ౪ వ పాదం, ౪వ పాదముతో ౧ వ పాదం, ౨ వ పాదముతో ౩ వ పాదం, ౩ వ పాదముతో ౨ వ పాదం వేద ఏర్పడుతుంది. తప్పని సరి అయితే నాడి దోష పరిహారానికి మృత్యుంజయ మంత్ర జపం, సువర్ణ దానం, జపానికి స్వర్ణ దక్షిణ ఇవ్వాలి.

గృహ ప్రవేశ పూజ సామగ్రి

పసుపు ౨5౦ గ్రాములు , కుంకుమ ౧౦౦ గ్రాములు , శ్రీ గంధం ,1 బియ్యము ౫ కిలోలు , తమల పాకులు ౧౦౦ , వక్కలు ౩౫ , ఖర్జూరము ౩౫ , పండ్లు అయిదు రకాలు , పూలు , పూలదండలు , మామిడి తోరణములు , అరటి కొమ్మలు ౪ , పసుపు కొమ్ములు ౧౫ , ఆవు పాలు , పెరుగు , తేనె , ఆవు నెయ్యి , చక్కర , కొబ్బరి కాయలు ౧౫ ,రాచ మరియు బూడిద గుమ్మడి కాయలు ౨ , పుస్తెలు , మట్టెలు , ఆవు నెయ్యి , కొత్త గిన్నెలు ౨ , సమిధలు , హోమము పూడ , పూర్ణాహుతి వస్తువులు , ఆవాలు , మినపప్పు , నవధాన్యాలు ,each grain 1250 grams seperately ధోవతి , పంచలు , చీర , జాకెట్టు బట్టలు , ఆవు మూత్రము , లక్ష్మి నారాయణ ఫోటో , జీలకర్ర బెల్లము , తలంబ్రాల బియ్యము , బాశికాలు ౨ , మంగళ హారతి , మంగళ వాయిద్యము , ముగ్గు పిండి , హోమము మండపం , గోధుమ రవ్వ ప్రసాదము కిలో మీద పావు కిలో , కాజు , కిస్స్మిస్స్ , ధ్రఖష , సార పలుకులు . అయ్యగారి దక్షిణ , 6౦౦౦ రూపాయలు .

మాఘ మాసము విశేషాలు

ఎల్లప్పుడూ ఉదయము స్నానము చేయాలే. మూడు పూటలు స్నానము చేయాలే. భోగములను వదిలి జితేంద్రియుడి మూడు పూటలు విష్ణువు ను పూజించాలే. ఈ మాసమునందు స్నానం చేసినచో కోరిన ఫలములు పొందుతారు. అన్ని అవయములు దృడముగా ఉండగా వేడి నేటి స్నానము చేయరాదు. పితరులకు, దేవతలకు ముల్లంగి ఇవ్వరాదు. బ్రాహ్మణుడు మొలకాన్ని తింటే నరకానికి పోతాడు. ప్రతి రోజు సూర్యునికి అర్గ్యము ఇవ్వలే.మాఘమాసము రాగానే సూర్యోదయము కాగానే జలము లన్నే శబ్దిస్తాయి. త్రివిధములయిన సర్వ పాపములను పోగొట్టి పవిత్రులను చేస్తాయి. ప్రతి రోజు చక్కరతో కూడిన నువ్వులను దానము చెయ్యాలే. అలాగే తిలల స్నానం, తిలలు వంటికి రాచుకోవడం, తిల హోమం,తిల తర్పణం, తిల భోజనం, తిల దానం,ఈ ఆరు రకాల తిలలు పాప నాశనకములు. వస్త్ర భుశానములతో అలంకరించి బ్రాహ్మణా దంపతులను భుజింప చేయాలే. కంబళము, జింక చర్మము, రత్నములు, వివిధ వస్త్రములు, రవికలు ఇవ్వాలే. శక్తి కొలది అన్న దానము చేయాలే. వేద విద్వాంసులకు బంగారము ఇవ్వాలే. ముప్పది నువ్వు లడ్డులు ఇవ్వాలే. దేవాలయములో నువ్వుల దేపములు పెట్టాలే