Skip to main content

Posts

చైత్ర శుద్ధ పౌర్ణమి శ్రీ హనుమత్ విజయోత్సవం - జయంతి కాదు తేదీ 23-4-2024

  శ్రీ హనుమాన్ విజయోత్సవం విశిష్టత ఏమిటి శ్రీరామునికి అత్యంత నమ్మకమైన బంటు హనుమంతుడు. శ్రీరాముడు సీతను ఎడబాసి మానసిక క్షోభను అనుభవిస్తూ, సీత జాడ వెతుకుతున్న సందర్భ సమయంలో అడవిలో రాముడుకి హనుమంతునితో పరిచయం ఏర్పడినది. పరిచయం ఏర్పడిన నాటి నుండి శ్రీరామచంద్రున్ని హనుమంతుడు విడిచి ఉండలేదు, రాముడే తన సర్వస్వంగా భావించిన వాయునందనుడు తన ప్రభువైన రాముని మాట ఏనాడు జవదాటలేదు. చివరికి రాముడు రావణునితో యుద్ధం చేసి సీతను తీసుకుని అయోధ్యకు వచ్చి శ్రీ రామ పట్టాభిషేకం అయిన తర్వాత రామునికి అనిపిస్తుంది నేను హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీత తిరిగి వచ్చినది, తిరిగి అయోధ్య నగరంలో రాముని పట్టభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉండడం గ్రహించిన రాముడు నాకు అన్ని వేళల హనుమంతుడు సహాయంగా ఉన్నాడు అని తన విజయం హనుమంతుని సహకారం ఎంతగానో తోడ్పడినది అని రాముడు చైత్ర పౌర్ణమి రోజు హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు. నాటి నుండి ఆ రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకుని తమ రాజైన రాముడు ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజు సన్మానం చేసాడో ప్రతి సంవత్సరం చైత్రపౌర్ణ మి రోజు శ్రీ హనుమత్ విజయోత్సవంగా నాటి నుండి నేటి
Recent posts

అన్న ప్రాశన పూజ సామగ్రి వివరాలు

 // శ్రీ రామ  // పసుపు 200 గ్రాములు,  కుంకుమ 50 గ్రాములు,  బియ్యం 2 కిలోలు,  తమల పాకులు 50, నల్లని పోక వాక్కలు 15, ఖర్జూరం 11, పసుపు కొమ్ములు 11, ఆచమనం పాత్ర 1, పూలు, పూల దండలు, మామిడి కొమ్మ 1,  అన్నం పాయసం , ఆవు పాలల్లో ఉడ కాలి. బెల్లం,ఆవు నెయ్యి తో ఉండాలి.  కొబ్బరి కాయ, 1, రాగి చెంబు 1, తెల్లని వస్త్రము (బంగారు అంచు ఉండాలి ) కనుము బట్టలు 2, ఆవు పంచితం 50 ml , గంధం,  చిల్లర నాణెములు 15, దీపాలు 2, వత్తులు , అగ్గిపెట్టె 1, ఆగరబత్తి, కర్పూరం పాకెట్, 1, పూజారి దక్షిణ Rs .2,000/-

పెండ్లి పత్రిక, పూలు, పండ్లు తాంబూలాల మార్పిడి కార్యక్రమం పూజ సామగ్రి

                                                      //  జై శ్రీరామ్ // పసుపు 100 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం ఒక చిన్న డబ్బా ,  మంచి బియ్యం 3 కిలోలు,  తమల పాకులు 50,  నల్లని పోక వక్కలు 25,  ఖర్జూరం కాయలు, 15, పూలు, పూల దండలు, ఆవు పంచితం, 50 ml . అయిదు రకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున ఇందులో అరటిపండ్లు పెట్టగూడదు.  ఆగరబత్తి , పాకెట్,  సెంట్ సీసా చిన్నది 1, రోజ్ వాటర్ చల్లడానికి  కర్పూరం పాకెట్, 1, తెల్లని వస్త్రములు 2, (బంగారు అంచు తో  ఉండాలి ) అమ్మాయి/అబ్బాయి కి కొత్త బట్టలు, ఆభరణాలు, etc .  వారి తల్లి తండ్రులకు, ఆడ పడుచులకు  కూడా బట్టలు పెట్టాలి.  కనుము బట్టలు 2,  స్వీట్ బాక్స్, 1,  కాజు, బాదం, ఎండు ద్రాక్ష పాకెట్ , etc . ఎండు కుడుకలు 5,  నె య్యి దీపాలు 2, అగ్గిపెట్టె 1 , వత్తులు  ఇంటి దేవుని ఫోటో 1, రాగి చెంబు 1 , ఆచమనం పాత్ర 1  చాపలు , లేదా పీటలు 2, బ్రాహ్మణ దక్షిణ 5,001/- 

పాప విమోచి ని ఏకాదశి తేదీ 5-4-2024 శుక్రవారం

  పాపమోచని ఏకాదశి చాలా ప్రభావవంతమైనదని పండితులు చెబుతుంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటూ.. శ్రీ మహా విష్ణువు ఆరాధిస్తే మీ పాపాలన్నీ తొలగిపోతాయని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడని నమ్ముతారు. ఈ రోజున నిజమైన మనసుతో ఉపవాసం ఉండటంతో పాటు విష్ణువును పూర్తి ఆచారాలతో ఆరాధించడం ద్వారా, మోక్షాన్ని పొందుతారు. పాపమోచని వ్రత కథ: ఒక అడవిలో ఓ రుషి పరమేశ్వరుడి కోసం తపస్సు ప్రారంభిస్తాడు. తపస్సులో మునిగిపోయిన ఆ రుషిని అప్సరస లాంటి ఓ యువతి భంగం కలిగిస్తుంది. కళ్లు తెరిచి చూసే సరికి అందాల కుందనపు బొమ్మలా ఉన్న ఆ యువతిని చూసి ఆ రుషి మనసు చలించిపోతుంది. తనను మోహిస్తాడు. తనతో ప్రేమలో పడతాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు రతీ క్రీడల్లో మునిగిపోతాడు ఆ రుషి. కొంత కాలం తర్వాత ఒకానొక రోజు ఆ యువతి తన గురించి చెబుతూ తనను ఇంద్రుడు పంపించాడని, అనుమతిస్తే తిరిగి స్వర్గలోకానికి వెళ్లిపోతానని వేడుకుంటుంది. తన మాటలు విన్న ఆ రుషి కోపోద్రిక్తుడు అవుతాడు. ఆ యువతి వల్లే తన తపస్సు చెడిపోయిందని ఆవేశంలో యువతిని శపిస్తాడు. ఏ అందంతో తన దృష్టి మరల్చిందో ఆ అందం పోయి పిశాచిలా మారిపోవాలి శపిస్తాడు. అప్పుడు ఆ యువతి రుషి కాళ్లపై పడి తనను క్షమించమన

Ugaadi festival on 9-4-2024 Tuesday

  తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి,  ఉగాది  పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. " ఉగాది పచ్చడి " ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన  ఉగాది పచ్చడి  తెలుగువారికి ప్రత్యేకం. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి ఇచ్చే సందేశం. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతిగా నిలుస్తాయి. ఈ పచ్చడిలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందని తెలుపుతోంది. శ్లోకం:  శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌ కరాయచ  సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడిని తీసుకోవాలి ఉగాది పర్వదినం రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. శ్రీ మహావిష్ణువు అయిన కాల పురుషుడిని గౌరవించేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు. 

దేవాలయాలలో ప్రదక్షిణలు ఎందుకు ?

  దేవాలయాలంటేనే ప్రశాంతతకు చిహ్నాలు, అక్కడికి వెళ్తే మనస్సుకు ప్రశాంతత కలగడమే కాదు, ఆ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహాం వస్తుంది. అయితే ఎవరు ఏ దేవాలానికి వెళ్లినా దైవాన్ని దర్శించుకోవడానికి ముందు ఖచ్ఛితంగా  ప్రదక్షిణలు  చేస్తారు.ద్వజ స్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ప్రదక్షిణలు కనీసం 3 చేయాలి. ఆ తర్వాతనే లోనికి వచ్చి తీర్థ ప్రసాదాలు, అర్చనలు చేయించుకోవాలి. ప్రసాదం కూర్చొని తినాలి. 

లఘు గృహ ప్రవేశం పూజ సామగ్రి వివరాలు

 // శ్రీ రామ // పసుపు 100 గ్రాములు,  కుంకుమ 50 గ్రాములు, బియ్యం 5 కిలోలు,  ఆఖ0 డ దీపం 1, మట్టిది 2,  తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 60, అరటి పండ్లు డజను, ఆవు పంచితం 50 ml , రాగి చెంబు కలశం , ప్లాస్టిక్ గ్లాసులు 3,  మామిడి కొమ్మ, 1, పూలు, పూల దండలు,  దేవుని ఫోటో 1,  కొబ్బరి కాయలు , బూడిద గుమ్మరి కాయ 1, రాచ గుమ్మడి కాయ 1,  నెయ్యి దీపాలు చిన్నవి 2, (మంగళ హారతి ) నీళ్ళు , చిల్లర పైసలు 11,  అగ్గిపెట్టె, 1,కంకణ దారం ,  పాలు పొంగించటానికి ఇత్తడి కొత్త గిన్నె 1  ఆవు పాలు 1/2 లీటరు  కర్పూరం, ఆగరబత్తి, పాకెట్, 1  అయ్యగారి దక్షిణ Rs.5,000/-

హోలీ పండగ తేది 25-3-2024 సోమవారం

  శివుడు   రతీదేవి పతి అయిన మన్మథుడ్ని దహించిన సంఘటన ప్రసిద్ధమైనది. శివతపస్సును భగ్నం చేసినందుకు కాముడ్ని భస్మం చేసినది   ఫాల్గుణ  పౌర్ణమి రోజే. రతీదేవి ఆర్తనాదాల్ని విన్న సృష్టికర్త మన్మథుడు లేని విశ్వంలో తన సృష్టి సాగదని గ్రహించి సర్వేశ్వరుని ఆగ్రహం చల్లార్చి విషయమును విశద పరిచింది. ఈశ్వరుడు రతీదేవిని కరుణించి మన్మథుడు నిర్వికారుడై భార్యవైన నీకు మాత్రమే కనిపిస్తాడు.  ఈ విశ్వసృష్టికి మూలమైన స్రీపురుషులలో ప్రేమానురాగాలను, అన్యోన్యరసాలను అందిస్తూ జీవన ప్రక్రియకు దోహదం చేస్తుంటాడు అని చెప్పి మన్మథుడ్ని సజీవుడిని గావిస్తాడు. మన్మథుడు పునర్జన్మ పొందిన రోజు కూడా ఫాల్గుణ పౌర్ణమినాడే హిరణ్యకశ్యపుని సోదరి  హోలిక  అగ్ని కూడా కాల్చలేని మహాశక్తిమంతురాలు. తన కుమారుడైన ప్రహ్లాదుడు హరినామస్మరణను మరువమన్నా మాట వినక పోవడంతో హిరణ్యకశిపుడు మండిపడతాడు. హోలికను తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోపెట్టుకుని అగ్నిప్రవేశం చేయమని ఆదేశిస్తాడు. ప్రహ్లాదుడు హరిభక్తమహిమ వలన బయటపడతాడు కాని, హోలిక శక్తి సన్నగిల్లి అగ్నికి ఆహుతైపోయింది. ఇలా ఎన్నో  కథలు  ప్రచారంలో ఉన్నప్పటికీ మనిషి అంతరంగంలో ఉండే తుచ్చమైన కోరికల్ని దహింపచేసు

అమలకి ఏకాదశి తేది 20-3-2024 బుధవారం

  ఈ ఏడాది అమలకి ఏకాదశి మార్చి 20వ తేదీ వచ్చింది. ఆరోజు పుష్య నక్షత్రం కూడా ఉంటుంది. అమలకి ఏకాదశి రోజున భక్తులు విష్ణుమూర్తితో పాటు ఉసిరి చెట్టుకి పూజలు చేస్తారు. విష్ణుమూర్తి ఈ చెట్టులో కొలువు తీరాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువుతో పాటు  లక్ష్మీదేవి , కుబేరుడు ఈరోజు ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారని భక్తుల విశ్వాసం. అలాగే రాధాకృష్ణులు కూడా ఏకాదశి రోజున ఉసిరి  చెట్టు  కింద సంతోషంగా గడిపారని పురాణాలు చెబుతున్నాయి. పూజా విధానం అమలకి ఏకాదశి రోజు విష్ణువుని లక్ష్మీ సమేతంగా పూజిస్తారు. అలాగే పార్వతి దేవి శివుడిని కూడా పూజిస్తారు. పొద్దునే నిద్రలేచి పవిత్ర నదీ స్నానం ఆచరించాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ గదిలో  దీపం  వెలిగించి విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పిస్తారు. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. అలాగే ఉసిరి చెట్టు కింద నవరత్నాలతో కూడిన ఒక కలశం ప్రతిష్టించడం మంచిది.

ఆజ్య వీక్షణం పూజ సామగ్రి

 బియ్యం 1250 గ్రాములు, కంచు లోహం తో ఉన్న చిన్న ముకుడు 1, నువ్వుల నూనె 1/2 కిలో,  మంచి స్వచ్ఛమైన చిందూరం, 1/2 కిలో, ఎర్రని చిందూరం రంగులో దోవతి, ఉత్తరీయం,  పూల మాల, 1  దానాలు, : -  బియ్యం 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు,