మాఘమాసంలో బహుళ ఏకాదశిని కల్యాణ ఏకాదశి అంటారు. తిలలను ఆరు విధాలుగా ఉపయోగించే పర్వదినం. కనుక ‘‘షట్ తిలా ఏకాదశి’’ అని కూడా అంటారు. సంక్రాంతి పండుగనాడు కూడా నువ్వులతో పిండివంటలు చేసుకొనే సంప్రదాయం ఉంది. ఇందులో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. మాఘమాసంలో శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి నాడు ఆరు విధాలుగా నువ్వులను ఉపయోగించడంలో నువ్వులను దానం చేయడం ఒక అంశం. తిలాదానం గ్రహ శాంతి సందర్భాలలోనూ, పితృ కార్యాల లోనూ జరుగుతుంది గనుక కల్యాణ ఏకాదశినాడు తిలలతో పూజ చేయడం అసాధారణం అనిపిస్తుందిగాని ఇది పురాణాకాలం నుంచి వస్తున్న విధానం. మాఘమాసంలో శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి నాడు ఆరు విధాలుగా నువ్వులను ఉపయోగించడంలో నువ్వులను దానం చేయడం ఒక అంశం.
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment