Skip to main content

Posts

Showing posts from May, 2024

హిందూ వివాహలలో త్రీ జే ష్ట విషయాలు

మోహినీ ఏకాదశి తేదీ 19-5-2024 ఆదివారం

  ఈసారి మోహినీ ఏకాదశి నాడు మూడు పవిత్రమైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ మూడు పవిత్ర యాదృచ్చికాలను పూజించడం ద్వారా ప్రజలుకోరుకున్న కోరికలు నెరవేరి, ఇంట్లో సుఖ, సంతోషాలు నెలకొంటాయని విశ్వాసం. ఈసారి మోహినీ ఏకాదశి రోజున అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. ఈ రోజుకి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశి రోజున విష్ణువు తో పాటు మోహిని అవతారాన్ని పూజిస్తారు. పాపాలు పోగొట్టుకుని సుఖ సంతోషాలతో జీవించాలని భక్తులందరూ మోహినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున ఉపవాసం, పూజలు చేయడం ద్వారా భక్తుడు సుఖ సంతోషాలను పొందుతాడు. ఈసారి మోహినీ ఏకాదశి రోజున అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు జ్యోతిషశాస్త్ర కోణంలో చూస్తే చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి అమృత యోగం: ఇది మే 19, ఆదివారం ఉదయం 05:28 నుంచి మే 20, సోమవారం ఉదయం 03:16 వరకు ఉంటుంది. వజ్ర యోగం: మే 18, శనివారం ఉదయం 10:25 నుండి మే 19 ఆదివారం ఉదయం 11:25 వరకు సిద్ధి యోగం: ఇది మే 18వ తేదీ శనివారం ఉదయం 11:25 నుండి మే 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:11 గంటల వరకు ఉంటుంది. ఈ యోగాలలో మోహినీ ఏకాదశి వ్రతా

Ramanujaacharya (Sri Vyshnavite aacharya) birth day on 12-5-2024 Sunday

  Thiruvarangathamudanar, in his 'Ramanuja Nootrandadhi,' has acknowledged the role of the Azhvars in spreading Vedantic truths. Refering to Poigai Azhvar, the first Azhvar, he says he is the one who lit a lamp to get rid of darkness. He refers to Poigai Azhvar with a sense of possession as 'yem' (our). The reason is Poigai Azhvar's work, as that of the other Azhvars, is in Tamil. His verses are not in a language we cannot comprehend, but it is in our language. Hence this is a cause for delight. What was the darkness the lamp lit by Poigai Azhvar's lamp dispelled ?It was the darkness of ignorance in our hearts that the Azhvar dispelled, through his verses. His verses are collectively referred to as the Mudal Thiruvandadi. Poigai Azhvar's work begins with a verse that says that with the world as the lamp, the ocean as the oil, the Sun as the igniting spark, the Azhvar lit a lamp, namely his verses. It goes on to say his verses are the garland he offers to Lor

వైశాఖ మాసం 9-5-2024 గురువారం నుండి ప్రారంభం.

 గురువారం  నుండి వైశాఖ మాసం ప్రారంభం అవుతుంది. వసంత ఋతువులో రెండవ మాసం వైశాఖ మాసం. దీనికి వైదిక సాంప్రదాయంలో 'మాధవ' మాసం అంటారు. వైశాఖ మాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది. వైశాఖంలో రకరకాల వ్రతాలు చెప్పారు. వైశాఖ మాసంలో సూర్యుడు మేష సంక్రమణంలో ఉండగా ప్రాత: స్నానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. మాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకు ఎంతో పుణ్య ప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహా విష్ణువు కు ప్రీతి కరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు ను లక్ష్మీ దేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో ఏక భుక్తం, నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమంగా చెప్పబడింది. వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు, తపస్సులకు పూజాదికాలకు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది.

శ్రీ వైష్ణవ తదీయా రాధన పూజ సామగ్రి

బియ్యం 50 గ్రాములు,  నల్లని నువ్వులు 50 గ్రాములు, ఆవు నెయ్యి 10 గ్రాములు,  ఆవు పేడ కొంచెం,  ఆవు పంచితం కొంచెం, గంధం పొడి 10 గ్రాములు, దొప్పలు 5, మూడు ఆకుల అంట , (మోదుగ ఆకులు 3 )  ఆచమనం పాత్ర 1,రాగి చెంబు 1,  దీపం 1, ఆగరబత్తి , కర్పూరం , పూలు , తులసి దళాలు,  వక్కలు, తమలపాకులు 20.  చిల్లర పైసలు 15, ధర్భ కట్ట,1  ఆళ్వార్ సంభావన,  స్వాములకు సంభావన,  పేరుమాళ్ళ తీర్థం, సీపా తీర్థ0 (సంప్రదాయం లో ఉంటే)

గోవిందా అని ఎందుకు అంటారు ?

   ఒకనాడు వెంకటేశ్వర స్వామి వారు అగస్త్య ముని దగ్గరకు వెళ్తారు. అగస్యముని తో నా పేరు శ్రీనివాసులు అంటారు నీ దగ్గర చాలా గోవులు ఉన్నాయని తెలిసి వచ్చాను అందులో ఒక దానిని నాకు ఇవ్వవా అనే స్వామివారు అగస్త్య ముని తో అడుగుతారు. ముని చాలా సంతోషించి స్వామి మీకు ఇవ్వటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వేదాల ప్రకారం సహచారినిఉంటే గాని గోవుని ఇవ్వకూడదు అంటారు.  కాబట్టి స్వామి మీరు సతీమణితో మరోసారి రాగలరు అప్పుడు స్వామి సరే అని వెళ్ళిపోతారు. ఒక్కరోజు అగస్త్య ముని ఆశ్రమంలో లేనప్పుడు పద్మావతి అమ్మవారు సతీసమేతంగా ఆశ్రమానికి వస్తారు. ఆశ్రమంలో శిష్యుని అడుగుతారు మీ గురువుగారు సతీసమేతంగా వచ్చి గోవును స్వీకరించండి అన్నారు మాకు గోవునిస్తారు చెప్పారు. అప్పుడు శిష్యుడు మా గురువుగారు లేరు ఆయన ఆదేశాలు లేకుండా నేను ఏమి చేయలేను మీరు మరోసారి ఆయన ఉన్నప్పుడు గోవును తీసుకొని వెళ్లండి అని శిష్యుడు పలుకుతాడు. దాంతో స్వామి వారు ఆగ్రహించి తిరుమల కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్తారు. అంతలో అగస్యముని ఆశ్రమానికి రాగానే శిష్యుడు జరిగిన ఉత్తాంతం వివరిస్తాడు దాంతో ముని ఒక గోవును తీసుకొని శిష్యుల్ని మరి కొంతమందిని వెంటపెట్టుక

మే నెల 4 న వరూధిని ఏకాదశి

వరూథిని ఏకాదశి ( మే 4) న ఏ పనులుచేసిన కూడా అది గొప్ప ఫలితాలను ఇస్తుందని చెబుతుంటారు.. ప్రపంచాన్ని పోషించే శ్రీ మహా విష్ణువు అవతారమైన వామన అవతారాన్ని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున ఆచారాల ప్రకారం శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుని పూజించిన వారికి భయం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా ఆర్ధిక ఇబ్బందుల్లో బాధపడేవారు కొన్ని వస్తువులను బ్రాహ్మణులకు దానం చేసి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలని పండితులు సూచిస్తున్నారు.  వరుథిని ఏకాదశి రోజున చేయాల్సిన దానాలు ఏమిటంటే.. అన్న వితరణ:  వరుథిని ఏకాదశి నాడు అన్నదానం చేయడం వల్ల మానవులు, దేవతలు, పూర్వీకులు మొదలైన వారంతా సంతృప్తి చెందుతారు. వరుథిని ఏకాదశి రోజున అన్నదానం చేయడం వల్ల చాలా ఫలం లభిస్తుంది. అన్నపూర్ణ దేవి ఈ రోజున అన్నదానం చేయడం ద్వారా సంతోషిస్తుంది.దీని వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు నెలవుగా ఉంటుంది. అలాగే, మీ ఇంట్లో సుఖ శాంతులు ఉంటాయి. దాహార్తిని తీర్చడం:  వరుథిని ఏకాదశి నాడు నీటితో నింపిన మట్టి కుండను దానం చేయడం ఉత్తమమైనదిగా భావిస్తారు. ఈ రోజున బాటసారులకు నీరు ఇచ్చినా శుభఫలితాలు లభిస్తాయి. పిల్లలు దీర్ఘాయుష్షు పొందుతారని, వారికి ఎలాంటి స