గౌతమ బుద్ధుడు వైశాఖ మాసంలో శుక్ల పక్షం పూర్ణిమ రోజున జన్మించాడు. అందుకే ఈరోజున బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటారు.బుద్ధ పూర్ణిమ రోజున రావిచెట్టును పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని, ఎందుకంటే ఈ చెట్టులో శ్రీ మహా విష్ణువు నివాసం ఉంటారని చాలా మంది నమ్ముతారు. పురాణాల ప్రకారం, బుద్ధ పూర్ణిమ రోజున రావిచెట్టును పూజించడం వల్ల పూర్వీకుల ఆత్మ కూడా శాంతిస్తుందని చాలా మంది నమ్మకం. శాస్త్రాల ప్రకారం, ఈ పర్వదినాన చెట్లను నాటడం వల్ల గురు, శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందట. హిందూ పురాణాల ప్రకారం, రావి చెట్టులో ముక్కోటి దేవతలు, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు నివసిస్తారు. అందుకే బుద్ధ పూర్ణిమ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి రావి చెట్టుకు నీరు సమర్పించి దీపారాధాన చేయడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. మరోవైపు జ్యోతిష్యం ప్రకారం, జాతకంలో గురు, శని గ్రహాల ప్రభావం తగ్గి.. శుభ ఫలితాలొస్తాయి.
కృతయుగంలో దేవ, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలు పెట్టారు. మందరగిరిని కవ్వంగా, వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగింది. ఈ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువు వేడుకున్నారు. అప్పుడు నారాయణుడు కూర్మరూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం.
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (1408, మే 9 - 1503, ఫిబ్రవరి 23 ) మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.
Comments
Post a Comment