Skip to main content

ఈ రోజు నమ్మాళ్వార్ జయంతి కూడా ..

  దేవాలయంలో శట్టారి  ఎందుకు ఇస్తారు?

కలియుగం ఆరంభమైన 42 వ రోజున ఒక మహానుభావుడు అవతరించాడు. అంటే సుమారు 5100 సంవత్సరాల క్రితం అన్న మాట.
కారిమారులనే దంపతులకు భగవత్ ప్రార్థన చేస్తే ఒక చిన్న శిశువు పుట్టింది. ఆ శిశువు పుట్టగానే మాట లేదు, కదలిక లేదు, ఎట్లాంటి స్పందన లేదు. ఆ పిల్లవాడు పాపం ఆహారం ముట్టడం లేదు, ఆ పిల్లవాడి ప్రవృత్తి ఏం పనికి వచ్చేలా లేదు. తల్లి తండ్రులకు ఏంతోచక ఆళ్వారు తిరునగరి అనే ఊరి దేవాలయం వద్ద
వదిలి వెళ్ళారు.ఆశ్చర్యం ఆ శిశువు క్రమేపి జరగడం ప్రారంబించింది,ఆ గుడిలో ఉన్న చింతచెట్టు క్రిందకు చేరింది. మాటలేదు, చూపులేదు,ఎట్లాంటి ప్రవృత్తిలేదు.కేవలం కూర్చొని ఉంది. అట్లా 16సం||రాలు గడిచాయి, శరీరం మాత్రం పెరుగుతూ వచ్చింది.అందరికి ఆశ్చర్యంగా అనిపించేది,క్రమంగా అందరూ మరచి పోయారు
అదే ఊరికి ప్రక్కనే తిరుక్కోరూర్ అనే ఊరు ఉంది. ఆ ఊరికి చెందిన ఒక మహానుభావుడు అందమైన కంఠస్వరం కల్గినవాడు, అందంగా పాడగలడు. అందుకే *మధురకవి అని పేరు* . చాలా కాలం ఉత్తర దేశ యాత్ర చేస్తూ అక్కడే ఉండి పోయాడు. అలా తన యాత్ర సాగిస్తూ అయోధ్యాపురంలో ఉన్నప్పుడు,
ఒక నాడు రాత్రి ఆకాశంలో అధ్భుతమైన తారక కనిపించింది. కొత్తగా ఆ నక్షత్రం ఉంది, పైగా అది దక్షిణం వైపు నడుస్తున్నట్లు కనిపించింది. అది కదులు తున్నట్లుగా రాత్రి అంతా ప్రయాణం సాగించాడు. తెల్లవారే సరికి నక్షత్రాలు కనిపించవు. రోజంతా అలసట తీర్చుకొని, మళ్ళీ రాత్రి ఆ నక్షత్రం నడిచిన వైపు ...
ప్రయాణం సాగించాడు. అయితే కొన్నాల్లకు ఈ శిశువు ఉన్న ఊరికి చేరాక ఆ నక్షత్రం కనిపించడం మానేసింది.

ఆశ్చర్యం అనిపించింది. ఈ ఊర్లో ఏమైనా వింత జరుగుతుందా అని ఆ ఊరి పెద్దలని అడిగాడు. పెద్దగా ఎవ్వరికీ జ్ఞాపకం లేదు ఆ శిశువు గురించి. ఆ ఊరి దేవాలయంకి వెళ్ళి చూసాడు.
అక్కడ చింతచెట్టు తొఱ్ఱలో నీలి శరీరం కలఒక 16 ఏండ్ల శిశువు కనిపించింది.ఆకాశంలో కనపడ్డ నక్షత్రం యొక్క కాంతి ఈ శిశువు దేహంలో కనపడింది.మాట లేదు పలుకు లేదు,బొమ్మలా ఉంది ఆ శిశువు.ఏమైన మాట్లాడగలదా అని తెలుసుకుందామని ఆప్రక్కనే చెట్టు ఎక్కి ఒక పెద్ద శబ్దం వచ్చేలా ఒక రాయిని కిందికి విసిరాడు
ఆ శబ్దానికి శిశువు ఒక్క సారి కనులు తెరిచి చూసాడు. మరి మాటేమైనా వచ్చునా అని ఒక కొంటె ప్రశ్న వేసాడు. చచ్చిన దాని కడుపున పుట్టేది ఏం తింటుంది, ఏం చేస్తుంది అని అడిగాడు. దానికి బదులుగా ఆ శిశువు మరింత కొంటెగా సమాధానం ఇచ్చింది. అక్కడే తింటుంది అక్కడే పడి ఉంటుంది అని సమాధానం ఇచ్చింది
ఆ శిశువు శఠ అనే వాయువుని కోప్పడ్డాడు కనక 16 సంవత్సరాలు అనుభవించాడు, ఎప్పుడైతే మధురకవి అతన్ని మేల్కొలిపాడో ఆ శిశువు బయటికి చూడటం ప్రారంభించాడు. ఆ లోన అనుభవించిన ధివ్య అనుభవాన్ని బయటికి పాడటం ప్రారంభించాడు.

వారు చింతచెట్టు తొర్రలో కూర్చొనే లోకంలోని అన్ని రీతులని పాడారు.
ఈనాడు మనం చూసే వారి ప్రవృత్తిని ఆనాడు కలియుగ ఆరంభంలో పాడ గలిగారు. స్వామి భగవద్గీతలో చెప్పినట్లుగా *"సర్వధర్మాన్ పరిత్యజ్య" అ* నే విషయాన్ని అందమైన పాటలుగా పాడారు. మనం చేసే కర్మ పట్టులను *"వీడుమిన్"* మనస్సుతో వడలండి అని చెబుతాడు. వదిలి, భగవంతుడి పాదములు అనే భవనంలో ఉండమని చెప్పాడు.
శఠకోపులవారి పాటలను విని *శ్రీరంగనాథుడే* స్వయంగా 'నా' ఆళ్వార్ అని పిలిపించుకున్నాడు, అందుకే నమ్మాళ్వార్ అని పేరు వచ్చింది.

ప్రేమకి లక్ష్యీ భూతమైన వారు నమ్మాళ్వార్. అందుకే మన ఆలయాల్లో తల వంచినప్పుడు భగవంతుడి పాదాలను తాకిస్తారు. ఆపాదాలు అంటే నమ్మాళ్వారే.
నమ్మాళ్వార్ స్వామి పాదాలనే పదే పదే తలచేసరికి స్వామి నమ్మాళ్వార్ ని తన పాదాలుగా స్వీకరించాడు. ఆ నమ్మాళ్వారికే పేరు శఠకోపులు అని. శఠ అనే వాయువుని ఆక్రమించకుండా కోపించారు కనక వారికి పేరు *శఠ కోపులు, శఠ వైరి, శఠ అరి. ఆ శఠారే మన శిరస్సున తాకిస్తారు.
అట్లా తాకించుకుంటే ఆయన కృప మనల్ని ఆక్రమించినట్లే అర్థం.అందుకే ఆయనే ప్రయోజనం అని అనుకుంటే మనకు లభించనిది అంటూ ఏమి ఉండదు. అందుకే భగవత్ కృప మూర్తీభవించిన ఆ ఆళ్వార్ని పట్టవే మనసా ఇక చేయాల్సిన కృత్యాలు ఏమి ఉండవు అని అనుకుంటారు. అట్లా భావించే వారే నాకు సర్వస్వం అని భగవంతుడు అనుకుంటాడు.

Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.