ఈసారి మోహినీ ఏకాదశి నాడు మూడు పవిత్రమైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ మూడు పవిత్ర యాదృచ్చికాలను పూజించడం ద్వారా ప్రజలుకోరుకున్న కోరికలు నెరవేరి, ఇంట్లో సుఖ, సంతోషాలు నెలకొంటాయని విశ్వాసం. ఈసారి మోహినీ ఏకాదశి రోజున అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. ఈ రోజుకి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశి రోజున విష్ణువు తో పాటు మోహిని అవతారాన్ని పూజిస్తారు. పాపాలు పోగొట్టుకుని సుఖ సంతోషాలతో జీవించాలని భక్తులందరూ మోహినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున ఉపవాసం, పూజలు చేయడం ద్వారా భక్తుడు సుఖ సంతోషాలను పొందుతాడు.
ఈసారి మోహినీ ఏకాదశి రోజున అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు జ్యోతిషశాస్త్ర కోణంలో చూస్తే చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి
- అమృత యోగం: ఇది మే 19, ఆదివారం ఉదయం 05:28 నుంచి మే 20, సోమవారం ఉదయం 03:16 వరకు ఉంటుంది.
- వజ్ర యోగం: మే 18, శనివారం ఉదయం 10:25 నుండి మే 19 ఆదివారం ఉదయం 11:25 వరకు
- సిద్ధి యోగం: ఇది మే 18వ తేదీ శనివారం ఉదయం 11:25 నుండి మే 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:11 గంటల వరకు ఉంటుంది.
- ఈ యోగాలలో మోహినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, విష్ణువును పూజించడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది.
- కెరీర్‌లో విజయాన్ని పొందడానికి, విష్ణువుకు వెన్న ,పంచదార మిఠాయిని సమర్పించి, విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రం ముందు కూర్చుని, ‘ఓం నమో భగవతే నారాయణ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
Comments
Post a Comment