Jyo తిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు మే 25వ తేదీన రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఇదే నక్షత్రంలో జూన్ 8వ తేదీ వరకు ఉంటాడు. ఈ పక్షం రోజుల పాట ఎండలు మరింత మండిపోతాయి. నాలుగు నెలలుగా వచ్చే వేడి గాలులు ఒక ఎత్తు అయితే.. కేవలం రోహిణి కార్తె సమయంలో మాత్రం నేరుగా రోళ్లు పగిలేంత ఎండలు పెరిగిపోతాయి. ఈ కాలంలో సూర్య భగవానుడు భగ భగ మండిపోతూ ఉంటాడు. ఈ పక్షం రోజుల్లో సూర్యుడి తీవ్రత తీవ్ర స్థాయికి చేరుకుని, కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. తెలుగు వారు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగాన్ని రూపొందించుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుస్తారు. ఈ లెక్కన సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరా ఉంటే ఆ కాలానికి కార్తె అని పేరు పెట్టారు. అంటే ఏడాదికి 27 కార్తెలు. అంతేకాదు ఈ కార్తెలను అందరికీ అర్థమయ్యే విధంగా సామెతల రూపంలో రూపొందించారు. అందులో ఒకటే రోహిణి కార్తె.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment