Skip to main content

Posts

Showing posts from August, 2022

ఋషి పంచమి తేదీ 1-9-2022 గురువారం

  ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున దీనిని జరుపుకుంటారు. ఈ రోజున ఏడుగురు మహర్షులను పూజించడం వల్ల జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున ఉపవాసం ( Rishi Panchami  2022) ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. పంచాంగం ప్రకారం,  ఋషి పంచమి  సెప్టెంబర్ 1, గురువారం వస్తుంది. ఋషి  పంచమినే రిషి  పంచమి , గురు  పంచమి  అని కూడా  అంటారు . సనాతన ధర్మంలో  ఋషి  పంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఏడుగురు ఋషులను పూజిస్తారు. ఈ రోజున ఎవరైతే ఋషులను పూజించి స్మరిస్తారో వారికి పాప విముక్తి లభిస్తుందని నమ్ముతారు.  ఈ పుణ్య రోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమి, వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షులను ఒక్కసారైనా వారిని తలచుకోవాలని మన పెద్దలు చెబుతుంటారు. అరణ్యవాసంలో సీతారాములకు అభయం ఇచ్చినవారు అత్రిమహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపించినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రాముడికి తన తపః ఫలాన్ని అందించిన మహారుషి గౌతముడు. రాముడి గురువు విశ్వామిత్రుడు, కులగురువు వశిష్ఠుడు. విష్ణువు అవతారమైన పరశురాముడి కన్నతండ్రి జమదగ్ని మహర్షి.

వినాయక దేవుని పద్యాలు

  తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసముల్ కొండొక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీతనయ! ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్! కందము: తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా దలచితినే హేరంబుని దలచిన నా విఘ్నములను తొలగుట కొరకున్ కందము: అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్ నిటలాక్షునగ్ర సుతునకు పటుకరముగ విందు చేతు ప్రార్థింతు మదిన్ చందము: తొలుతన విఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన సేసెద నేకదంత నా వలపటి చేత ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయకా ఉత్పలమాల: తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జెలును మెల్లనిచూపులు మందహాసమున్ కొండక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్ మంగళ హారతి శ్రీశంభు తనయునకు సిద్ది గణనాథునకు వాసిగల దేవతావంద్యునకును ఆసరస విద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయమంగళం నిత్య శుభమంగళం, జయాజయమంగళం నిత్య శుభమంగళం నేరేడు మారేడు

వినాయక చవితి 31-8-2022 బుధవారం

  కొత్తగా ఏ పని లేదా కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ గణనాధునికే చేయాలి. ఎందుకంటే ఆయన అనుగ్రహం పొందితే పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా అది విజయవంతంగా పూర్తిచేస్తారని నమ్ముతారు. సాక్షాత్తు విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతిని పూజించినట్టు 'ఋగ్వేదం' చెబుతోంది. అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన 'భాద్రపద శుద్ధ చవితి' రోజునే 'వినాయక చవితి' పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది 31-8-2022 బుధ వారం రోజు వినాయక చవితి జరుపుకోనున్నాం.

భాద్రపద మాసం లో........

  చంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వల్ల ఇది  భాద్రపద  మాసంగా వ్యవహరిస్తారు. ఈ  మాసం  లో ఒంటి పూట భోజనం చేస్తే ధన సమృద్ది ఆరోగ్యం ప్రాప్తిస్తాయని పండితులు చెపుతున్నారు. ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ  మాసం  లో విశేష ఫలితాన్నిస్తాయి. భాద్రపదంలో ఒకో రోజు గడిచేకొద్దీ ఊరంతా హోరెత్తిపోతుంది. మరి వినాయక చవితి వచ్చేది ఈ నెలలోనే కదా! ఆ చవితి రోజున స్వామి రూపాన్ని మట్టితో రూపొందించి, ఆ రూపాన్ని పత్రితో పూజిస్తాం. సర్వ శుభాలనూ కలిగించే ఆ విఘ్నాధిపతిని పూర్తిగా ప్రకృతితోనే పూజించి, ప్రకృతిలోనే నిమజ్జనం చేయడం ఈ పండుగకే ప్రత్యేకం.   ఒక్క చవితే కాదు, భాద్రపదంలో ప్రతి తిథీ ప్రత్యేకమే! వినాయక చవితి తర్వాత వచ్చే పంచమిని రుషిపంచమి అని పిలుస్తారు.  ఆ రోజున స్త్రీలంతా సప్తర్షులని పూజిస్తూ ఉపవాసం ఉంటారు. అలా చేస్తే... రుషుల అనుగ్రహంతో వారిలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఆ తర్వాత వచ్చే సూర్యషష్టి, లలితా సప్తమి, రాధాష్టమి తిథులలో ఆయా దేవతలని పూజిస్తారు. ఇలా ఒకో తిథినీ దాటుతూ పరివర్తన ఏకాదశి వస్తుంది.   తొలిఏకాదశి రోజున శేషతల్పం మీద శయనించే విష్ణుమూర

శ్రీ వరసిద్ది వినాయక పూజకు కావలసిన వస్తువులు.

దూర్వాయుగ్మ పూజ : వినాయకునికి ఎక్కువ ప్రీతికరమైనవి దూర్వలు. దూర్వులు అనగా గరక పోచలు. గ్యాస్ అనగా గడ్డి ప్రతిచోట ఉండును. చిగురులు కల గరిక పోచలు వినాయకుడు పూజలో వజ్రాల కన్న, బంగారు పూవులు కన్న ఎక్కువ విలువ కలిగినవి. గణేశుడే స్వయంగా " మత్పూజా భక్తినిర్మితా మహీత స్వల్పకవాపీ వృధా దూర్వంకురై ర్వినా " అంటే భక్తితో చేసిన పూజ గొప్పది.గరిక లేకుండా పూజ చేయరాదు. " వినా దూర్వాంకు రై : పూజా ఫలంకేనాపి నాప్యతే తస్మాదిషసి మద్భ త్వరిత రేఖా భక్తీ సమర్పితా దూర్వా దతతీ యత్ఫలం మహత్ నతత్క్ర్ తుశతై రాదా నైర్ ర్వ్ ఉష్టానా సంచయై : " పసుపు 200  గ్రా. కుంకుమ 50  గ్రా. మట్టితో చేసిన గణపతి పూజకు శ్రేష్టం బియ్యం 5 కిలోలు,  తమలపాకులు 200, విడి  పూలు, పూల దండలు, పత్రి, 21 రకాల ఆకులు, మామిడి ఆకులు,  దోవతి, సెల్లా, కనుము బట్ట, కలశం చెంబులు, ఆచమనం పాత్ర,  దారం బంతి,  అగరవత్తులు 1 పేకట్ ప్రత్తి (ఒత్తులకు, వస్త్రయుగ్మమునకు,యజ్ణోపవీతమునకు) దీపము ( కొబ్బర నూనెతో శ్రేష్టం,ఆవునేతితోగాని) పంచామృతములు (ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార నీళ్ళు లేదా కొబ్బరి నీళ్ళు) గంధము, వక్కలు 50,ఖర్జూరం పండ్లు పాకెట్, ,

అజ ఏకాదశి తేదీ 23-8-2022 మంగళవారం

  ఈసారి  అజ ఏకాదశి  ( Aja Ekadashi  2022) ఆగస్టు 23న జరుపుకోనున్నారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు.  అజ ఏకాదశి  నాడు శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల ఇంట్లో ధనధాన్యాలు, సిరి సంపదలు పెరుగుతాయని నమ్ముతారు.

శంఖు స్తాపన పూజ సామగ్రి

 పసుపు, 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  గంధం చిన్న పాకెట్,  బియ్యం 3 కిలోలు, తమల పాకులు 100,  వక్కలు 35, ఖర్జూరం పండ్లు 21, అరటి పండ్లు డజను 1,  మామిడి కొమ్మ 1, శంఖువు 1, నవరత్నాలు, పంచలోహాలు, కొబ్బరికాయలు 3,  కనుము బట్ట 1,  తెల్లని వస్త్రము బంగారు అంచు తో ఉండాలి  గ్లాసులు 3,  ఆగరబతి,  కర్పూరం పాకెట్,  పూలు, పూల దండలు చిన్నవి 2, దేవత ఫోటో,  నవధాన్యాలు 1/2 కిలో,  ఆవు పాలు లీటరు 1,  రాళ్ళు, 5,  గునపము, సిమెంట్ తట్ట, సిమెంట్ కొంచెం, తాపే,  కంకణ దారం బంతి,  స్వీట్ నైవేద్యం, 

గృహ ప్రవేశం పూజ సామగ్రి

    పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  సున్నం డబ్బా చిన్నది 1,  బియ్యం 3  కిలోలు,  దోవతులు మరియు  ఉత్తరీయం  అంచుతో  1   , కనుములు  (blouse peaces ) 2 numbers  ఆవు పేడ  కొంచెం, ఆవు మూత్రం 500 ml , దేవత ఫోటో, మంగళ హారతి నెయ్యి దీపాలు 2,  తమల పాకులు 200 , వక్కలు 51  , ఖర్జూరం పాకెట్ 1,  అరటి పండ్లు 1  డజన్ , అయిదు రకాల పండ్లు,   ఆగరబతి packet పెద్దది 1,, సాంబ్రాణి  powder పొగ  కర్పూరం పాకెట్ పెద్దది 1,  మామిడి కొమ్మలు, ఇంటి గుమ్మాలకు  రాగి కలశం చెంబులు 2 , వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  21  పూలు,  1  kg. చిన్నవి పూల దండలు,  బూడిద గుమ్మడి కాయ, 1  రాచ గుమ్మడి కాయ 1, ఉట్టి తో సహ టెంకాయలు 5 + ద్వారాల సంఖ్య కు తగిన టెంకాయలు  , కంకణ దారం బంతి 1,  తెల్లని ఆవాలు, 100  గ్రాములు, అన్నీ కలిపిన నవ  ధాన్యాలు 1/2 కిలో, , ఇత్తడి గిన్నె పాలు పొంగించడానికి 1, ఆవు పాలు 1/2 లీటరు , పాయసం ప్రసాదం, ప్లాస్టిక్ గ్లాసులు 5,  ఆచమనం పాత్ర 1

కృష్ణాష్టకం

  వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ । దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ । రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ । విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ॥ మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ । బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ । యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ । అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ । శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ । శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ । కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥

మధురాష్టకం

  అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్ । హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 1 ॥ వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురమ్ । చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 2 ॥ వేణు-ర్మధురో రేణు-ర్మధురః పాణి-ర్మధురః పాదౌ మధురౌ । నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 3 ॥ గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురమ్ । రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 4 ॥ కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురమ్ । వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 5 ॥ గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచీ మధురా । సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 6 ॥ గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురమ్ । దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 7 ॥ గోపా మధురా గావో మధురా యష్టి ర్మధురా సృష్టి ర్మధురా । దలితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 8 ॥ ॥ ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణమ్ ॥

శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు ఏమి చేయాలి ?

 తేదీ 20-8-2022 శనివారం  రోజు శ్రీకృష్ణ భక్తులు అత్యంత విశ్వాసంతో శ్రీకృష్ణుడికి పూజలు, ఉపవాసం, కీర్తనలు మొదలైనవి చేస్తారు. శ్రీ కృష్ణుడు 64 కళలు కలవాడని నమ్మకం. శ్రీకృష్ణుడిని జన్మాష్టమి రోజున పూజిస్తే.. అయన ప్రసన్నుడై, రెప్పపాటులో జీవితంలో ఏర్పడిన అన్ని కష్టాలను తొలగించి.. సుఖ సంతోషాలను ఇస్తాడని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో కృష్ణాష్టమిరోజున పూజించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పూజావిధానం, అలంకరణకు సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం.. వేణువు:   శ్రీ కృష్ణ భగవానుడి పుట్టిన రోజున వేణువు లేకుండా పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. శ్రీ కృష్ణుడికి మురళి ఎంతో  ప్రీతిపాత్రమైనదని అందుకే ఆయనను మురళీధరుడని అంటారు. అటువంటి పరిస్థితిలో, శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు లభించాలంటే.. కన్నయ్య జన్మదినం రోజున మురళిని స్వామివారికి సమర్పించాలి. నెమలి ఈక  మురళితో పాటు నెమలి ఈకలను సమర్పించడం కూడా శ్రీకృష్ణుని పూజలో చాలా ముఖ్యమైనది. కృష్ణ భగవానుడు నెమలి పింఛానికి బహుమతిగా అందుకున్నాడు. అప్పుడు ఆ నెమలి ఈకను కిరీటంగా ఉపయోగించాడని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో, జన్మాష్టమి పూజ ఫలితం దక్కాలంటే

సంకట హర చతుర్థి తేదీ 11-11 -2022 శుక్ర వారం

  గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే  సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి (Angarika Chaturthi) నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి. ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు(సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వ

shubh muhurat for Rakhee ties

  Shubh Muhurat for Rakhi is  between 08:51 pm to 09:12 pm on Thursday, August 11 . govt. registered Astrologers assocition say that since August 12 will also be Purnima Tithi, Rakhi can be tied at any time on that day. So, August 12 can be used to celebrate the event.

ఆగస్టు 8న పుత్రదా ఏకాదశి:

  శ్రావణ మాసంలో వచ్చే సోమవారంకు ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ మాసంలో  సోమవారం ఆగస్ట్ 8న వస్తుంది. ఇదే సోమవారంన విష్ణువుకు ప్రీతికరమైన ఏకాదశి కూడా వస్తుంది.ఈ రోజున శుక్ల పక్షపు పుత్రదా ఏకాదశి వ్రతం చేస్తారు. ఈ రోజున మూడు గ్రహాలు తమ స్వంత రాశిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి.. కొందరికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి.  ఈసారి ఆగస్టు 8 చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున శ్రావణ శుక్ల ఏకాదశి కాబట్టి.. పుత్రదా ఏకాదశి ఉపవాసం చేస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించాలి. ఏకాదశి ఉపవాసం అన్ని వ్రతాల్లోకెల్లా అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు.ఈ రోజు ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ రోజున ఉపవాసం చేస్తారు. ఆగష్టు 8న మేషం, మకరం, మీన రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. మేష రాశిని పాలించే కుజుడు తన సొంత రాశిలో ఉంటాడు. శని, బృహస్పతి కూడా వారి స్వంత రాశులైన మకరం, మీన రాశులలోకి వస్తారు. ఏ గ్రహం తన రాశిలో ఉందో.. ఆ రాశి వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. వీరికి అధిక ధన లాభాలు కూడా కలగనున్నాయి. 

వరలక్ష్మి వ్రతం కథ

  వరలక్ష్మీ వ్రత కథ సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులని చూసి యిలా అన్నాడు. ‘ఓ మునీశ్వరు లారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి’. ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, ‘దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి’ అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు. ‘ఓ దేవీ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజు చేయవలెను’. పార్వతీదేవి ‘ నాథా! ఆ వరలక్ష్మీ వ్రతము ఎలా చేయాలి , ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనినెవరైనా యింతకు ముందు చేసారా? ఆ వివరములన్నీ చెప్పండి’ అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ

వరలక్ష్మి వ్రతం మహాత్యం

  శ్రావణ మాసంలో మహిళలు అత్యంత ఇష్టంగా జరుపుకునే వ్రతాలలో వరలక్ష్మీ వ్రతం అత్యంత ముఖ్యమైంది. హిందువులంతా అత్యంత పవిత్రంగా జరుపుకొనే వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాస పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తారు. ఈ మాసంలో ప్రతీ ఇంట్లో మహిళలు మహాలక్ష్మీ స్వరూపులుగా కనిపిస్తారు. పూజలు, ఉపవాసాలతో వరలక్ష్మీ దేవిని విశేషంగా పూజిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాలలో వరలక్ష్మీ వ్రతానికి ఉన్న ప్రాధాన్యత ఇంత అని చెప్పనలవికాదు. పేద, ధనిక తారతమ్యం లేకుండా ఎవరికి వారు వారి శక్తి కొలది అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని పూజించి, వ్రతాన్ని ఆచరించి ఈ నోమును నోచుకుంటారు.మొలకెత్తిన శనగలు, తీయటి పాదార్థాలు, పిండి వంటలు నైవేద్యాలు ఒకరికి ఒకరు ఇచ్చి పుచుకొంటారు.  వరలక్ష్మీదేవి అష్టైశ్వర్య, భోగ భాగ్యాలను, సకల శుభాలను, ఆయురారోగ్యాలను ఇస్తుందని మహిళలు చాలా ప్రగాఢంగా విశ్వసిస్తారు.

సుధర్శన హోమం ప్రాముఖ్యత

  సుదర్శనం అనే పదం రెండు పదాల కలయిక. 'సు' అంటే పవిత్రం, 'దర్శనం' అంటే చూడటం. ఈ పదాల కలయికకు అర్థం పవిత్ర దర్శనం. సుదర్శన చక్రం ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రాన్ని వేదాల కాలం నుండి పవిత్ర ఆయు ధంగా భావి స్తారు. శ్రీవైష్ణవ మత సంప్రదాయం ప్రకారం శ్రీమహా విష్ణువు చేతిలో ఉండే చక్రం చెడును నాశనం చేసి, ఆపదలో ఉన్న వారికి రక్షణనిచ్చే ఆయుధం. సుదర్శన చక్రం ఎప్పుడూ శ్రీమ న్నారాయణుడి అదుపులోనే ఉంటుంది. పురాణాల ప్రకారం శివుడు ఈ ఆయు ధాన్ని శ్రీమహావిష్ణువుకు ఇచ్చాడు. మరొక కథనం ప్రకారం దేవ తలకు చెందిన విశ్వకర్మ అనే శిల్పి సూర్యుని నుంచి తీసిన ఒకంత భాగాన్ని (1/8వ భాగం) ఉపయోగించి ఈ చక్రాన్ని తయారు చేసినట్లు చెబుతారు. సుదర్శన చక్రం మంచిని రక్షించడానికి, చెడును అంత మొందించడానికి ఉద్భవించిందని తెలిపే సంఘటనలు కొన్ని ఉటంకించబడ్డాయి. మహాభారతంలో శిశుపాలుని వంద తప్పుల వరకూ క్షమిసా ్తనని అతడి తల్లికి భగవంతుడు శ్రీకృష్ణుడు మాట ఇస్తాడు. ఆ హద్దు దాటిన తరువాత చక్రంతో శిశుపాలుని తల వధించబడుతుంది. క్షీర సముద్రాన్ని మథించడానికి ఒక కవ్వం అవసరమైన ప్పుడు మేరు పర్వతంపైభాగాన్ని ఖండించే బాధ్యత సుదర్శన చక్రానిక

గరుడ పంచమి 2-8-2022 మంగళ వారం

  శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో "  గరుడ పంచమి " ఒకటి. గరుత్మంతుడు సూర్యరధసారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్తసముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కుడా ఉన్నది. తన తల్లి కోసం ప్రాణాలకు సైతం తెగించిన గరుత్మంతుడి కథ కనిపిస్తుంది. పూర్వం కశ్యప ప్రజాపతికి 'వినత - కద్రువ' అనే ఇద్దరు భార్యలు వుండేవారు. వినతకు పరాక్రమవంతుడైన వైనతేయుడు ( గరుత్మంతుడు) జన్మించగా, కద్రువకు పాములు జన్మించాయి. ఓసారి కావాలనే వినతతో కద్రువ పందెం కాసి, అన్యాయంగా ఆమెను గెలిచి తనకు దాసీగా నియమించుకుంది. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ”గరుడపంచమి” పూజ చేస్తారని ప్రాశస్త్యం. ఉదయాన్నే తల స్నానం చేసి కొత్త వస్త్రములు ధరించి పూజా మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠంపై ముగ్గులు వేసి కొత్త వస్త్రమును వేసి బియ్యం పోయాలి. దానిపై గరుత్మంతుడి ప్రతిమను వుంచి షోడశోపచార పూజను నిర్వహించాలి. ధూప .. దీ