ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున దీనిని జరుపుకుంటారు. ఈ రోజున ఏడుగురు మహర్షులను పూజించడం వల్ల జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున ఉపవాసం (Rishi Panchami 2022) ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. పంచాంగం ప్రకారం, ఋషి పంచమి సెప్టెంబర్ 1, గురువారం వస్తుంది.
ఋషి పంచమినే రిషి పంచమి, గురు పంచమి అని కూడా అంటారు. సనాతన ధర్మంలో ఋషి పంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఏడుగురు ఋషులను పూజిస్తారు. ఈ రోజున ఎవరైతే ఋషులను పూజించి స్మరిస్తారో వారికి పాప విముక్తి లభిస్తుందని నమ్ముతారు.
ఈ పుణ్య రోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమి, వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షులను ఒక్కసారైనా వారిని తలచుకోవాలని మన పెద్దలు చెబుతుంటారు. అరణ్యవాసంలో సీతారాములకు అభయం ఇచ్చినవారు అత్రిమహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపించినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రాముడికి తన తపః ఫలాన్ని అందించిన మహారుషి గౌతముడు. రాముడి గురువు విశ్వామిత్రుడు, కులగురువు వశిష్ఠుడు. విష్ణువు అవతారమైన పరశురాముడి కన్నతండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాలలో ఒకటి అయిన వామనుడి తండ్రి కశ్యప మహర్షి. ఋషి పంచమి రోజున రామాయణం చదివితే ఈ మహర్షులు అందరినీ తలచుకున్నట్లే అని వేదపండితులు చెబుతున్నారు.
ఒక స్త్రీ 'రజస్వల' అయినప్పుడు తెలిసీ, తెలియక అయినా వంట చేసే పాత్రలను తాకినట్లయితే అది పాపమే అవుతుంది. బ్రాహ్మణులు మొదలైన నాలుగు జాతుల్లోనూ స్త్రీలు రజస్వల సమయంలో ఉన్నప్పుడు దూరంగా ఉండడం శ్రేష్ఠం. ఈ దోషాలు పోవాలంటే ఋషి పంచమి వ్రతం ఈ రోజు చేయటం కథ వినటం మంచిది.
Comments
Post a Comment