శ్రావణ మాసంలో వచ్చే సోమవారంకు ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ మాసంలో సోమవారం ఆగస్ట్ 8న వస్తుంది. ఇదే సోమవారంన విష్ణువుకు ప్రీతికరమైన ఏకాదశి కూడా వస్తుంది.ఈ రోజున శుక్ల పక్షపు పుత్రదా ఏకాదశి వ్రతం చేస్తారు. ఈ రోజున మూడు గ్రహాలు తమ స్వంత రాశిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి.. కొందరికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి.
ఈసారి ఆగస్టు 8 చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున శ్రావణ శుక్ల ఏకాదశి కాబట్టి.. పుత్రదా ఏకాదశి ఉపవాసం చేస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించాలి. ఏకాదశి ఉపవాసం అన్ని వ్రతాల్లోకెల్లా అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు.ఈ రోజు ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ రోజున ఉపవాసం చేస్తారు.
ఆగష్టు 8న మేషం, మకరం, మీన రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. మేష రాశిని పాలించే కుజుడు తన సొంత రాశిలో ఉంటాడు. శని, బృహస్పతి కూడా వారి స్వంత రాశులైన మకరం, మీన రాశులలోకి వస్తారు. ఏ గ్రహం తన రాశిలో ఉందో.. ఆ రాశి వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. వీరికి అధిక ధన లాభాలు కూడా కలగనున్నాయి.
Comments
Post a Comment