Skip to main content

శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు ఏమి చేయాలి ?

 తేదీ 20-8-2022 శనివారం రోజు శ్రీకృష్ణ భక్తులు అత్యంత విశ్వాసంతో శ్రీకృష్ణుడికి పూజలు, ఉపవాసం, కీర్తనలు మొదలైనవి చేస్తారు. శ్రీ కృష్ణుడు 64 కళలు కలవాడని నమ్మకం. శ్రీకృష్ణుడిని జన్మాష్టమి రోజున పూజిస్తే.. అయన ప్రసన్నుడై, రెప్పపాటులో జీవితంలో ఏర్పడిన అన్ని కష్టాలను తొలగించి.. సుఖ సంతోషాలను ఇస్తాడని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో కృష్ణాష్టమిరోజున పూజించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పూజావిధానం, అలంకరణకు సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం..

వేణువు:  శ్రీ కృష్ణ భగవానుడి పుట్టిన రోజున వేణువు లేకుండా పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. శ్రీ కృష్ణుడికి మురళి ఎంతో  ప్రీతిపాత్రమైనదని అందుకే ఆయనను మురళీధరుడని అంటారు. అటువంటి పరిస్థితిలో, శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు లభించాలంటే.. కన్నయ్య జన్మదినం రోజున మురళిని స్వామివారికి సమర్పించాలి.

నెమలి ఈక మురళితో పాటు నెమలి ఈకలను సమర్పించడం కూడా శ్రీకృష్ణుని పూజలో చాలా ముఖ్యమైనది. కృష్ణ భగవానుడు నెమలి పింఛానికి బహుమతిగా అందుకున్నాడు. అప్పుడు ఆ నెమలి ఈకను కిరీటంగా ఉపయోగించాడని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో, జన్మాష్టమి పూజ ఫలితం దక్కాలంటే.. నెమలి ఈకలను, దానితో చేసిన కిరీటాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించండి.

శంఖం: కన్నయ్య జన్మదినోత్సవం రోజున శంఖం లేని పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. సనాతన సంప్రదాయంలో శంఖం శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. జన్మాష్టమి పర్వదినం రోజున కన్నయ్యకు స్నానము చేయించిన అనంతరం.. పూజ సమయంలో శంఖాన్ని పురిస్తారు. కనుక జన్మాష్టమి పూజ సమయంలో శంఖం ఉండాలి.

తులసి పవిత్రమైన జన్మాష్టమి పండుగ రోజున..  నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణం. కన్నయ్య పుట్టిన రోజున మీరు ఏ ప్రసాదం చేసినా, అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైనది. జన్మాష్టమి పూజలో తులసి దళాన్ని సమర్పించడం ద్వారా అనుగ్రహం సులభంగా దొరుకుంది. కోరుకున్న వరం లభిస్తుందని నమ్మకం.

దోసకాయ పవిత్రమైన జన్మాష్టమి నాడు.. కన్నయ్య పూజలో ఒక కొమ్మతో కూడిన దోసకాయకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ దోసకాయను  సమర్పించడానికి.. బిడ్డ పుట్టిన తర్వాత బొడ్డు తాడును తన తల్లి నుండి వేరు చేయడానికి సంబంధం ఉందని నమ్మకం. జన్మాష్టమి రోజున దోసకాయను .. కాడను నుంచి కత్తిరిస్తారు. అదే విధంగా శ్రీకృష్ణుడు తన తల్లి దేవకి నుండి వేరు చేయబడ్డాడని నమ్మకం.

Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.