శ్రావణ మాసంలో మహిళలు అత్యంత ఇష్టంగా జరుపుకునే వ్రతాలలో వరలక్ష్మీ వ్రతం అత్యంత ముఖ్యమైంది. హిందువులంతా అత్యంత పవిత్రంగా జరుపుకొనే వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాస పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తారు. ఈ మాసంలో ప్రతీ ఇంట్లో మహిళలు మహాలక్ష్మీ స్వరూపులుగా కనిపిస్తారు. పూజలు, ఉపవాసాలతో వరలక్ష్మీ దేవిని విశేషంగా పూజిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాలలో వరలక్ష్మీ వ్రతానికి ఉన్న ప్రాధాన్యత ఇంత అని చెప్పనలవికాదు. పేద, ధనిక తారతమ్యం లేకుండా ఎవరికి వారు వారి శక్తి కొలది అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని పూజించి, వ్రతాన్ని ఆచరించి ఈ నోమును నోచుకుంటారు.మొలకెత్తిన శనగలు, తీయటి పాదార్థాలు, పిండి వంటలు నైవేద్యాలు ఒకరికి ఒకరు ఇచ్చి పుచుకొంటారు. వరలక్ష్మీదేవి అష్టైశ్వర్య, భోగ భాగ్యాలను, సకల శుభాలను, ఆయురారోగ్యాలను ఇస్తుందని మహిళలు చాలా ప్రగాఢంగా విశ్వసిస్తారు.
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment