సుదర్శనం అనే పదం రెండు పదాల కలయిక. 'సు' అంటే పవిత్రం, 'దర్శనం' అంటే చూడటం. ఈ పదాల కలయికకు అర్థం పవిత్ర దర్శనం.
సుదర్శన చక్రం ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రాన్ని వేదాల కాలం నుండి పవిత్ర ఆయు ధంగా భావి స్తారు. శ్రీవైష్ణవ మత సంప్రదాయం ప్రకారం శ్రీమహా విష్ణువు చేతిలో ఉండే చక్రం చెడును నాశనం చేసి, ఆపదలో ఉన్న వారికి రక్షణనిచ్చే ఆయుధం.
సుదర్శన చక్రం ఎప్పుడూ శ్రీమ న్నారాయణుడి అదుపులోనే ఉంటుంది.
పురాణాల ప్రకారం శివుడు ఈ ఆయు ధాన్ని శ్రీమహావిష్ణువుకు ఇచ్చాడు. మరొక కథనం ప్రకారం దేవ తలకు చెందిన విశ్వకర్మ అనే శిల్పి సూర్యుని నుంచి తీసిన ఒకంత భాగాన్ని (1/8వ భాగం) ఉపయోగించి ఈ చక్రాన్ని తయారు చేసినట్లు చెబుతారు.
సుదర్శన చక్రం మంచిని రక్షించడానికి, చెడును అంత మొందించడానికి ఉద్భవించిందని తెలిపే సంఘటనలు కొన్ని ఉటంకించబడ్డాయి.
మహాభారతంలో శిశుపాలుని వంద తప్పుల వరకూ క్షమిసా ్తనని అతడి తల్లికి భగవంతుడు శ్రీకృష్ణుడు మాట ఇస్తాడు. ఆ హద్దు దాటిన తరువాత చక్రంతో శిశుపాలుని తల వధించబడుతుంది.
క్షీర సముద్రాన్ని మథించడానికి ఒక కవ్వం అవసరమైన ప్పుడు మేరు పర్వతంపైభాగాన్ని ఖండించే బాధ్యత సుదర్శన చక్రానికి ఇవ్వబడింది.
సుదర్శన చక్రాన్ని తమిళంలో చక్రతల్వాన్ అంటారు. ప్రజలు తమ సుఖ సంతోషాల కోసం ఇంటిలో కాని, గుడిలోకాని సుదర్శన హోమాన్ని నిర్వహిస్తారు. ఈ హోమంలో భాగంగా సుదర్శనుని, అతడి భార్య విజయవల్లిని పవిత్ర జలం ఉన్న కుండలోకి ఆహ్వానిస్తూ పూజ చేస్తారు. సుదర్శనుని స్తుతిస్తూ మంత్రాలు పఠి స్తారు. ఈ హోమం పూర్తయ్యే సరికి హోమకర్త సుఖ సంతోషాలతో, ఆరోగ్యం తో తుల తూగుతాడని విశ్వాసం.
నియమ నిష్టలతో ఈ హోమాన్ని చేయాలి. మంత్రాలు చక్కని ఉచ్ఛారణతో పల కాలి. శరీరం, మనసు, మనం చేసే పనులు శుద్ధంగా ఉండాలి.
హోమం ఫలితాలు - చెడును నాశనం చేయడం, పాపాలను నిర్మూలించడం, ఆరోగ్యాన్ని పెంపొందించడం, మానసిక స్థయిర్యాన్ని ఇవ్వడం.
తేదీ 25-7-2023 మంగళవారం శ్రీ సుధర్శన స్వామి జన్మ దినం.
Comments
Post a Comment