Skip to main content

Posts

Showing posts from January, 2018
భీష్మ ఏకాదశి విశిష్టత- విష్ణు సహస్ర నామ స్తోత్రమును.. ! భీష్ముడు భారతంలో మణిపూస వంటివాడు. ఈతడు సత్యవతీ, శంతనుల వివాహ సంధానకర్తగా, ధృతరాష్ట్ర, పాండురాజులు పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు చెప్పించిన పితృతుల్యునిగా, కౌరవుల సర్వసైన్యాధక్షునిగా, సర్వలోకావళికి పాపభంజనం, పుణ్యప్రదం, మోక్షప్రదమునగు ‘శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము’ను అందించిన ఆచార్యునిగా సుప్రసిద్ధుడు. గంగా, శంతనుల కుమారుడైనందున ఇతనికి ‘గాంగేయుడు’, ‘దేవవ్రతుడ’నియు అంటారు. శంతన మహారాజుతో వివాహపూర్వము ఏర్పరచుకొనిన నియమమును రాజు గాంగేయుని జననమున ఉల్లంఘించినందున, ఆ పిల్లవానిని పెంచి పెద్దవానిని చేసి సకల విద్యాపారంగతుని చేసి అప్పగించగలనని పలికి, గంగాదేవి గాంగేయుని తీసికొని శంతనుని విడచి వెళ్ళింది. గంగాదేవి గాంగేయుని పరశురాముని వద్ద సకల విద్యలు, ధనుర్విద్యను నేర్పించి కొంత కాలమునకు శంతన మహారాజుకు అప్పగించింది. సత్యవతి తండ్రి దాశరాజుకు బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞచేసినందున తాను యావజ్జీవము బ్రహ్మచర్య వ్రతము పాటించి గాంగేయుడు భీష్ముడుగా ప్రసిద్ధికెక్కాడు. ఇలా ప్రతిజ్ఞ చేసిన కుమారుడు భీష్మునికి శంతనుడు స్వచ్ఛంద మరణ వరమును ప్రసాదించా
Bhishma Ashtami or ‘Bhishmashtami’ is a Hindu festival dedicated to ‘Bhishma’ of the great Indian epic ‘Mahabharata’. It is believed that Bhishma, also known as ‘Ganga Putr Bhism’ or ‘Bhishma Pitamaha’ departed from his soul on this chosen day on 25-1-2018 Thursday.  Bheeshma tarpan is important on this day. 
వసంత పంచమి   మాఘ శుద్ధ పంచమి  నాడు జరుపబడును.(తేది 22-1-2018 నాడు) దీనిని  శ్రీ పంచమి  అని కూడా అంటారు. ఈ పండుగ ఉత్తర భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు లక్ష్మీదేవిని పూజ చేయవలెను.   రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానము చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని  వసంతోత్సవము  అని కూడా అంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు  వసంత ఋతువు  ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను.  చైత్ర శుద్ధ పంచమి  నాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను" అని వ్రత చూడామణిలో పేర్కొనబడినది.

తద్దినముల విషయాలు

ప్రత్యాబ్దిక మాసికములు: - 1  వ మాసికము - ఊన మాసికము, 2 వ మాసికము - ద్వితీయ మాసికము, 2(ఏ)  త్రయ పక్షము - (2 వ మాసికము తరువాత 15 రోజులలోపు) , 3 వ మాసికము - తృతీయ మాసికము, 4 వ మాసికము - చతుర్థ మాసికము, 5 వ మాసికము - పంచమ మాసికము, 6 వ మాసికము - షణ్మాసికము, 6 (a) ఊన షణ్మాసికము ఇది 6 వ మాసికము తరువాత 171 వ రోజు లేదా ఏ లోపు , 7 వ మాసికము - సప్తమ మాసికము, 8 వ మాసికము - అష్టమ మాసికము,9 వ మాసికము - నవమ మాసికము, 10 వ మాసికము - దశమ మాసికము, 11 వ మాసికము - ఏకాదశ మాసికము, 12 వ మాసికము - ద్వాదశ మాసికము. సంవశ్చరీకము మొదటి రోజు - ఊన ఆబ్దికము , సంవశ్చరీకము 2 వ రోజు సంవశ్చర విముఖము, సంవశ్చరీకం మూడవ రోజు  -  ప్రత్యాబ్దికం జరుపుదురు.
గోదాదేవి తండ్రి పెరియాళ్వార్ చరిత్ర ద్రావిడ దేశంలోని వైష్ణవ మత ప్రవర్తకులైన పన్నెండుమంది ఆళ్వారుల్లో ఒకరు పెరియాళ్వారు. అతడి అసలు పేరు విష్ణుచిత్తుడు. ద్రవిడ దేశంలోని విష్ణుక్షేత్రాల్లో విల్లిపుత్తూరు ఒకటి. దీన్ని ‘ ధ్వనిపురం ’ అనీ పండితులు వ్యవహరించేవారు. ఈ క్షేత్రంలో మహావిష్ణువు వటపత్రశాయిగా వెలసి ఉన్నాడు. వటపత్ర శాయిని ఆరాధిస్తూ విష్ణుచిత్తుడు విల్లిపుత్తూరులో నివసించేవాడు. ప్రతినిత్యం వటపత్రశాయికి తులసి పుష్ప మాలికలను అల్లి కైంకర్యం చేసేవాడు. విల్లిపుత్తూరు పాండ్యరాజ్యంలో ఒక గ్రామం. పాండ్యరాజు మత్స్యధ్వజుడు. భోగలాలసుడు. ఒకరోజు ఆయన ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడంకోసం రాత్రి మారువేషంలో నగర వీధుల్లో సంచరిస్తుండగా ఒక ఇంటి అరుగుమీద కూర్చున్న పండితుడు కనిపించాడు. రాజు ఆ పండితుణ్ని ఏదైనా శ్లోకం వినిపించమని అడిగాడు. అప్పుడు ఆ పండితుడు- వర్షకాలం జీవితావసరానికి సరిపడే వస్తువుల్ని తక్కిన ఎనిమిది నెలల్లో సంపాదించుకోవాలి. రాత్రికి అవసరమైన వాటికోసం పగలు ప్రయత్నించాలి. వృద్ధాప్యం నిశ్చింతగా గడుపుకోవడానికి యౌవనంలో సంపాదించి దాచుకోవాలి. పరలోకంలో ఉత్తమ గతులకోసం ఈ లోకంలోనే ప్రయత్నం చెయ్యాలి అనే
Laxmi Narasimha Swamy hill temple, Naacharam gutta, near Toophran, Medak District. I participated as a rithwik in prabhanda Parayanam between 29-12-2017 to 3-1-2018