ప్రత్యాబ్దిక మాసికములు: - 1 వ మాసికము - ఊన మాసికము, 2 వ మాసికము - ద్వితీయ మాసికము, 2(ఏ) త్రయ పక్షము - (2 వ మాసికము తరువాత 15 రోజులలోపు) , 3 వ మాసికము - తృతీయ మాసికము, 4 వ మాసికము - చతుర్థ మాసికము, 5 వ మాసికము - పంచమ మాసికము, 6 వ మాసికము - షణ్మాసికము, 6 (a) ఊన షణ్మాసికము ఇది 6 వ మాసికము తరువాత 171 వ రోజు లేదా ఏ లోపు , 7 వ మాసికము - సప్తమ మాసికము, 8 వ మాసికము - అష్టమ మాసికము,9 వ మాసికము - నవమ మాసికము, 10 వ మాసికము - దశమ మాసికము, 11 వ మాసికము - ఏకాదశ మాసికము, 12 వ మాసికము - ద్వాదశ మాసికము. సంవశ్చరీకము మొదటి రోజు - ఊన ఆబ్దికము , సంవశ్చరీకము 2 వ రోజు సంవశ్చర విముఖము, సంవశ్చరీకం మూడవ రోజు - ప్రత్యాబ్దికం జరుపుదురు.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment