Skip to main content

Posts

Showing posts from February, 2024

రథ సప్తమి తేదీ 16-2-2024 శుక్రవారం

వసంత పంచమి తేదీ 14-2-2024 బుధవారం

  వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి  సరస్వతీదేవి జన్మించిన రోజు . ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేయవలెను. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానములు చేయవలెనని దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవీయే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేళీవిలాసాలతో స్తుతిస్తారు.  ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. మేధ ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస

షట్ తిల ఏకాదశి తేదీ 6-2-2024 మంగళ వారం ప్రత్యేకత

ప్రత్యేకత గురించి తెలుసుకుందాం #షట్ ‍ _తిల_ఏకాదశి పుష్య బహుళ ఏకాదశిని “షట్ ‍ తిలైకాదశి” అనే పేరుతో ‘ఆమాదేర్ ‍ జ్యోతిషీ’ అనే గ్రంథంలో ఉంది. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు తిలదాహీ వ్రతం చేస్తారని రాశారు. షట్ ‍ తిలైకాదశి అంటే.. ఆరు విధాలుగా తిలలను ఉపయోగించే ఏకాదశి అని భావం. 1. స్నానం చేసే నీటిలో నువ్వులను వేయాలి. 2. నువ్వులు నూరిన ముద్దను శరీరమంతా రాసుకుని, రుద్దుకోవాలి. 3. నువ్వుల గింజలను తినాలి. 4. తాగేనీటిలో కొద్దిగా నువ్వులను వేసుకోవాలి. 5. గురువులకు తిలలు దానం చేయాలి. 6. దేవతలకు(తెల్ల నువ్వులు), పితృదేవతలకు(నల్ల నువ్వులు) లతో తిలతర్పణాలు ఇవ్వడం ద్వారా నువ్వులు సమర్పించాలి. ఈ ఏకాదశి నాడు నువ్వులను పై ఆరు విధాలుగా ఉపయోగించవలసిన ఆవశ్యకత ఉండటంవల్ల దీనికి “షట్ ‍ (6) తిలైకాదశి” అనే పేరు వచ్చింది. 1) కశ్యపమహర్షి శరీరం నుండి ఉద్భవించిన తిలలు, ఈరోజున దానంచేస్తే సర్వవిధ దానములు చేసిన ఫలితం లభిస్తుంది. 2) నేడు బెల్లం+నువ్వులు కలిపిన ఉండలు మహావిష్ణువుకు నివేదించడం ద్వారా దారిద్ర్యం, శనిదోషాలు తొలగును.