Skip to main content

Posts

Showing posts from 2016
చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం తేది 30-12-2016 నుండి . “ పుష్య ” అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు , ధ్యానపారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది.వైకుంట ఏకాదశి ఈ నెలలోనే వచ్చింది.  పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు , మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్ప బడింది. ఈ మాసం లో రైతులకి పంట చేతికి వచ్చే కాలం కావున ధాన్య లక్ష్మి , ధన లక్ష్మి రూపం లో లక్ష్మీ దేవి ని విష్ణు మూర్తి సమేతం గా పూజిస్తారు. ఈ మాసం లో గృహ ప్రవేశాలు , పెళ్ళిళ్ళు , శంఖు స్థాపనలు వంటి శుభకార్యాలు చేయడానికి వీలులేనప్పటికీ సాధారణ పూజలు , పెద్దలని స్మరించుకొని చేసే అన్ని పుణ్య కార్యాలకి విశేష మాసం గా చెప్పవచ్చు. పుష్య మాసానికి అధిపతి అయిన శని మరియు నక్షత్రాదిపతి అయిన గురువు ని పూజించడం వలన విశేష ఫలితం లభిస్తుంది.. పుష్యమాసం లో శని గ్రహానికి అమావాస్య రోజున తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నివృత్తి జరుగుతుంది. వీట
Lord Satyanarayana swamy puja items Turmeric powder 200 grams, kumkum 100 grams, yellow colour chandan a small box, good veriety rice 3 kg.,jasmine loose flowers ½ kg., tulasi garland ½ metre, cow dung, cow milk, curd, cow ghee, sugar, honey, 5 verities of fruits 5 nos. each, Banana 1 dozen, date dry fruits 25, turmeric nuts 15, betel nuts 25, mango leaves, banana leaves  for 4 sides of mandap, rangooli powder 50 grams, colour thread ball 1, kalashams 2 nos.,coconuts 8 nos.,white cloth with golden colour border 2 pieces, blouse peaces in red & yellow colours 2 nos.,dry coconuts 2 halves, one rupee coins 21 nos.,cow urine, agarbathi & camphor one packet each. Wheat & sugar 1 kg. each, kaju, kissmiss, almonds  other dry nuts for mixing Prasad, betel leaves 100 good veriety, laxmi narayana swamy small prathima (idols), laxmi narayana swamy photo, mandap, pure water, ghee lamps 2 small nos. for harathi, big oil lamps 2 nos.,Brahman bojan items i.e.,  rice,vegitables,small
కపిల గోవు గురించి. శివుడి వాహనం వృషభం. ఒకమారు ఆయన హిమాలయాల్లో ధ్యానంలో ఉన్నప్పుడు , సమీపంలోని ఓ తల్లి ఆవు పొదుగు నుంచి లేగదూడ పాలు తాగుతుంటుంది. గాలి ధాటికి ఆ పాల నురగ ఆయనపై పడి , ధ్యానం భంగమవుతుంది. కళ్లు తెరిచి చూసిన ఆయన దృష్టి ఫలితంగా , ఆవులు నల్లగా మారి భయంతో పరుగులు తీస్తాయి. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై- ఆవుపాలకు ఎంగిలి ఉండదని శివుణ్ని శాంతపరుస్తాడు. అలా నల్లగా మారిన ఆవులే కపిల గోవులుగా అనంతరం ఆయన వాత్సల్యాన్ని పొందాయని ; అందువల్ల , బ్రహ్మ ఓ వృషభాన్ని శివుడికి వాహనంగా ఇచ్చినట్లు చెబుతారు. ఒకప్పుడు శ్మశానంలో ఉండే భూత , పిశాచ గణాలు లోకాల్ని పీడించి భయభ్రాంతం చేస్తుండగా వాటిని అణచివేసిన శివుడు శ్మశాన వాసిగా , భూతగణ సేవితుడిగా స్తుతిపాత్రుడైనట్లు మరో గాథ తెలియజెబుతుంది. రాచకొండ రామా చర్యులు , పూజారి , మయూరిమర్గ్ , బేగుంపేట.చరవాని నంబరు. 9989324294
ANNA ABHISHEKHAM on 28-11-2016 Monday at our Neighbour temple The rice is cooked in the temple premises and then it is carried around the temple. Priests chant mantras and musical instruments like naadaswaram, drum and cymbal are sounded. The cooked rice is then used to cover the Shivling and it is referred as Anna Linga. Various different types of rice preparations like pongal, curd rice, Shakara pongal, tamarind rice, sesame rice, payasam and other sweets from freshly harvested rice are prepared and offered to Lord Shiva on the day. The food is then shared by people and is also given to domesticated animals and birds. yours pujari Rachakonda  Rama Charyulu,Mayurimarg,Begumpet,Hyd.
కార్తీక బహుళ ఏకాదశి : ఉత్పత్తైకాదశి : అఖండమైన పుణ్యం . " ఏకాదస్యాం అహోరాత్రాం కర్తవ్యం భోజనత్రయం". మామూలు నాడు రెండు సార్లు భోజనం చేస్తాం , కానీ ఏకాదశి నాడు భోజనత్రయం అని చెప్పారు అంటే , మూడు సార్లు చేయాలని అర్థం అనుకునేరూ భో-జన-త్రయం అంటే మనుష్యులూ మీరు మూడు పనులు చేయాలి అని అర్థం. ఏమిటవి అంటే ఉపవాసం , హరి గుణ గానం మరియూ జాగరణం. ఈ మూడు కూడా ప్రేమతో చేయాలి. ప్రేమతో మాట్లాడినా పాటే అవుతుంది , ప్రేమతో హరి గుణ గానం చేస్తే ఆకలి వేయదు కడుపు నిండుతుంది దాన్నే ఉపవాసం అని అంటారు , నిరంతరం తలుస్తూ ఉంటే నిద్ర రాదు , దాన్నే జాగరణం అని అంటారు. ఇది ప్రతి ఏకాదశికి నియమమే.
Sri Sudharshana Narasimha Homam at Jhansingh Venkateshwara Swamy temple, Gudi Malkapur market, Mehdipatnam, Hyd on 20-11-2016. 
సుదర్శన చక్రరాజం ప్రతిభట శ్రేణి భీషణ! వరగుణస్తోమ భూషణ! జనిభయస్థాన తారణ! జగదవస్థాన కారణ! నిఖిల దుష్కర్మ కర్శన! నిగమ సద్ధర్మ దర్శన! జయ జయ శ్రీ సుదర్శన! జయజయశ్రీ సుదర్శన!   – శ్రీసుదర్శనాష్టకం శ్రీ మహావిష్ణువుకు పంచాయుధాలు ఉంటాయి.   అవి:   సుదర్శన చక్రం , పాంచజన్య శంఖం , కౌమోదకీ గద , నందా ఖడ్గం , శార్ జ్గ ధనువు ;  కింది శ్లోకం పంచాయుధ స్తోత్రంలో సుదర్శన స్తుత్యాత్మకం. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణో: చక్రం సదాహం శరణం ప్రపద్యే!! సౌరమాసం – కర్కాటాకంలో – చిత్తానక్షత్రాన సుదర్శన చక్రరాజం   అవతరించినట్లు క్రింది తిరునక్షత్ర తనియన్ తెలియజేస్తుంది. కర్కటే చిత్తనక్షత్రే జాతం సవాయ్ధేశ్వరం | విష్ణో: సంకల్ప వృక్షంతం చక్రరాజ మహం భజే !! ప్రపంచ సృష్టిస్థితిలయ కారకుడయిన భగవంతునికి కూడా ఆయుధాలు అవసరమా అనే సందేహం కొందరికి కలుగుతుంది.   యథార్థంగా ఆళ్వార్లు ఈ ఆయుధాలను భగవానుని భూషణాలుగా అభివర్ణించి స్తుతించారు. భగవానుడు జరిపే కార్యాలకు తన చిహ్నాలయిన ఆయుధాలను ఉపయోగిస్తుంటాడు. భగవానుని ఆయుధాలన్నింటిలోనూ చక్రత్తాళ్వార్ శక్తి వంతమైనది