Skip to main content

Posts

Showing posts from October, 2022

నాగుల చవితి 29-10-2022 శనివారం

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి (తేదీ 29-10-2022 )నాడు నాగుల చవితి పండుగను జరుపుకుంటారు.  కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా నాగుల చవితిని చేసుకుంటారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు. ఈ ఏడాది నాగుల చవితిని (Nagula Chaviti 2022)  ఈ పండుగను ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక ప్రాంతంలోనూ జరుపుకుంటారు. నాగదోషం, రాహు-కేతు దోషాలు ఉన్నవారు ఈ రోజున నాగారాధన చేస్తే అవన్నీ తొలగిపోతాయి.  నాగుల చవితి విశిష్టత >> నాగులచవితి రోజున నాగదేవతను ఆరాధించడం వల్ల జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోతాయి. >> ఈ రోజున నాగారాధన చేయడం వల్ల సర్పదోషం తొలగిపోయి.. శుభఫలితాలు కలుగుతాయి. >> మీ జాతకంలో పితృదోషం ఉన్నవారు నాగ పూజ చేయడం మంచిది.  >> ఈ పూజను చేయడం వల్ల మీకు ఎటువంటి సమస్యలున్నా, వ్యాధులన్నా, బాధలున్నా దూరమవుతాయి.  >> ఈ చవితిని జరుపుకోవడం వల్ల సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు. 

ఆకాశ దీపం ఎందుకు పెడతారు ?

  శివకేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీకమాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి 'ఆకాశ దీపం'వెళ్లాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశదీపం పితృదేవతలకు మార్గాన్ని చూపుతుంది. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి ... ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి ఓ కారణం వుంది. ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీకపురాణం చెబుతోంది. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు . శివ కేశవు ల తేజస్సు జగత్తుకు అందిస్తుంది. ఆకాశదీపం మరో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే శివ కేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తభం పై నుండి జగత్తుకు అంతా వెలుతురు ఇస్తుంది, ఇవ్వాలి అని వెలిగిస్తారు. దీపాన్ని వెలిగిస్తూ ''దామోదరమావాహయామి'' అని ''త్రయంబకమావాహయామి'' అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు. ఒక్కో చోట రెండు

కుజ/మంగళ దోషం నివారణ మార్గం -ఏది ఎలా ఎప్పుడు చేయాలి?

మన పురాణాలలో కుజ గ్రహం ను,అంగారకుడు అని,మంగళుడు అనే నామాలు ఉన్నాయి.అలాగే కుజుడు భూమి పుత్రుడు అని కూడా తెలుసు..ఒక సారి కుజుడు తన తల్లి తండ్రుల అనుమతి తీసుకోని వినాయకుడి గురించి తపస్సు చేయడానికి నర్మదా నది తీరంలో ఒక ప్రదేశంను ఎంచుకొని  నిరాహారంగా 1000 సంవత్సరాలు గణపతి గురించి తపస్సు చేసినాడు.అలా 1000 సంవత్సరాలు కుజుడు తపస్సు చేసినా తరువాత మాఘ బహుళ చవితి చంద్రోదయం నాడు వినాయకుడి ప్రతక్ష్యమయ్యాడు.అలా ప్రతక్ష్యమైన వినాయకుడు ఎలా ఉన్నాడు అంటే దశా భుజాలు కలిగి బాలుడి గా ఉన్నాడు.అదే విధంగా వినాయకుడి తలమీద ఒక చంద్ర వంక కూడా ఉన్నదీ.              వినాయకుడు,అంగారకుడు తో ఇలా అన్నాడు." నీ తపస్సుకు మెచ్చితిని నీకు ఏమి వరం కావాలో అని కోరుకొమ్మన్నాడు.అప్పుడు అంగారకుడు ఎంతో సంతోషించి ఆ వినాయకుడిని ఎన్నో విధములుగా స్తుతించాడు.అలా ప్రతక్ష్యమైన వినయకుడ్నిని  అంగారకుడు తనకు " అమృతం" కావాలని,అదే విధంగా నేను ఎప్పడు నీ నామ స్మరణ చేస్తుండాలని అని వరమియమని అంగారకుడు కోరుకొన్నాడు అప్పుడు వినాయకుడు తదాస్తు అని దీవించి ,నీవు ఎర్రని రంగులో ఉన్నావు ఎర్రని వస్త్రం కట్టుకోన్నావు,ఈ దినం మంగళవారం.కనుక ఇక న

దీపావళి పూజ తేదీ 24-10-2022 సోమవారం నాడు పూజ సామగ్రి వివరాలు

 ఉదయం మంగళ హారతులు , సాయంత్రం పూజలు   పసుపు 100 గ్రాములు,  కుంకుం 200 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1,,  బియ్యం 3 కిలోలు,  లక్ష్మి ఫోటో, లక్ష్మి విగ్రహం, రూపాయి బిళ్ళలు ,వెండి బిళ్ళలు, బంగారం బిళ్ళ,  ఆవు నెయ్యి 1/2 కిలో, మట్టి ప్రమిదలు, వత్తులు, అగ్గిపెట్టె,  ఆవు పంచితము, ఆవు పేడ, రంగూలి ముగ్గులు,  మల్లె పూలు, కనకామ్బురాలు, పూల మాలలు, కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొకాటి 5, మిట్టాయిలు  కిలో,  ఆవు పాలు, పెరుగు, తేనె, చక్కర, అన్ని కలిపి ఒక లీటరు  గంగా జలం, రాగి చెంబు, ఇత్తడి చెంబు, తెల్లని వస్త్రము, 1, రవిక గుడ్డలు ౩, కంకణ దారము,  ఎండు  కుడుకలు, ౩, యాలకులు, ఇలాయిచి, లవంగాలు 100 గ్రాములు,  మామిడి కొమ్మలు 2 , తమల పాకులు, 100, నల్లని పోక వక్కలు 50, కజూరం 35 , బాదం పలుకులు 200 గ్రాములు, కాజు, kissmiss , అన్నీ కలిపిన dry fruits, కొబారికాయలు ౩,  ఆచమనం పాత్ర, 1  సెట్  అగర్బతి, సాంబ్రాణి పొగ కడ్డీలు,  ముద్ద కర్పూరం  అమ్మవారికి,చీర, జాకెట్టు, అలంకార సామగ్రి, దువ్వెన, కాటుక, బొట్టు బిళ్ళలు, దువ్వెన,  ప్యాలాలు, ౧/4 కిలో, చిలకలు (రంగుల మిటాయిలు ) రంగుల గురిగీలు, మూతలు.  ఎకౌంటు పుస్తకం,బిల్ పుస్తకం