Skip to main content

Posts

Showing posts from April, 2011

శకున శాస్త్రము

వానరము , గుఱ్ఱము , భల్లూకము , గజము కనబడిన లేక వాటి శబ్దములు వినబడినా శుభసూచకము . వండిన అన్నము , పాలు , మధువు , బేసి సంఖ్యలో జంతువులూ , ప్రక్యాత పురుషులు , బ్రాహ్మణులూ , రత్నములు , తేనె , నెయ్యి , సుగంధ ద్రవ్యాలు , మలయ మారుతము శుభ సూచకాలు . భోజనానికి ముందు , వస్త్రధారణకు ముందు , నిద్రకు ముందు , విధ్యాబ్యాసనికి ముందు , విత్తనములు నాతుటకు ముందు , తుమ్మటం శుభసూచకము . వేణువు నాదం , శంఖ నాదం , గోవుల అమ్భారావము , శుభ సూచకాలు . పృచ్చకుడు ధరించిన వస్త్రాలు తెల్లని రంగులో లేదా కంటికిమ్పయిన రంగులలో ఉన్న అభివ్రిదికి సూచకాలు . అద్దం , తమలపాకులు , పువ్వులు , భంగారం మొదలగు మంగలకరమయిన వస్తువులు తాకుతూ ప్రశ్నించిన శుభ సూచకం .

సుందరాకాండ పారాయణము

ఈ సుందరాకాండ లో లలిత లలిత పద గుమ్భానము లతో పరమ సుందరముగా నుండును. కావున ఈ కాండము సుందరాకాండము. సీత జగదేక సుందరి, రాముడు సుందరుడు,హనుమంతుడు సుందరుడు, లంకానగరము సుందరమూ, అశోక వనము సుందరమూ, వాల్మీకి కవిత్వము సుందరమూ కావున ఇవన్నియు కలిపి సుందరకాండ అయినాది.