Skip to main content

నాగుల చవితి 29-10-2022 శనివారం

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి (తేదీ 29-10-2022 )నాడు నాగుల చవితి పండుగను జరుపుకుంటారు.  కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా నాగుల చవితిని చేసుకుంటారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు. ఈ ఏడాది నాగుల చవితిని (Nagula Chaviti 2022)  ఈ పండుగను ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక ప్రాంతంలోనూ జరుపుకుంటారు. నాగదోషం, రాహు-కేతు దోషాలు ఉన్నవారు ఈ రోజున నాగారాధన చేస్తే అవన్నీ తొలగిపోతాయి. 

నాగుల చవితి విశిష్టత
>> నాగులచవితి రోజున నాగదేవతను ఆరాధించడం వల్ల జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోతాయి.
>> ఈ రోజున నాగారాధన చేయడం వల్ల సర్పదోషం తొలగిపోయి.. శుభఫలితాలు కలుగుతాయి.
>> మీ జాతకంలో పితృదోషం ఉన్నవారు నాగ పూజ చేయడం మంచిది. 
>> ఈ పూజను చేయడం వల్ల మీకు ఎటువంటి సమస్యలున్నా, వ్యాధులన్నా, బాధలున్నా దూరమవుతాయి. 
>> ఈ చవితిని జరుపుకోవడం వల్ల సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు. 

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-