కపిల గోవు గురించి.
శివుడి వాహనం వృషభం. ఒకమారు ఆయన
హిమాలయాల్లో ధ్యానంలో ఉన్నప్పుడు, సమీపంలోని ఓ తల్లి ఆవు పొదుగు నుంచి
లేగదూడ పాలు తాగుతుంటుంది. గాలి ధాటికి ఆ పాల నురగ ఆయనపై పడి, ధ్యానం
భంగమవుతుంది. కళ్లు తెరిచి చూసిన ఆయన దృష్టి ఫలితంగా, ఆవులు
నల్లగా మారి భయంతో పరుగులు తీస్తాయి. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై- ఆవుపాలకు ఎంగిలి
ఉండదని శివుణ్ని శాంతపరుస్తాడు. అలా నల్లగా మారిన ఆవులే కపిల గోవులుగా అనంతరం ఆయన
వాత్సల్యాన్ని పొందాయని; అందువల్ల, బ్రహ్మ ఓ వృషభాన్ని శివుడికి వాహనంగా
ఇచ్చినట్లు చెబుతారు.
ఒకప్పుడు శ్మశానంలో ఉండే భూత, పిశాచ
గణాలు లోకాల్ని పీడించి భయభ్రాంతం చేస్తుండగా వాటిని అణచివేసిన శివుడు శ్మశాన
వాసిగా, భూతగణ సేవితుడిగా స్తుతిపాత్రుడైనట్లు మరో గాథ
తెలియజెబుతుంది.
రాచకొండ రామా చర్యులు, పూజారి,మయూరిమర్గ్, బేగుంపేట.చరవాని నంబరు. 9989324294
Comments
Post a Comment