మనవాళ మహాముని తిరునక్షత్రం తేది 4-11-2016 శుక్రవారం
మామునిగళ్ తిరునక్షత్ర మహోత్సవమును ఆళ్వార్ తిరునగరి, శ్రీరంగము, కాంచీపురమ్, శ్రీవిల్లిపుత్తూర్, తిరువహింద్రపురము, వానమామలై, తిరునారయణపురము మొదలగు చాలా దివ్యదేశములలో గొప్పగా చేస్తారు. మనమూ కూడా శ్రీ రంగనాతనులకు ప్రియమైన ఆచార్యులు మరియు మనకునూ ఆచార్యులైన వీరి ఉత్సవములో శుద్దమైన మనసుతో సేవించుదాము.
శ్రీశైలేశ దయా పాత్రమ్ ధీభక్త్యాది గుణార్ణవమ్
యతీన్ద్ర ప్రవణమ్ వన్దే రమ్య జామాతరమ్ మునిమ్
తాత్పర్యము: శ్రీశైలాంశ సంభూతులై ‘తిరుమలై ఆళ్వార్’ అని ప్రసిద్దిచెందిన ‘తిరువాయ్ మొజి పిళ్ళై’ అను శ్రీశైలనాధుల దివ్య నిర్మల కరుణాపూరమునకు ఉత్తమ పాత్రభూతులును, ఙ్ఞాన భక్తి వైరాగ్యాది పరమ కల్యాణ గుణ గణ పరిపూర్ణులగు శ్రీ భగవత్ రామానుజ సంయమింద్రుల దివ్యమంగళచరణ పంకేరుహములందు అత్యన్త ప్రవణులై, తదేకాన్తికాత్యన్తిక పరభక్తి యోగ నిష్ఠులై, ఏకలవ్యునివలె వారికి అనన్యార్హ శిశ్యభూతులైయుండు శ్రీ అజగియ మణవాళమహామునులకు సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందును త్రికరణశుద్దిగా నమస్కరించుచు సేవించుచున్నాను.

Comments
Post a Comment