Skip to main content
పిళ్ళై లోకాచార్య స్వామి (తిరు నక్షత్రం 7-11-2016 సోమవారం) శ్రీకృష్ణ పాదులు అనే వారి కుమారుడు. వారు ఎంచేసారు అంటే, మన లాంటి సామాన్యులు తెలియక ఒక పాము నోట్లో పడ్డాం. ఎట్లాంటి పాము అది అంటే అది కనిపించక మనల్ని మింగేస్తుంది. మన జన్మలని ఘోరంగా హింసించే సర్పం ఒకటి ఉంది, ఆ సర్పానికి పేరు సంసారం అని పేరు. సంసారం అంటే కుటుంబం అని అనుకుంటాం, కానీ అది కాదు అర్థం. మన చుట్టూ ఉండే వాటియందు ఉండే పట్టును సంసారం అని అంటారు. మనలో ఉండే అహంకారమే దీనికి కారణం. అహంకారం అంటే మనది కానిదాన్ని మనది అనిపించే తెలివి తక్కువతనం. శరీరమే నేను అనిపిస్తుంది, కానీ శరీరం లోన ఉన్న ఆత్మను గుర్తించకపోవడమే అహంకారం లేక సంసారం అని అంటారు. కొన్ని యజ్ఞాలలో యజ్ఞం పూర్తి అయ్యాక పూర్ణాహుతితో పాటు యజ్ఞశాలనే ఆహుతిచేస్తారు. అట్లా శరీరం అనే వ్యవస్థ భగవంతుడు ఏర్పరిచిన యజ్ఞం. అట్లా అత్మలేని శరీరాన్నీ మనం అట్టే పెట్టుకోం. మనం ఈ శరీరాన్నే సర్వం అని దానిపైనే మమత పెంచుకుంటున్నాం. శరీరాన్ని కేవలం తినడం, పెరగడంలాంటి వాటికే ఉపయోగించుకుంటున్నాం. కానీ దాన్ని వాటికే పరిమితం చేయక మరొక మంచి ఉద్దేశ్యానికి వాడాలి అనేదిమరచిపోతున్నాం. కేవలం శరీర పోషణ మాత్రమే ప్రధానం కాదు. ఇట్లా శరీరానికి సంభందించిన వారిపైనే మనం మమత పెంచుకోవడం అనేది పెరిగిపోతుంది. దీనికే సంసారం అని పేరు. ఈ అహం కాని దాన్ని అహం అని అనుకోవడమే అహంకారం. జ్ఞానం లేని ప్రాపంచిక విషయాలని పట్టుకొని జ్ఞానం కల జీవులని, పరమాత్మని వదిలి ఉన్నాం. సంస్కృతంలో కొన్ని శబ్దాల నుండి పదాలు ఏర్పడుతాయి. జారడాన్ని 'సర్' అనే శబ్ద అనుకరణ చేస్తారు. మనకు తెలియక జారడాన్ని 'సర్' అని అంటారు కనక సంసారం అని పేరు వచ్చింది. సంసారం నుండి బయట పడడం అంటే మన బందువులని, భాధ్యతలని వదలడం అని అర్థం కాదు. మన చుట్టూ ఉండేవి ఏవీ చెడ్డవి కాదు. వాటి యందు ఏర్పరుచుకున్న పట్టుని సంసారం అని అంటారు.

ఈ సంసారం అనే వ్యాధి పై నుండి వచ్చినది కాదు, లోపలి ఉండి వచ్చినది. కనుక దానికి మందు లోపలి నుండే వేయాలి. ఆలోపం జ్ఞానంలో ఏర్పడుతుంది కనుక జ్ఞానం ద్వారానే మందు వేయాలి. అంటే ఉపదేశం ద్వారానే జ్ఞానాన్ని పూరించాలి. అట్లా మన స్వరూపం ఏంటో మనకు తెలిస్తే క్రమంగా మనలో ఏర్పడ్డ దుష్పరిణామాలు తొలగుతాయి. పిళ్ళై లోకాచార్య స్వామి అట్లాంటి సంసారం అనే సర్పంచే కాటు వేయబడ్డ మనలాంటి వారికి ఒక జీవాతువుని ప్రసాదించారు. జీవాతువు అంటే ప్రాణం నిలిపే ఔషదం అని పేరు. అట్లా వారు చేసారని వారిని స్మరించుకొనే శ్లోకం ఇది.

లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే |
సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః ||

సంసారం అనే సర్పంచే కరవబడ్డ జీవుడికి జీవౌషదాన్ని ఇచ్చిన మహనీయులు. ఆయన పేరు లోకాచార్యులు. అజ్ఞానాన్ని తొలగించినవారు కనక వారిని గురువు అని వ్యవహరిస్తాం.

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-