క్షీరాబ్ధి
ద్వాదశి! Saturday (12-11-2016)తులసి మొక్కకు, ఉసిరి చెట్టుకు ప్రాధాన్యాన్ని ఆపాదించే పండుగ ఇది.
కార్తిక శుద్ధ
ఏకాదశిని ‘ఉత్థాన ఏకాదశి’ లేదా ‘ప్రబోధన ఏకాదశి’గా వ్యవహరిస్తారు. ఆరోజు మహావిష్ణువు పాలకడలి నుంచి
బయలుదేరి బ్రహ్మాది దేవతలను, శ్రీమహాలక్ష్మిని
వెంటపెట్టుకుని ద్వాదశి పూట తులసి బృందావనంలోకి ప్రవేశిస్తాడని పురాణ వచనం.
తులసిని లక్ష్మీదేవి అంశగా భావిస్తారు. తులసి మొక్కల్లో తెల్లంచు రెమ్మ
కలిగినదాన్ని లక్ష్మీ తులసిగా, నల్లదాన్ని కృష్ణ తులసిగా, నీలి రంగులో ఉంటే రామ తులసిగా పిలుస్తారు. కార్తిక శుద్ధ
ద్వాదశినాడు క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం ఆచరిస్తారు. దీన్నే ‘క్షీరాబ్ధి శయన వ్రతం’
అంటారు. ఈ వ్రత
కల్పంలో ‘తులసీ సహిత ధాత్రీ
లక్ష్మీనారాయణ’స్వామిని పూజించే విధానం
కనిపిస్తుంది. ధాత్రి అంటే, ఉసిరిక. క్షీరాబ్ధి
ద్వాదశినాడు కాయలతో కూడిన ఉసిరి కొమ్మను తులసి కోటలో పాతి, పూజాదికాలు నిర్వహించడం
ఒక ఆచారం. మన వ్రత గ్రంథాల
అంతరార్థాలు గ్రహించినవారి మనసే- క్షీర అబ్ధి! లేనివారిది కల్లోల కడలి. మన
మనసుల్ని పాలసముద్రాలుగా మలచుకోవడం కోసమే ఈ కథలన్నీ!
Comments
Post a Comment