ఈ రోజు ఉత్థాన ఏకాదశి 11-11-2016 గురు వారం . ఇంద్రియాలకు అధిపతి అయిన మనస్సుపై పదకొండోరోజు ప్రభావం చూపిస్తాడు. పదకొండునే ఏకాదశం అని అంటారు. పన్నెండో నాడు ద్వాదశి, ఆనాడు మనస్సుకు వెనకాతల ఉండి నిర్ణయాన్ని స్థిరపరిచే బుద్ధి మీద ప్రభావం చూపిస్తాడు. మనస్సుకి వెనకాతల ఉన్న బుద్ధికి భలం బాగుంటే మంచి నిర్ణయాలు జరుగుతాయి. బుద్ధి అంత బాగా లేకుంటే నిర్ణయాలు చెడిపోతాయి. అంటే ఈ రెంటిని ఎట్లా వాడుకోవాలో తెలుపడానికి పద్దతిని సూచించారు, అవే ఏకాదశి-ద్వాదశి.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment