వరుథిని ఏకాదశి రోజున చేయాల్సిన దానాలు ఏమిటంటే..
అన్న వితరణ: వరుథిని ఏకాదశి నాడు అన్నదానం చేయడం వల్ల మానవులు, దేవతలు, పూర్వీకులు మొదలైన వారంతా సంతృప్తి చెందుతారు. వరుథిని ఏకాదశి రోజున అన్నదానం చేయడం వల్ల చాలా ఫలం లభిస్తుంది. అన్నపూర్ణ దేవి ఈ రోజున అన్నదానం చేయడం ద్వారా సంతోషిస్తుంది.దీని వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు నెలవుగా ఉంటుంది. అలాగే, మీ ఇంట్లో సుఖ శాంతులు ఉంటాయి.
దాహార్తిని తీర్చడం: వరుథిని ఏకాదశి నాడు నీటితో నింపిన మట్టి కుండను దానం చేయడం ఉత్తమమైనదిగా భావిస్తారు. ఈ రోజున బాటసారులకు నీరు ఇచ్చినా శుభఫలితాలు లభిస్తాయి. పిల్లలు దీర్ఘాయుష్షు పొందుతారని, వారికి ఎలాంటి సమస్యలు ఉండవని నమ్మకం.
నువ్వుల దానం: హిందూ మత విశ్వాసం ప్రకారం నువ్వులు శ్రీ హరి నుండి ఉద్భవించాయి. ఏకాదశి రోజున నల్ల నువ్వులను నీటిలో వదలడం వల్ల శ్రీ హరి, శనిస్వరుడు ఎంతో సంతోషిస్తారని చెబుతారు. అదే సమయంలో ఈ రోజున నువ్వులతో చేసిన స్వీట్లను దానం చేయడం వల్ల పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది.
సత్తు పిండి దానం: సత్తు అంటే వేయించిన శనగల పొడ.. చైత్ర, వైశాఖ మాసంలో వేసవికాలం ఉచ్ఛస్థితిలో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వరుథిని ఏకాదశి నాడు సత్తు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనివల్ల ధనలాభం చేకూరుతుందని, అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు.
Comments
Post a Comment