నాడి కూటమి, తక్కిన కూటాలకు తల మీద మని వంటిది. బ్రహ్మ దీనిని కన్యకా మేడలోని మంగళ సూత్రములా ఏర్పరచినాడు. ఆది నాడి వదూవరులకు ఏక నాడి అయితే వియోఘము, మధ్యమ నాడి ఏకానాది అయితే ఇరువురికి నాశము, అంత్యనాడి ఏకానాది అయితే వాయిదవ్యం. నాడి కూటం సరిగా లేకుంటే మిగిలిన ఏడు కూటాలు గుణాలను కూడా నాశనము చేస్తుంది. నాడి వేద ఉన్నపుడు చరన వేద తప్పక విడిచి పెట్ట్టాలి. ౧ వ పాదముతో ౪ వ పాదం, ౪వ పాదముతో ౧ వ పాదం, ౨ వ పాదముతో ౩ వ పాదం, ౩ వ పాదముతో ౨ వ పాదం వేద ఏర్పడుతుంది. తప్పని సరి అయితే నాడి దోష పరిహారానికి మృత్యుంజయ మంత్ర జపం, సువర్ణ దానం, జపానికి స్వర్ణ దక్షిణ ఇవ్వాలి.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment