పసుపు ౨5౦ గ్రాములు, కుంకుమ ౧౦౦ గ్రాములు , శ్రీ గంధం,1 బియ్యము ౫ కిలోలు , తమల పాకులు ౧౦౦ , వక్కలు ౩౫ , ఖర్జూరము ౩౫ , పండ్లు అయిదు రకాలు , పూలు, పూలదండలు, మామిడి తోరణములు, అరటి కొమ్మలు ౪, పసుపు కొమ్ములు ౧౫ , ఆవు పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, చక్కర, కొబ్బరి కాయలు ౧౫,రాచ మరియు బూడిద గుమ్మడి కాయలు ౨, పుస్తెలు, మట్టెలు, ఆవు నెయ్యి, కొత్త గిన్నెలు ౨, సమిధలు, హోమము పూడ, పూర్ణాహుతి వస్తువులు, ఆవాలు, మినపప్పు, నవధాన్యాలు,each grain 1250 grams seperately ధోవతి, పంచలు, చీర, జాకెట్టు బట్టలు, ఆవు మూత్రము, లక్ష్మి నారాయణ ఫోటో, జీలకర్ర బెల్లము, తలంబ్రాల బియ్యము, బాశికాలు ౨, మంగళ హారతి, మంగళవాయిద్యము, ముగ్గు పిండి, హోమము మండపం, గోధుమ రవ్వ ప్రసాదము కిలో మీద పావు కిలో ,కాజు, కిస్స్మిస్స్,ధ్రఖష, సారపలుకులు.అయ్యగారి దక్షిణ ,6౦౦౦ రూపాయలు.
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment