ఎల్లప్పుడూ ఉదయము స్నానము చేయాలే. మూడు పూటలు స్నానము చేయాలే. భోగములను వదిలి జితేంద్రియుడి మూడు పూటలు విష్ణువు ను పూజించాలే. ఈ మాసమునందు స్నానం చేసినచో కోరిన ఫలములు పొందుతారు. అన్ని అవయములు దృడముగా ఉండగా వేడి నేటి స్నానము చేయరాదు. పితరులకు, దేవతలకు ముల్లంగి ఇవ్వరాదు. బ్రాహ్మణుడు మొలకాన్ని తింటే నరకానికి పోతాడు. ప్రతి రోజు సూర్యునికి అర్గ్యము ఇవ్వలే.మాఘమాసము రాగానే సూర్యోదయము కాగానే జలము లన్నే శబ్దిస్తాయి. త్రివిధములయిన సర్వ పాపములను పోగొట్టి పవిత్రులను చేస్తాయి. ప్రతి రోజు చక్కరతో కూడిన నువ్వులను దానము చెయ్యాలే. అలాగే తిలల స్నానం, తిలలు వంటికి రాచుకోవడం, తిల హోమం,తిల తర్పణం, తిల భోజనం, తిల దానం,ఈ ఆరు రకాల తిలలు పాప నాశనకములు. వస్త్ర భుశానములతో అలంకరించి బ్రాహ్మణా దంపతులను భుజింప చేయాలే. కంబళము, జింక చర్మము, రత్నములు, వివిధ వస్త్రములు, రవికలు ఇవ్వాలే. శక్తి కొలది అన్న దానము చేయాలే. వేద విద్వాంసులకు బంగారము ఇవ్వాలే. ముప్పది నువ్వు లడ్డులు ఇవ్వాలే. దేవాలయములో నువ్వుల దేపములు పెట్టాలే
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment