Skip to main content

మాఘ మాసం అమావాస్య నాడు చెయ్య గూడని పనులు

మాఘ మాసంలో వచ్చే అమావాస్య మార్చి 10వ తేదీ ఆదివారం వచ్చింది. ఈరోజు కొన్ని పనులు చేయడం అశుభంగా పరిగణిస్తారు. ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం.

మరుసటి రోజు నుంచి మాఘ మాసం పూర్తయి ఫాల్గుణ మాసం ప్రారంభం అవుతుంది. హిందూ మతంలో అమావాస్య రోజు పవిత్ర నదిలో స్నానం ఆచరించడం, దాన ధర్మాలు చేయడం వంటి వాటికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈరోజు కొన్ని పనులు చేయడం వల్ల అనేక దోషాలు నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు

కొన్ని నమ్మకాల ప్రకారం అమావాస్య రోజున నిర్జన ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం మానుకోవాలి. అటువంటి ప్రదేశాలలో ఈరోజును ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. ఒంటరిగా వెళ్ళినప్పుడు ప్రతికూల శక్తులు మీపై ఆధిపత్యం చెలాయిస్తాయి. అందువల్ల ఈ సమయంలో ఒంటరిగా వెళ్లడం కరెక్ట్ కాదంటారు.

బయట భోజనం చేయకూడదు

మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ఎవరైనా తమ ఇంట్లోనే ఆహారాన్ని తినాలి. వేరొకరి ఇంట్లో భోజనం చేయడం వల్ల పుణ్యఫలాలు నశిస్తాయని నమ్మకం.

శుభకార్యాలు చేయకూడదు

కొన్ని నమ్మకాల ప్రకారం అమావాస్య రోజు కోపం తెచ్చుకోవడం, ఇతరులతో వాదించడం, పోట్లాడటం మానుకోవాలి. కొత్త బట్టలు కొనుగోలు చేయడం, ధరించడం వంటివి కూడా చేయకూడదు. ఎటువంటి శుభకార్యాలు నిర్వహించడానికి ఇది మంచి రోజు కాదు.

ఆర్థిక లావాదేవీలు వద్దు

కొందరి నమ్మకాల ప్రకారం అమావాస్య రోజు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయరు. ఇలా చేయడం వల్ల ధన నష్టం, ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉందని నమ్ముతారు.

గోళ్ళు, జుట్టు కత్తిరించకూడదు

అమావాస్య సమయంలో ప్రజల తమ గోళ్లు లేదా జుట్టును కత్తిరించకూడదు ఎందుకంటే పితృదోషం వల్ల వచ్చే భయంకరమైన దుష్ప్రభావాలకు గురవుతారు. జుట్టుని కడగకూడదని కూడా సలహా ఇస్తారు. ఇలా చేయడం వల్ల జాతకంలో అనేక సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు.

మద్యం, మాంసం ముట్టుకోరు

అమావాస్య సందర్భంగా మద్యం సేవించడం మాంసం తినడం అశుభం. నాన్ వెజ్ తినడం వల్ల మీ కుండలిపై ప్రతికూల ప్రభావం పెరుగుతుందని చెప్తారు. అది మాత్రమే కాకుండా శని గ్రహం వల్ల కలిగే బాధలు పెరుగుతాయి.

చీపురు కొనకూడదు

అమావాస్య రోజు పితృ దేవతలకు అంకితం చేసిన రోజుగా పరిగణిస్తారు. ఈరోజు శనిదేవుని ప్రత్యేకంగా పూజిస్తారు. శాస్త్రాల ప్రకారం చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది. అమావాస్య రోజున చీపురు కొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభించదు. డబ్బు సమస్యలు తలెత్తుతాయి. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.

తలకి నూనె రాయకూడదు

అమావాస్య సమయంలో తలకి నూనె రాసుకోకూడదు. ఈ రోజున నూనె దానం చేస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే నూనె శని దేవుడితో ముడిపడి ఉంటుంది. కుండలి నుండి శని దోషాలు తొలగించడంలో ఈ పరిహారం సహాయపడుతుంది.

పితృ దోషం తొలగించే పరిహారాలు

అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల పితృ దోషం, కాల సర్ప దోషం నుంచి విముక్తి పొందవచ్చు. శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. పితృ స్తోత్రం, పితృ కవచం పఠించాలి. బ్రాహ్మణులకు అన్నదానం చేయడం వల్ల పితృ దేవతలు సంతోషిస్తారు.

Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.