హిందూపురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు అవతారాల్లో వామన అవతారం ఒకటి. ఈ రోజు శ్రీహరి ని ఆరాధిస్తారు. దీని ప్రాముఖ్యత, పూజా విధానం గురించి తెలుసుకుందాం.
ఓం వo వామనాయ నమః మంత్రం 108 సార్లు మనసులో అనుకోవాలి.
వామనుడు జన్మ వృత్తాంతం
కశ్యపుడు, అదితికి జన్మించినవాడు వామనుడు. దేవాసుర యుద్ధంలో ఇంద్రుడు చేతిలో ఓడిపోతాడు బలి చక్రవర్తి. రాక్షసులు గురువైన శుక్రాచార్యుడు ఉపదేశంతో విశ్వజిత్ యాగం చేసి బంగారు రథాన్ని, శక్తివంతమైన ధనస్సు, అక్షీయ తూణీరాలు పొంది.. రాక్షసుల అందరినీ కూడగట్టుకుని దేవేంద్రుడిపైకి యుద్ధానికి వెళతాడు. బృహస్పతి సూచనలు మేరకు దేవతలు అమరావతిని వీడి పారిపోతారు. బలిచక్రవర్తి గర్వమును అణచడానికై శ్రీహరి అదితి గర్భమున జన్మిస్తాడు. బలి చక్రవర్తి దానశీలి. అతడి దగ్గరికి వెళ్లి మూడు అడుగుల నేలను అడుగుతాడు వామనుడు. సరే అంటాడు బలి. వామనుడు త్రివిక్రముడై మెుత్తం జగత్తునంతా రెండు అడుగులతో, మిగిలిన ఒక అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కి.. అతడిని దానికి రాజును చేస్తాడు. ఆ రాజ్యానికి స్వయంగా శ్రీహరే కాపలాగా ఉంటాడు.
వామన ద్వాదశి రోజున ఏం చేయాలి?
>> వామనుని అనుగ్రహం పొందడానికి వామన ద్వాదశి రోజున కంచు పాత్రలో నెయ్యి దీపం వెలిగించండి. దీంతో మీ ఇంటి కష్టాలు తొలగిపోతాయి.
>> మీ వ్యాపారం వృద్ధి చెందాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా కొబ్బరికాయపై యాగ్యోపవీతం చుట్టి వామనుడికి సమర్పించండి. మీ పనిలో ఏవైనా ఆటంకాలు ఉంటే ఇది తొలగిస్తుంది.
>> వామన ద్వాదశి పూజానంతరం అన్నం పెరుగు దానం చేయడం శుభప్రదం. ఇది ఇంట్లోకి అపారమైన సంపదను తీసుకువస్తుంది.
>> వామన ద్వాదశి రోజున వామనుని విగ్రహాన్ని పూజించటం వల్ల శారీరక, మానసిక బాధల నుంచి విముక్తి లభిస్తుంది.
>> వామనుడిని పూజించేటప్పుడు నైవేద్యంగా 52 లడ్డూలను పెట్టాలి. అందరికీ దక్షిణ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వామనుని అనుగ్రహం లభిస్తుంది. పూజానంతరం బ్రాహ్మణుడికి దానం చేయండి. దీంతో మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
Comments
Post a Comment