ఈ నెల 23 ఆదివారం నాడు రుషి పంచమి.. స్త్రీ దోషాలకు పరిహారంగా జరుపుకునే ఈ వ్రతాన్ని 'భాద్రపద మాసం'లో 'శుక్ల పక్ష పంచమి' రోజున ఆచరించాలి. గణపతిని పూజించి గంగా యమున కృష్ణ తుంగభద్ర తదితర నదుల నామాలనుమహర్షుల నామాలను స్మరించుకోవాలి. సప్తరుషులను అరుంధతిని పూజించాలి. ఆ తరువాత కథ చెప్పుకుని వాయనదానాలు ఇవ్వాలి. ఇలా 7 సంవత్సరాల పాటు క్రమం తప్పక ఈ వ్రతాన్ని చేసుకుని ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవాలి. రామాచార్యులు, పూజారి మరియు జ్యోతిష్యులు, శ్రీ రామలింగేశ్వర స్వామి దీవాలయం, మయురిమార్గ్,బేగంపేట్, హైదరాబాద్.
Comments
Post a Comment