భాద్రపద శుక్ల సప్తమి 25-8-2020 మంగళ వారం నాడు ముక్తాభరణ వ్రతం ఆచరించాలి. దీనిని ముక్తాభరణ సప్తమిగా కూడా వ్యవహరిస్తారు. ఈనాడు ముత్యాలతో ఆభరణములు చేసుకొని శక్తి కలవారు ముత్యములతో లక్ష్మీనారాయణుల ప్రతిమలను తయారుచేసి ఆవు పాలతో అభిషేకం నిర్వహించి షోడశోపచార పూజ చేయాలి. అనంతరం ఆ ప్రతిమలకు ముత్యాలతో కూడిన దుస్తులతో మరియు ముత్యాల ఆభరణాలతో అలకరింపచేసి సప్త ఋషులను పూజించి విశేషించి సూర్య భగవానుని ఆరాధించవలెను. ఏడుగురు బ్రాహ్మణులకు శక్తి కొలదీ ముత్యములు, ఆభరణాలు ఇచ్చి వారికి భోజనము మరియు దక్షిణతాంబూలాలు సమర్పించి వారి అనుమతితో ముత్యాల ఆభరణాలు ధరించి దేవాలయానికి వెళ్లవలెను. స్వామిని దర్శించి ప్రదక్షిణ చేసి నైవేధ్యం తీసుకుని శక్తిఉన్నవారు రాత్రి జాగరణ చేసి సూర్యోదయంతో ఈ వ్రతమును పూర్తి చేయవలెను.
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment