జేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు నిర్జల ఏకాదశిగా చెబుతారు. 2023 వ సంవత్సరంలో మే 31వ తేదీన నిర్జల ఏకాదశి వస్తుంది. నిర్జల ఏకాదశి తిథి మే 30 వ తేదీన మధ్యాహ్నం 1:32 నిమిషాలకు ప్రారంభమై, మే 31వ తేదీ మధ్యాహ్నం 01:36 నిమిషాలకు ముగిస్తుంది.
ఈరోజు (మే 31) ఎవరైతే విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని నిష్ఠగా పూజిస్తారో వారికి సకల సౌఖ్యాలు ప్రాప్తిస్తాయని చెబుతారు. ఈరోజు భూ, కనక, వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తే అన్ని విషయాలలోనూ కలిసివస్తుందని, కొనుగోలు చేసిన దాని విలువ రెట్టింపు అవుతుందని చెబుతారు. నిర్జల ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి విష్ణువుని పూజించాలి. విష్ణు పూజలో తులసిని తప్పనిసరిగా పెట్టాలి.
రావి చెట్టును పూజిస్తే...
అంతేకాదు ఏకాదశి నాడు రావి చెట్టును పూజించడం వల్ల కూడా లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. రావి చెట్టుకు పాలు కలిపిన నీళ్లను, ధూప, దీపాలను సమర్పించడం వల్ల సంపద పెరుగుతుంది. నిర్జల ఏకాదశి నాడు జల దానం చేసినా, అన్న దానం చేసిన లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అంతేకాదు కుండను దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
అష్టాక్షరి మంత్రం "ఓం నమో భగవతే వాసుదేవాయ" అని జపించాలి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారని, ఆర్థిక సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం.
Comments
Post a Comment