తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. "ఉగాది పచ్చడి" ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం.జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి ఇచ్చే సందేశం. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతిగా నిలుస్తాయి. ఈ పచ్చడిలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందని తెలుపుతోంది.
శ్లోకం: శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం
ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడిని తీసుకోవాలి
ఉగాది పర్వదినం రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. శ్రీ మహావిష్ణువు అయిన కాల పురుషుడిని గౌరవించేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు.
Comments
Post a Comment