శ్రీ హనుమాన్ విజయోత్సవం విశిష్టత ఏమిటి శ్రీరామునికి అత్యంత నమ్మకమైన బంటు హనుమంతుడు. శ్రీరాముడు సీతను ఎడబాసి మానసిక క్షోభను అనుభవిస్తూ, సీత జాడ వెతుకుతున్న సందర్భ సమయంలో అడవిలో రాముడుకి హనుమంతునితో పరిచయం ఏర్పడినది. పరిచయం ఏర్పడిన నాటి నుండి శ్రీరామచంద్రున్ని హనుమంతుడు విడిచి ఉండలేదు, రాముడే తన సర్వస్వంగా భావించిన వాయునందనుడు తన ప్రభువైన రాముని మాట ఏనాడు జవదాటలేదు.
చివరికి రాముడు రావణునితో యుద్ధం చేసి సీతను తీసుకుని అయోధ్యకు వచ్చి శ్రీ రామ పట్టాభిషేకం అయిన తర్వాత రామునికి అనిపిస్తుంది నేను హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీత తిరిగి వచ్చినది, తిరిగి అయోధ్య నగరంలో రాముని పట్టభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉండడం గ్రహించిన రాముడు నాకు అన్ని వేళల హనుమంతుడు సహాయంగా ఉన్నాడు అని తన విజయం హనుమంతుని సహకారం ఎంతగానో తోడ్పడినది అని రాముడు చైత్ర పౌర్ణమి రోజు హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు. నాటి నుండి ఆ రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకుని తమ రాజైన రాముడు ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజు సన్మానం చేసాడో ప్రతి సంవత్సరం చైత్రపౌర్ణ మి రోజు శ్రీ హనుమత్ విజయోత్సవంగా నాటి నుండి నేటి వరకు ఘనంగా వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment