పాపమోచని ఏకాదశి చాలా ప్రభావవంతమైనదని పండితులు చెబుతుంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటూ.. శ్రీ మహా విష్ణువు ఆరాధిస్తే మీ పాపాలన్నీ తొలగిపోతాయని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడని నమ్ముతారు. ఈ రోజున నిజమైన మనసుతో ఉపవాసం ఉండటంతో పాటు విష్ణువును పూర్తి ఆచారాలతో ఆరాధించడం ద్వారా, మోక్షాన్ని పొందుతారు.
పాపమోచని వ్రత కథ:
ఒక అడవిలో ఓ రుషి పరమేశ్వరుడి కోసం తపస్సు ప్రారంభిస్తాడు. తపస్సులో మునిగిపోయిన ఆ రుషిని అప్సరస లాంటి ఓ యువతి భంగం కలిగిస్తుంది. కళ్లు తెరిచి చూసే సరికి అందాల కుందనపు బొమ్మలా ఉన్న ఆ యువతిని చూసి ఆ రుషి మనసు చలించిపోతుంది. తనను మోహిస్తాడు. తనతో ప్రేమలో పడతాడు.
అలా కొన్ని సంవత్సరాల పాటు రతీ క్రీడల్లో మునిగిపోతాడు ఆ రుషి. కొంత కాలం తర్వాత ఒకానొక రోజు ఆ యువతి తన గురించి చెబుతూ తనను ఇంద్రుడు పంపించాడని, అనుమతిస్తే తిరిగి స్వర్గలోకానికి వెళ్లిపోతానని వేడుకుంటుంది.
తన మాటలు విన్న ఆ రుషి కోపోద్రిక్తుడు అవుతాడు. ఆ యువతి వల్లే తన తపస్సు చెడిపోయిందని ఆవేశంలో యువతిని శపిస్తాడు. ఏ అందంతో తన దృష్టి మరల్చిందో ఆ అందం పోయి పిశాచిలా మారిపోవాలి శపిస్తాడు.
అప్పుడు ఆ యువతి రుషి కాళ్లపై పడి తనను క్షమించమని వేడుకుంటుంది. తన పాపాన్ని తొలగించమని కోరుతుంది. అప్పుడు ఆ రుషి పాపమోచన ఏకాదశి రోజు విష్ణు ఆరాధన చేసి ఉపవాసం ఉండాలని, అలా చేస్తే పాపం తొలగిపోతుందని చెబుతాడు.
Comments
Post a Comment