గతంలో బాత్‌రూమ్ లేదా టాయిలెట్ అంటే అది ఇంటికి దూరంగా ఉండాల్సిందిగా అందరూ భావించేవారు. అయితే పాశ్చాత్య ప్రభావం కావచ్చు.. సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకోవడం కావచ్చు నేటికాలంలో బాత్‌రూమ్ అన్నది ఇంట్లోనే భాగమైంది. అంతేకాదు అటాచ్డ్ పేరుతో నేడు బాత్‌రూమ్ అన్నది ప్రతిగదిలోనూ వెలుస్తోంది.
అయితే వాస్తు ప్రకారం అటాచ్డ్ బాత్‌రూమ్‌లను ఎలా నిర్మించాలి. అసలు అటాచ్డ్ బాత్‌రూమ్‌ల గురించి వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గృహం నిర్మాణంలో వాస్తుశాస్త్రం చాలా ముఖ్యమైంది. ప్రస్తుత కాలంలో బాత్‌రూమ్ సైతం గృహంలోనే భాగమైనందున దాని నిర్మాణానికి సంబంధించి కూడా వాస్తు కొన్ని సలహాలు, సూచనలు అందిస్తోంది.
గృహనిర్మాణం సమయంలో పడకగదిని నైరుతి మూలలో నిర్మించడం మంచిది. అలా నిర్మిస్తేనే గృహంలోనే వారికి శుభం కల్గుతుంది. అయితే ఈ పడకగదికి అటాచ్డ్ బాత్‌రూమ్ నిర్మించాల్సి వచ్చినప్పుడు తూర్పు వైపుగా దక్షిణపు గోడను ఆనుకుని ఉండే విధంగా బాత్‌రూమ్ నిర్మించాలి. ఇలా నిర్మించిన బాత్‌రూమ్‌లోని దక్షిణగోడకు వెంటిలేటర్ నిర్మించాలి. అలాగే ఈ బాత్‌రూమ్‌కు వాయువ్యంలో తలుపును బిగించాలి.
అదేసమయంలో నైరుతీ వైపున రెండు బెడ్‌రూంలు కట్టాల్సి వచ్చినప్పుడు వాస్తు ప్రకారం బాత్‌రూమ్‌ల నిర్మాణం కాస్త మారుతుంది. ఈ సమయంలో తొలుత నైరతీలో ఓ గదిని కట్టి దానికి తూర్పు వైపున రెండు బాత్‌రూమ్‌లు నిర్మించాలి. అలాగే రెండో బాత్‌రూమ్‌ను ఆనుకుని తూర్పువైపున మరో పడకగదిని నిర్మించాలి.
అయితే ఈ రకమైన నిర్మాణాల్లో అన్ని నిర్మాణాలు కూడా దక్షిణగదిని ఆనుకుని ఉండడం అవశ్యం. ఇక నైరుతి వైపు నుండి తూర్పుభాగం వైపు దక్షిణ గోడను ఆనుకుని నిర్మించిన పడకగదిలో దక్షిణంవైపు తల ఉండేలా నిద్రించే ఏర్పాటు చేసుకోండి.
ఇలా చేయడం వల్ల ఉదయాన్నే నిద్ర లేచే సమయంలో తొలుత ఉత్తరాన్ని చూసి ఆ దిశగా నడిచి పశ్చిమంగా, వాయువ్యంలో నిర్మించిన బాత్‌రూమ్‌కు చేరుకుంటారు. ఇలా చేయడం వల్ల గృహంలోని వారికి శుభం కల్గుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Comments
Post a Comment