మృగశిర కార్తె 8-6-2016 వచ్చిందంటే సకలజనులకు వూరట కలుగుతుంది. అప్పటివరకు గ్రీష్మతాపంతో అల్లాడుతున్న సర్వకోటి జీవాలు తొలకరిజల్లులతో స్వాంతన చెందుతారు. రోహిణికార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయి. అనంతరం మృగశిర కార్తె వస్తుంది. రుతుపవనాల రాకను మృగశిరకార్తె ఆహ్వానిస్తుంది. చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ రాశి ప్రారంభమవుతుంది. జింక తల కలిగివుండటంతో ఈ కార్తెను మృగశిరకార్తెగా వ్యవహరిస్తారు. ఈ కార్తె మనదేశంపై విశేషప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ రాశిలోనే నైరుతి రుతువపనాలు భారత్‌లోకి ప్రవేశిస్తాయి. అప్పటివరకు నిప్పులు చెలరేగిన భానుడి కిరణాలు నల్లటి మేఘాల ప్రభావంతో చల్లబడుతాయి. దేశానికి జీవధార అయిన వర్షాలతో నేలతల్లి పులకరిస్తుంది. రైతులు తొలకరి జల్లులు పడగానే దుక్కి దున్ని పంటలు వేసేందుకు సిద్ధమవుతారు. ఏరువాకసాగే కాలం అని కూడా అంటారు. ఈ నక్షత్రం దేవగణానికి చెందినది. అధిపతి కుజుడు. రాశి అధిపతులు శుక్రుడు, బుధుడు. ఈ నక్షత్రంలో జన్మించినవారు మంచి అదృష్టం కలిగివుంటారు. ఇంగువ బెల్లం కలిపిన మిశ్రమం గులికను పరిగడుపున వేసుకోవాలి.
పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె, విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు, రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు బాదాం పలుకుల బాస్కెట్, etc . తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్, సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా. పురోహిత్ దక్షిణ ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.
Comments
Post a Comment